breaking news
plagiarism
-
బాలీవుడ్ నుండి సౌత్ సినిమా వరకు.. ‘ప్లాగరిజం’ వివాదాలు!
సాహిత్యంలో నవలలు, నాన్-ఫిక్షన్, వ్యాసాలు, పీహెచ్డీ థీసిస్‌ల విషయంలో ‘ప్లాగరిజం’ (సాహిత్య చోరీ లేదా భావజాల దొంగతనం) అనే పదం సాధారణంగా వినిపిస్తూ ఉంటుంది. అయితే నాటకాలు, లలిత కళలు, సినిమా వంటి ఇతర సాంస్కృతిక, సృజనాత్మక రంగాలకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ‘ప్లాగరిజం’ నిబంధనలను అత్యధికంగా ఉల్లంఘిస్తున్న రంగం బహుశా సినిమానే అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే 1970లలో లేదా మరెప్పుడో ప్రపంచంలో ఎక్కడో తీసిన ఒక సినిమాను కాపీ కొట్టడం లేదా దాదాపుగా దానినే పోలిన చిత్రాన్ని రూపొందిండం, దానికి ఆధునిక పాత్రలను అద్దడం, కథలో చిన్న మార్పులు చేయడం, కథనంలో మాత్రం స్వల్ప పోలికలను ఉంచుకుని దానిని తమ సొంత సృష్టిగా ప్రచారం చేసుకోవడం చిత్రనిర్మాతలకు సులభం కావడంతో ఇది అత్యంత సాధారణంగా జరుగుతుంటుంది.‘ప్లాగరిజం’ అంటే..ఒకరి ఆలోచనలు, సమాచారం, భాష లేదా రచనను అసలు మూలాన్ని తగిన విధంగా గుర్తించకుండా (క్రెడిట్స్ ఇవ్వకుండా) ఉపయోగించడాన్ని ‘ప్లాగరిజం’ అంటారు. అసలైనదిగా నమ్మించే ప్రయత్నంలో ఒక రకమైన అనైతికత ఉండటం దీనిలోని ప్రధానాంశం. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు జరిగే కాపీరైట్ ఉల్లంఘనకు, ‘ప్లాగరిజం’నకు ఎప్పుడూ ఒకే అర్థం ఉండదు. బౌద్ధిక ఆస్తి (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ) రంగానికి చెందిన చాలా పదాల మాదిరిగానే, ‘ప్లాగరిజం’ కూడా ఆధునిక యుగానికి చెందిన భావనగా పరిణమించింది. భారతీయ లేదా అంతర్జాతీయ చలనచిత్రాల నుంచి కథలు, పాత్రలు, థీమ్‌లు, కథనాలను ‘అరువు తెచ్చుకోవడం’, ‘స్ఫూర్తి పొందడం’, ‘ప్రేరణ పొందడం’ లేదా ‘అడాప్ట్ చేసుకోవడం’ వంటివి హిందీ చలనచిత్ర పరిశ్రమలో కోకొల్లలుగా ఉన్నాయి.చార్లీ చాప్లిన్ సినిమా సినిమాతో..ఈ కోవలో ముందుగా గుర్తుకు వచ్చే చిత్రం రాజ్ కపూర్ నిర్మించిన ‘శ్రీ 420’. చార్లీ చాప్లిన్ సినిమా ‘ట్రాంప్’ (అవసరాల కోసం తిరిగే వ్యక్తి) ఇమేజ్ను స్ఫూర్తిగా తీసుకున్నారనే విమర్శలను ఈ చిత్రం ఎదుర్కొంది. రాజ్ కపూర్, నర్గిస్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘చోరీ చోరీ’ (1956) చిత్రం, క్లార్క్ గేబుల్, క్లాడియా కోల్బర్ట్ నటించిన హాలీవుడ్ హిట్ చిత్రం ‘ఇట్ హ్యాపెండ్ వన్ నైట్’ (1934)కి కాపీయే. ‘ఫిర్ సుభా హోగి’ (1958) చిత్రంలో రాజ్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. ఇది దోస్తోవ్స్కీ రాసిన సామాజిక దృక్పథం కలిగిన ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ నవల ఆధారంగా రూపుదిద్దుకుంది. క్వెంటిన్ టరాంటినో చిత్రం ‘రిజర్వాయర్ డాగ్స్’కి రీమేక్‌గా వచ్చిన ‘కాంటే’ చిత్రంలో బ్యాంక్ దొంగతనం నేపథ్యంలో బాలీవుడ్ పాటలు, నృత్యాలను జోడించారు.నైతికపరమైన ఉల్లంఘన 1991లో మహేష్ భట్ దర్శకత్వంలో, ఆయన కూతురు పూజా భట్, అమీర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో అదే (కాంటే) సినిమాకు ఆధునికత, గ్లామరస్ జోడించి ‘దిల్ హై కి మాన్తా నహీ’ వచ్చింది. కాపీకి మూలమైన చిత్రం లేదా దర్శకుడి పేరును టైటిల్స్‌లో పేర్కొంటే ‘ప్లాగరిజం’ చేసినట్లు కాదు. కానీ చాలా సందర్భాలలో ఇది జరగదు. అయినా వారు నైతికపరమైన నిజాయితీని ఉల్లంఘించినవారవుతారు (చట్టపరంగా కాకపోయినా). జాన్ అబ్రహాం, నానా పటేకర్ నటించిన ‘టాక్సీ నంబర్ 9211’ (2006) చిత్రం, బెన్ అఫ్లెక్, శామ్యూల్ జాక్సన్ నటించిన ‘చేంజింగ్ లేన్స్’ (2002) ఆధారంగా తెరకెక్కిందని చెబుతారు.మోహన్‌లాల్.. ‘నేరు’పెద్ద దర్శకులు, భారీ బడ్జెట్ సినిమాలు ‘ప్లాగరిజం’ చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటుంటాయి. స్క్రిప్ట్‌లు, సన్నివేశాలు లేదా పాటలను కాపీ చేశారనే ఆరోపణలపై అనేక చిత్రాలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. అయితే విదేశీ నిర్మాతలు, బ్యానర్లు వీటిని పట్టించుకోరు. దక్షిణాది రాష్ట్రాల సినిమాలు దీనికి మినహాయింపు కాదు. మలయాళ చిత్రం ‘నేరు’ (2023) విషయంలో, పిటిషనర్ దీపక్ ఉన్ని కేరళ హైకోర్టును ఆశ్రయించారు. జీతూ జోసఫ్, మోహన్‌లాల్ తెరకెక్కించిన ఈ కోర్టు రూమ్ డ్రామాలో తాను ఇదివరకే వారికి చెప్పిన స్క్రిప్ట్ లోని ఆలోచనలను ఉపయోగించారని ఆయన ఆరోపించారు. జీతూ జోసఫ్ దర్శకత్వం వహించిన ‘నేరు’ విడుదలపై కేరళ హైకోర్టు స్టే నిరాకరించింది. ఇక్కడ చిత్రంలో మోహన్‌లాల్ పెద్ద స్టార్‌గా ఉండటమే కారణం కావచ్చని అంటారు.కమల్ హాసన్.. ‘పాపనాశం’కమల్ హాసన్ కూడా తన కొన్ని సినిమాల్లో ‘ప్లాగరిజం’ ఆరోపణలను ఎదుర్కొన్నారు. దీనికి ఒక ఉదాహరణ ‘పాపనాశం’. ‘ఒరు మజక్కాలతు’ నవల కాపీరైట్లను ఉల్లంఘించారంటూ సతీష్ పాల్ నిర్మాతలు, దర్శకుడు జీతూ జోసఫ్‌పై దావా వేశారు. అయితే చిత్ర నిర్మాతలు, కమల్ హాసన్ మద్దతుతో దర్శకుడు జీతూ జోసఫ్ ఆ కేసును విజయవంతంగా ఎదుర్కొన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, సోనాక్షి సిన్హా నటించిన తమిళ చిత్రం ‘లింగా’పై మధురైకి చెందిన చిత్రనిర్మాత కె.వి. రవి రత్నం ఇది తన అసలు కథ అని ఆరోపించారు. అయితే ‘లింగా’ దర్శకుడు కె.ఎస్. రవికుమార్, రజనీకాంత్ స్వయంగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తూ, ‘లింగా’ పొన్కుమరన్ రాసిన కథ ఆధారంగా తెరకెక్కిందని తెలిపారు.ముంబై ఫిలింమేకర్స్ మాట ఇదే..జాతీయ అవార్డు గెలుచుకున్న కన్నడ చిత్రం ‘బ్యారి’ చట్టపరమైన పోరాటాన్ని ఎదుర్కొంది. చివరకు రచయిత్రి సారా అబూబక్కర్ నవలను అనధికారికంగా అడాప్ట్ చేసుకున్నందుకు ఆమెకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. అలాగే మ్యూజికల్ సిమిలారిటీకి సంబంధించి కాపీరైట్ క్లెయిమ్‌ల కారణంగా ‘కాంతారా’ చిత్రం హిట్ ట్రాక్ ‘వరాహ రూపం’ చట్టపరమైన ఆంక్షలు ఎదుర్కొంది. లక్ష్మణ్ దర్శకత్వం వహించి జయం రవి, అరవింద్ స్వామి నటించిన ‘బోగన్’ చిత్రం 2017లో ‘ప్లాగరిజం’ వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ భారతీయ చలనచిత్ర విశ్లేషకుడు ఎంకే రాఘవేంద్ర రాసిన ‘ప్లాగిరిజంగ్ ఫర్ బాలీవుడ్’ అనే పత్రం ప్రకారం ‘పాపులర్ ఇండియన్ సినిమా హాలీవుడ్‌ను అనుకరిస్తుందని భావిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో పశ్చిమ దేశాల సినిమాలతో పోలిస్తే తమ చిత్రాల కంటెంట్, ఫార్మాట్ భిన్నంగా ఉంటాయని ముంబై ఫిలింమేకర్స్ చెబుతున్నారు. భారతీయ ప్రేక్షకుల కోసం సినిమాలు తీయడంలో నిర్దిష్టమైన పద్ధతి ఉంటుందని వారు చెబుతున్నారు. అయితే హాలీవుడ్ ‘కాపీ’ చిత్రాలు విజయవంతం కావాలంటే ఆ చిత్రాల్లో భారతీయుల తీరు తెన్నులను, ఇక్కడి సంస్కృతిని సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. అయితే ఇతరుల భావాలు, కాన్సెప్ట్‌ల ద్వారా ‘స్ఫూర్తి’ పొందడాన్ని, వాటికి భాష, సాంస్కృతిక కోణాలు, భారతీయతను జోడించి సినిమాలు తీయడాన్ని రాఘవేంద్ర సైద్ధాంతికంగా వ్యతిరేకించ లేదు. ఇది కూడా చదవండి: రష్యా నుంచి భారత్‌కు రైలు.. కొత్త కారిడార్ ప్లాన్? -
‘దారుణం, అతడి ప్రతిభను కొట్టేశారు’
హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్, సింగర్ బాద్షాపై నెటిజన్లు గరం అవుతున్నారు. ఇతరుల ప్రతిభను కొట్టేసి అది మీదేనని చెప్పుకోడానికి మనసెలా వచ్చిందని నిలదీస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఆడిపాడిన మ్యూజిక్ ఆల్బమ్ ‘జెండా ఫూల్’ ఈ మధ్యే రిలీజ్ అయింది. దీనికి ఎంతగా విశేష ఆదరణ దక్కిందో, అంతే స్థాయిలో విమర్శలపాలవుతోంది. దీని మూలాలు బెంగాలీ పాటను గుర్తు చేస్తున్నాయి. దీంతో ఇది బెంగాలీ ఫోక్ సాంగ్ అని, ఒరిజినల్ పాటకు కర్త, కర్మ, క్రియ అయిన జానపద కళాకారునికి గుర్తింపునివ్వకపోవడం దారుణమని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అతడి అనుమతి లేకుండా నిర్దాక్షిణ్యంగా కాపీ కొట్టారని విరుచుకుపడుతున్నారు. ఈ విషయం గురించి బెంగాలీ సంగీతకారుడు రోహన్ దాస్‌గుప్తా స్పందిస్తూ.. ‘రతన్ కహార్ అనే బెంగాల్ జానపద కళాకారుడు ఈ పాటను రూపొందించడంతోపాటు తానే స్వయంగా లిరిక్స్ రాసి పాడాడు. ఇప్పుడు వచ్చిన జెండా ఫూల్.. అతను 1970లో "బోరోలోకర్ బీటీ లో" అంటూ గొంతెత్తి పాడాడు. దురదృష్టమేంటంటే తాజా పాట సంగీతం, లిరిక్స్‌పై హక్కులు కోరుతూ దావా వేసేందుకు అతని దగ్గర డబ్బు లేదు. కానీ ఈ పాట అచ్చంగా అతనిదేనన్న నిజం అందరికీ తెలియాలి’ అని కోరుతూ ట్వీట్ చేశాడు. యూట్యూబ్‌లో ‘జెండా ఫూల్’ పాట వీడియోలో అతని పేరును కూడా చేర్చాలంటూ పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా రతన్ కహార్ పశ్చిమ బెంగాల్‌లోని బిర్భుమ్ జిల్లాలో శౌరి గ్రామంలో నివసిస్తున్నారు. (సాహో : ఒక్కపాటకు 2 కోట్ల పారితోషికం!) -
భావచౌర్యం కట్టడికి యూజీసీ కొత్త విధానం!
న్యూఢిల్లీ: భావచౌర్యాన్ని కట్టడి చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త ముసాయిదా విధానాన్ని రూపొందించింది. విద్యార్థులు బాధ్యతగా కొత్త అధ్యయనాలు చేసేందుకు, కాపీ కొట్టకుండా పరిశోధనా వ్యాసాలు రాసేందుకు ఈ చర్య దోహదపడనుంది. ఒకే తరహా వ్యాసాలను గుర్తించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ముసాయిదా పేర్కొంది. ఇతరుల వ్యాసాలను కాపీ కొట్టకుండా, అంతగా అవసరమైతే మూల వ్యాసం రాసిన వారి అనుమతి తీసుకుని ఆ సమాచారాన్ని వాడుకునేలా విద్యార్థులు, ఉపాధ్యాయులకు కళాశాలల యాజమాన్యాలు సూచనలివ్వాలనే నిబంధన ముసాయిదాలో ఉంది. పరిశోధన సాగించడం, ప్రాజెక్టు వర్కు పూర్తి చేయడం, వ్యాసాలు రాయడం తదితర అంశాలపై కళాశాలలు అవగాహాన సదస్సులు నిర్వహించాలని ముసాయిదా పేర్కొంటుంది. -
చేతన్ భగత్ నవలపై దుమారం!
ప్రముఖ రచయిత చేతన్ భగత్ తాజా నవల ‘వన్ ఇండియన్ గర్ల్’ చుట్టు వివాదం ముసురుకుంది. ఈ నవలలో చేతన్ గ్రంథచౌర్యానికి పాల్పడ్డారని, తాను రాసిన ఓ కథను కాపీకొట్టి ఆయన నవలను రాశారని బెంగళూరుకు చెందిన రచయిత్రి కోర్టును ఆశ్రయించింది. చేతన్ నవల ’ఫైవ్ పాయింట్ సమ్‌వన్’ను ఢిల్లీ యూనివర్సిటీ పాఠ్యాంశంగా తీసుకున్న సమయంలో ఈ ఆరోపణలు వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాతో ఈ అంశం పెద్ద దుమారం రేపుతోంది. చేతన్ భగత్ తన కథ ‘డ్రాయింగ్ ప్యారలల్స్’ను కాపీ కొట్టారని బెంగళూరు రచయిత్రి అన్విత బాజ్‌పేయి దావా వేశారు. 2014లో బెంగళూరు సాహిత్సోత్సవానికి వచ్చిన సందర్భంగా తన కథల సంకలనం ‘లైఫ్, ఆడ్స్ అండ్ ఎండ్స్’ను ఆయనకు సమీక్ష కోసం ఇచ్చానని, అందులోని కథను ఆయన గ్రంథచౌర్యం చేసి ‘వన్ ఇండియన్ గర్ల్’ నవల కోసం వాడుకున్నారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు పూర్తి వివరాలతో ఆమె ఫేస్బుక్లో పెట్టిన పోస్టు ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతోంది.


