breaking news
Photo fun
-
ఇదెక్కడి వింత.. ఫొటోల కోసం ఫైటింగ్.. వరుడికి తిక్కరేగి..
విందులో మాంసం పెట్టలేదని పెళ్లి రద్దు చేసుకునేదాకా వచ్చిన ఘటన ఇటీవలే చూశాం. పెళ్లి తరువాత ఫొటోల కోసం ఇరుపక్షాల బంధువులు కొట్లాడుకుని గాయాలపాలైన సంఘటన యూపీలో జరిగింది. వివరాల ప్రకారం.. యూపీ, డియోరియా జిల్లాలోని మాధవ్‌పూర్ గ్రామంలో అంగరంగవైభవంగా పెళ్లి జరుగుతోంది. వరమాల పూర్తవ్వగానే ‘మేం మొదట ఫొటోలు దిగుతాం’ అని అబ్బాయివారు, ‘లేదు మేమే ముందు దిగుతాం’ అని అమ్మాయి వాళ్ల మధ్య వాదన మొదలైంది. అసలే రాత్రిపూట పెళ్లి... విందులో మద్యం లేకుండా ఉండదు కదా! తాగి ఉన్న అబ్బాయి బంధువులు ‘మేమే ముందు తీసుకుంటా’మంటూ పట్టుబట్టారు. వాదన కాస్త భౌతిక దాడుల దాకా వెళ్లింది. కొందరు పెద్దలు వారించేందుకు ప్రయతి్నంచినా.. ‘తగ్గేదేల్యా’ అన్నారు బంధువులు. ఫలితం ఇరుపక్షాల వారికి తీవ్రమైన గాయాలయ్యాయి. అబ్బాయి సోదరి కూడా గాయపడింది. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి అయితే వచ్చింది కానీ.. ఈ ఘటనలతో విసుగు చెందిన అబ్బాయి మాత్రం తాళి కట్టేందుకు ససేమిరా అన్నాడు. చివరకు మనసు మార్చుకుని తాళి కట్టడంతో కథ సుఖాంతమైంది. ఆ తరువాత ఫొటోలు ఎవరు ముందు దిగారో?. -
ప్రాణం తీసిన ఫొటో సరదా
గోదావరిఖని: వేగంగా వస్తున్న రైలు ముందు నిలబడి ఫొటో దిగాలన్న కోరిక ఓ యువకుడి ప్రాణం తీసింది. గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన నస్పూరి సంపత్(32) ఓసీపీ–3 ప్రైవే టు ఓబీ కంపెనీలో డంపర్ ఆపరే టర్ గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌లోని అల్వాల్ వద్ద మిత్రుడి వివాహం ఉండ డంతో స్నేహితులతో కలసి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం అల్వాల్ రైల్వే స్టేషన్ సమీపంలో మిత్రులతో కలసి వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా నిల బడి ఫొటో దిగాలన్న కోరిక కలిగింది. హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేసే శ్రావణ్‌కుమార్‌తో ఫొటో దిగుతుండగా... మరో స్నేహితుడు ఫొటో తీస్తున్నాడు. వెనుకనుంచి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు అతి సమీపం లోకి వచ్చినా గమనించకుండా ఏమరుపాటుగా ఉండడంతో రైలు ఢీకొని సంపత్ అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రావణ్‌కుమార్ చేయి నుజ్జునుజ్జు అయ్యింది. సంపత్‌కు భార్య, కవల పిల్లలున్నారు.