breaking news
Pittsburgh University
-
డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్‌లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్‌లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. -
టీవీ చూస్తే చక్కెర వ్యాధి!
న్యూయార్క్: టీవీలో మీకు ఇష్టమైన కార్యక్రమాన్ని వీక్షించేందుకు కూర్చుకునే ముందు మరోసారి ఆలోచించుకోండి. ఎందుకంటే 'ఇడియట్ బాక్స్' ముందు గడిపే ప్రతిగంట మిమ్మల్ని డయాబెటిస్ కు దగ్గర చేస్తుంది. ప్రతిరోజు గంటపాటు టీవీ ముందు గడిపేవారు డయాబెటిస్ బారిప పడే అవకాశాలు ఎక్కువని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మిగతా వారితో పోల్చుకుంటే టీవీ ముందు ఎక్కువసేపు కూర్చునేవారికి మధుమేహం వచ్చే అవకాశాలు 3 శాతం అధికమని అమెరికా నేషనల్ ఇన్సిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ సహకారంతో డయాబెటిస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్(డీపీపీ) అధ్యయనంతో తేలింది. మారుతున్న జీవనశైలి కారణంగా మధుమేహం బాధితుల సంఖ్య పెరుగుతోందని ఈ అధ్యయం రుజువుచేసిందని పిట్స్ బర్గ్ యూనివర్సిటీ సీనియర్ రచయిత ఆండ్రియా క్రిస్కా అన్నారు. కదలకుండా ఎక్కువసేపు కూర్చునే వారు అధికంగా రోగాల బారిన అవకాశముందని వివరించారు. శరీరక వ్యాయామంతో చలాకీగా ఉండడంతో పాటు చక్కెర వ్యాధి, ఊబకాయం రాకుండా చూసుకోవచ్చని సలహాయిచ్చారు.