breaking news
phonecalls
-
కుటుంబసభ్యులే గూఢచారులు!
హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్న ఓ యువకుడు డ్రగ్స్‌కు బానిసయ్యాడు. మత్తు ఇంజక్షన్ కావాలని రోజుకు రూ.500 ఇవ్వాలంటూ తల్లిదండ్రులను వేధించేవాడు. ఎన్నిసార్లు వద్దని వారించినా వినిపించుకోకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవాడు.చివరకు ఆ యువకుడి తల్లిదండ్రులు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు.దీంతో యువకుడ్ని అదుపులోకి తీసుకొని పోలీసులువిచారించగా, ఈ మత్తుఇంజక్షన్లను బిహార్ నుంచికొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నట్టు చెప్పాడు. లావాదేవీలు, కొరియర్లపై నిఘా పెట్టినపోలీసులు ఆ నెట్వర్క్నుబ్రేక్ చేసి స్థానిక పోలీసులకుఅప్పగించారు. సాక్షి, హైదరాబాద్: మాదక ద్రవ్యాల నుంచి తమ పిల్లలను రక్షించేందుకు తల్లిదండ్రులు తపన పడుతున్నారు. కుటుంబసభ్యులే పోలీసులకు గూఢచారులుగా మారుతున్నారు. మాదక ద్రవ్యాల బాధిత కుటుంబసభ్యులను విశ్వసిస్తున్న పోలీసులు, వారి సమాచారంపై నిఘా పెట్టి డ్రగ్స్ పెడ్లర్లు, నెట్‌వర్క్‌ల ఆట కట్టిస్తున్నారు. డీ–అడిక్షన్ సెంటర్లకు.. మత్తు మహమ్మారి నుంచి తమ పిల్లలను బయటపడేసి, వారిని మాములు మనుషులుగా మార్చాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్న తమ పిల్లలు ఉజ్వల భవిష్యత్ నాశనం చేసుకోవడమే కాకుండా నిత్యం తల్లిదండ్రులకు ఇంట్లో నరకం చూపిస్తున్నారు. గత నెల రోజుల్లో 20కు పైగా కుటుంబసభ్యులు తమ పిల్లల ప్రవర్తన గురించి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో (టీజీ న్యాబ్)కు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, వారికి మాదక ద్రవ్యాల గుర్తింపు కిట్స్ ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఇందులో కొంతమంది దగ్గర డ్రగ్స్, గంజాయి దొరకగా.. మరికొందరిలో డ్రగ్స్ తీసుకున్నట్టు పరీక్షల్లో తేలింది. మత్తుపదార్థాలు దొరికిన వారికి వినియోగదారుల కింద కేసులు నమోదు చేసి వారిని డీ–అడిక్షన్ కేంద్రాలకు పంపించారు. ఇలా కుటుంబ సభ్యుల నుంచి రోజుకు 3–5 కాల్స్ వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం.. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు డ్రగ్స్ నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. మాదక ద్రవ్యాలను తరిమికొట్టాలని ఇటీవల ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో సినీ హీరోలు, సెలబ్రిటీలతో లఘు చిత్రాలు చిత్రీకరించారు. జూనియర్ ఎనీ్టఆర్ రిలీజ్ చేసిన ఓ వీడియోకు ఒక్క రోజే 3.75 లక్షలు, మెగాస్టార్ చిరంజీవి వీడియోకు లక్షల్లో వ్యూస్ రావడం గమనార్హం. -
డయల్ యువర్ కలెక్టర్‌కు స్పందన
మహారాణిపేట : డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి 13 ఫోన్ కాల్స్ వచ్చాయి. జేసీ–2 డి.వెంకటరెడ్డి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఫోన్ ద్వారా చెప్పిన వివరాలను నోట్ చేసుకొని పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసారు. బక్కన్నపాలెం ఏరియాలో అటవీ శాఖకు చెందిన భూములు ఆక్రమణకు గురవుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. మీ కోసంకు 362 ఫిర్యాదులు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 362 వినతులు వచ్చాయి. జేసీ–2 డి.వెంకటరెడ్డి, డీఆర్వో సి.చంద్రశేఖర్‌రెడ్డి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.