breaking news
piratla venateswarlu
-
కృష్ణా పత్రిక ఎడిటర్ పిరాట్ల కన్నుమూత
-
కృష్ణా పత్రిక ఎడిటర్ పిరాట్ల కన్నుమూత
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు, కృష్ణా పత్రిక ఎడిటర్ పిరాట్ల వెంకటేశ్వర్లు సోమవారం రాత్రి కన్నుమూశారు. నారాయణగూడలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన రాత్రి 7.45 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను నవంబర్ 21న ఆస్పత్రిలో చేర్చారు. శుక్రవారం నుంచి ఆయన వెంటలేటర్ మీద ఉన్నారు. యూరిన్ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తులు పాడైపోవడంతో ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. పిరాట్ల వెంకటేశ్వర్లు మరణం పట్ల జర్నలిస్టు సంఘాలు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.