breaking news
piracy gang
-
దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు సహా పలు భాషల సినిమాలను పైరసీ చేసిన ముఠా వివరాలన సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. పైరసీపై తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నాలుగు నెలలు దర్యాప్తు చేశాం. దేశంలో మొదటిసారి ఓ గ్యాంగ్‌ను పట్టుకున్నామని సీపీ తెలిపారు.‘‘పైరసీ వల్ల సినిమా నిర్మాతల కష్టం వృథా అవుతుంది. మూవీ ఇండస్ట్రీ బాగా ఎఫెక్ట్ అవుతుంది. 2023లో దేశంలో మూవీ ఇండస్ట్రీ 22,400 కోట్లు పైరసీ వల్ల నష్టపోయారు. 2024లో తెలుగు ఇండస్ట్రీ 3700 కోట్లు నష్టపోయారు. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని లోతైన దర్యాప్తు చేశాం. పైరసీ మూవీస్ వల్ల ఆన్లైన్ బెట్టింగ్‌కు కూడా ప్రేక్షకులు అలవాటు పడుతున్నారు. టారెంట్ వెబ్సైట్, టెలిగ్రామ్ ద్వారా పైరసీ మూవీలు స్ట్రీమింగ్ చేస్తున్నారు...సర్వర్స్ హ్యాకింగ్‌తో పాటు క్యామ్ కార్డర్ ద్వారా నిందితులు సినిమాలను పైరసీ చేస్తున్నారు. బెట్టింగ్ గేమింగ్ యాప్స్ నిర్వాహకులు పైరసీ చేసేవారికి డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు పైరసీ మూవీల ద్వారా తన యాప్‌లను ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు అందుకున్న వెంటనే బృందాలను ఏర్పాటు చేశాముతమిళ్ బ్లాస్టర్స్, ఫైవ్ మూవీ రూల్స్, తమిళ్ మూవీ వెబ్సైట్లో పైరసీ సినిమాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన జానా కిరణ్ కుమార్.. అత్తాపూర్‌లోని మంత్ర మాల్ థియేటర్లో సినిమా కాపీ చేసాడు. ఫిర్యాదు అనంతరం 44 మంది అనుమానితులను విచారించి జానా కిరణ్ కుమార్ నిందితుడని తేలింది. సింగిల్, అనేక మూవీని అత్తాపూర్‌లోని మంత్ర థియేటర్లో మొబైల్‌తో రికార్డ్ చేసి సిరిల్ అనే వ్యక్తికి అందచేశారు. నలభై మూవీలు థియేటర్ లో కాపీ చేసాడు.150 నుండి 500 డాలర్లు ప్రతి మూవీ కాపీ చేసినందుకు ఇస్తున్నారు. సూటబుల్ సీటు చూసుకుని టికెట్ బుక్ చేసుకుని హై ఎండ్ కెమెరా ఉన్న ఫోన్ తో రికార్డ్ చేస్తారు. స్క్రీన్ ఆఫ్ ఉన్నా కెమెరాల్లో వీడియో రికార్డ్ చేసే యాప్ ద్వారా అనుమానం రాకుండా ఇదంతా చేస్తున్నారు. అర్సలన్ అహ్మద్ బీహార్ కు చెందిన వాడు. ఇతను కూడా హిందీ భోజ్‌పురి సినిమాలు రికార్డ్ చేసి సిరల్కు పంపుతున్నాడు. సుధాకరన్ సత్యమంగళానికి చెందిన వ్యక్తి.. ఇతను కూడా సినిమాలు పైరసీ చేసి సిరిల్‌కు ఇస్తాడు. కరూర్‌కు చెందిన సిరిల్ ప్రధాన నిందితుడు. నాలుగు వెబ్సైట్లు 2020 నుంచి నడుపుతున్నాడు. కంప్యూటర్ సైన్స్ చేసి ఈజీ మనీకి అలవాటు పడి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏజెంట్లను నియమించుకుని అన్ని భాషల సినిమాలను పైరసీ చేశాడు.’’ అని సీపీ వెల్లడించారు. -
‘యాంటీ’ ముసుగు.. పైరసీ లొసుగు
♦ బాహుబలి–2 పైరసీ ముఠా నాయకుడి వ్యవహారం ఇదీ ♦ ఢిల్లీలో యాంటీ పైరసీ వింగ్ అంటూ కార్యాలయం ♦ అక్కడి నుంచే పైరసీ సినిమాల దందా, బెదిరింపులు ♦ త్వరలో సినీ రంగంతో సీసీఎస్ పోలీసుల సమావేశం సాక్షి, హైదరాబాద్: బాహుబలి–2 చిత్రాన్ని పైరసీ చేయడమే కాదు.. నిర్మాతలకు ‘సిని మా’చూపించిన ముఠా నాయకుడి స్టైలే వేరు. ఢిల్లీ కేంద్రంగా పైరసీకి వ్యతిరేకంగా పోరాడే ఏజెన్సీ ఏర్పాటు చేసి.. దాని ముసుగులోనే అనేక చిత్రాలను పైరసీ చేయడంతో పాటు విక్రయించి, నిర్మాతల్ని బెదిరించి సొమ్ము చేసుకుంటున్నాడని సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ముఠాను సోమవారం అరెస్టు చేసిన పోలీసులు.. విచారణలో అనేక కీలకాంశాలను గుర్తించారు. ప్రీతంపురలో ఆఫీస్ ఏర్పాటు చేసి.. ఢిల్లీకి చెందిన రాహుల్ మెహతా ప్రీతంపురలో కార్యాలయం ఏర్పాటు చేసి.. జితేందర్కుమా ర్ మెహతా, తౌఫీఖ్, మహ్మద్ అలీతో పాటు మరికొందరిని ఉద్యోగులుగా తీసుకున్నాడు. తమది సినిమా పైరసీకి వ్యతిరేకంగా పనిచేసే యాంటీ పైరసీ వింగ్ అని ప్రచారం చేసుకు న్నాడు. దీని ముసుగులోనే కొత్త చిత్రాల పైరసీని ప్రోత్సహించడం ప్రారంభించాడు. యాంటీ పైరసీ వింగ్ కావడంతో బాలీవుడ్‌తో నూ పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యం లోనే బాహుబలి–2 పైరసీ సీడీ చేతికి వచ్చిన వెంటనే రాహుల్ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌నే సంప్రదించగలిగాడు. ఎక్కడా నేరుగా పాల్గొనడు.. పైరసీ సినిమాల విక్రయం, ఆ సీడీలు చూపిం చి నిర్మాతల్ని బెదిరించి డబ్బు గుంజడంతో దిట్టగా పేరున్న రాహుల్ మెహతా ఏ సంద ర్భంలోనూ నేరుగా పైరసీ చేయడు. తన అను చరులతో చేయించడమో, పైరసీ సీడీలను చేజిక్కించుకుని దందాలకు దిగడమో చేస్తుం టాడు. 2015లో బాహుబలి చిత్రాన్ని సైతం ఈ ముఠా పైరసీ చేసింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ కేంద్రంగా తన అనుచరులతో ఈ పని చేయించి.. నెట్లో పెట్టి సొమ్ము చేసుకు న్నాడు. అయితే బాహుబలి–2 పైరసీ ఎలా చేశారనే విషయాన్ని రాహుల్ పట్టించుకోలే దు. సీడీ తన చేతికి రాగానే బేరసారాలకు దిగాడు. పటిష్ట సెక్షన్ల కింద కేసు నమోదు.. సాధారణంగా పైరసీకి సంబంధించి కాపీ రైట్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు. దీంతో నిందితులు తేలిగ్గా బెయిల్ పొంది బయటకు వస్తున్నారు. దీన్నే ఆసరాగా చేసుకున్న రాహు ల్ గ్యాంగ్ దాదాపు 30 హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలను పైరసీ చేసింది. దీన్ని గమనించిన సీసీఎస్ పోలీసులు.. బాహు బలి–2 ఉదంతంలో డిస్ట్రిబ్యూటర్ను మోసం చేయడం, అంతా కలసి కుట్రపన్నడం, నిర్మాతలను బెదిరించడం.. ఎపిసోడ్లను పరిగణనలోకి తీసుకుని ఆయా సెక్షన్లనూ జోడించి కేసు నమోదు చేశారు. దీంతో నిందితులకు తేలిగ్గా బెయిల్ లభించదని, నేరం నిరూపణ అయితే ఎక్కువకాలం శిక్ష పడుతుందని అధికారులు చెప్తున్నారు.


