డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు స్పందన | dail your collector | Sakshi
Sakshi News home page

డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు స్పందన

Aug 8 2016 11:55 PM | Updated on Mar 21 2019 8:35 PM

డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి 13 ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి.

 మహారాణిపేట : డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి 13 ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. జేసీ–2 డి.వెంకటరెడ్డి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఫోన్‌ ద్వారా చెప్పిన వివరాలను నోట్‌ చేసుకొని పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేసారు. బక్కన్నపాలెం ఏరియాలో అటవీ శాఖకు చెందిన భూములు ఆక్రమణకు గురవుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. 
మీ కోసంకు 362 ఫిర్యాదులు
కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 362 వినతులు వచ్చాయి. జేసీ–2 డి.వెంకటరెడ్డి, డీఆర్వో సి.చంద్రశేఖర్‌రెడ్డి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement