Persian Gulf
-
భారత యుద్ధనౌకల మోహరింపు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ సమీపంలో భారత నావికాదళానికి చెందిన పలు యుద్ధనౌకలను మోహరించారు. అవసరమైనప్పుడు వాణిజ్య నౌకలకు సహాయం అందించేందుకు భారత నావికాదళ యుద్ధనౌకలు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.అంతకుముందు శనివారం, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) రవాణా చేస్తున్న రెండు భారత నౌకలకు ఇరాన్ అధికారులు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. వాటిలో ఒక నౌక ‘శివాలిక్’. నౌకా ట్రాఫిక్ పర్యవేక్షణ వెబ్సైట్ సమాచారం ప్రకారం, ఈ నౌక చివరిసారిగా గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో ఉన్నట్లు నమోదైంది. మార్చి 21 నాటికి అది తన గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో సముద్ర పరిస్థితులు, అలాగే భారతీయ నావికులు, నౌకల భద్రతను నిర్ధారించేందుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తాజా వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 668 మంది నావికులతో 24 భారత నౌకలు ప్రయాణిస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే హోర్ముజ్ జలసంధికి తూర్పు భాగంలో ఉన్న మూడు నౌకల్లో 76 మంది భారతీయ నావికులు ఉన్నట్లు పేర్కొంది.డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్, నౌక యజమానులు, ఆర్పీఎస్ఎల్ ఏజెన్సీలు, విదేశాల్లోని భారత మిషన్లతో సమన్వయం కొనసాగిస్తూ అన్ని భారత నౌకలు, సిబ్బందిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 24 గంటల కంట్రోల్ రూమ్ ప్రారంభించినప్పటి నుంచి డీజీ షిప్పింగ్ మొత్తం 2,425 కాల్స్, 4,441 ఈమెయిళ్లను పరిష్కరించిందని తెలిపింది. అంతేకాకుండా చిక్కుకుపోయిన 223 మందికిపైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ మధ్య హోర్ముజ్ జలసంధి గుండా భారత నౌకలకు సురక్షిత మార్గం కల్పిస్తామని భారతదేశంలోని ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీ ధ్రువీకరించారు. భారత్‌తో ఉన్న దీర్ఘకాల స్నేహం, పరస్పర ప్రయోజనాలను ఆయన ప్రస్తావించారు. -
సముద్రంలో చిక్కుకుపోయిన 28 భారత నౌకలు
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 28 భారతీయ నౌకలు చిక్కుకుపోయాయి. ఈ నౌకల్లో మొత్తం 778 మంది భారతీయ నావికులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నౌకల పరిస్థితి, సిబ్బంది భద్రతపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోంది.ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి పరిధిలోని పర్షియన్ గల్ఫ్‌లో 24 భారతీయ నౌకలు ఉన్నాయి. వీటిలో 677 మంది భారతీయ నావికులు ఉన్నారు. అదేవిధంగా జలసంధికి తూర్పు వైపున మరో నాలుగు నౌకలు ఉండగా, వాటిలో 101 మంది భారతీయ నావికులు సేవలందిస్తున్నారు.నౌకల్లో ఉన్న సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ అధికారులు నౌకల నిర్వహణ సంస్థలతో పాటు నావికుల కుటుంబాలతో కూడా నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ తాజా సమాచారాన్ని అందిస్తున్నారు.ఇదిలా ఉండగా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఈ కంట్రోల్ రూమ్ ప్రాంతీయ పరిణామాలను పర్యవేక్షిస్తూ, అవసరమైతే తక్షణ సహాయ చర్యలను సమన్వయం చేయనుంది.ఫిబ్రవరి 28న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ భారత జెండా కింద నడిచే నౌకలు, భారతీయ నావికులు అదనపు భద్రతా చర్యలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. భద్రతా ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా అనుసరించడంతో పాటు సిబ్బంది వివరాలను క్రమం తప్పకుండా అధికారులకు తెలియజేయాలని సూచించింది.అలాగే షిప్ మేనేజర్లు, రిక్రూటింగ్ ఏజెన్సీలు భారత రాయబార కార్యాలయాలు, స్థానిక అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని ఆదేశించింది. అవసరమైతే భారతీయ నావికులకు తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా, దేశంలోని ప్రధాన నౌకాశ్రయాల్లో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు అవసరమైన సహాయం అందించాలని అన్ని ప్రధాన పోర్టులకు సూచనలు జారీ చేసినట్లు పేర్కొంది.ప్రస్తుతం ప్రధాన నౌకాశ్రయాలు నౌకల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రాంతీయ పరిస్థితిని నిజ సమయంలో అంచనా వేస్తున్నాయి. అలాగే నౌకలు, కార్గో పరిస్థితిపై క్రమం తప్పకుండా నివేదికలు సమర్పిస్తున్నాయి. -
సముద్రంలో బిక్కుబిక్కు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారత నౌకలు పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌తోపాటు పరిసర సముద్ర జలాల్లో చిక్కుకుపోయాయి. భారతదేశ జెండాలతో కూడిన మొత్తం 37 నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఆయా నౌకల్లో 1,109 మంది సిబ్బంది ఉన్నారు. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడుల నేపథ్యంలో చమురు రవాణాకు కీలకమైన హొర్మూజ్ జలసంధిని మూసివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వీటిలో కొన్ని నౌకల్లో ముడి చమురు, సహజ వాయువు ఉన్నాయి. అవి భారత ఓడరేవులకు చేరుకోవాల్సి ఉంది.మరికొన్ని నౌకలు పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేయడానికి గల్ఫ్ దేశాలకు ప్రయణిస్తుండగా మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. భారత ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్’గల్ఫ్ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. నౌకల్లో చిక్కుకుపోయిన భారతీయ సిబ్బందికి సహాయం అందించడానికి కేంద్ర షిప్పింగ్ శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా, ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మరణం తర్వాత గల్ఫ్ సముద్ర తీరంలో విదేశీ జెండాలు ఉన్న నౌకలపై పలు దాడులు జరిగాయి.ఈ దాడుల్లో కనీసం ముగ్గురు భారతీయులు మరణించారు. ఈ పరిణామాలు భారత షిప్పింగ్ కంపెనీలకు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత షిప్పింగ్ మంత్రి శర్బానంద సోనోవాల్ మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. తాజా పరిస్థితిని సమీక్షించారు. భారత నౌకలకు, సిబ్బందిని తగిన రక్షణ కల్పించడానికి భారత నావికాదళం, విదేశాంగ శాఖ, మారిటైమ్ రెస్క్యూ కో–ఆర్డినేషన్ సెంటర్(ఎంఆర్సీసీ) సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. -
చిరుత కుటుంబం ఇంత సన్నిహితమా?
వన్యప్రాణులకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు, వీడియోలను తరచూ పంచుకునే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పర్షియన్ చిరుతపులి కుటుంబానికి సంబంధించిన ఫుటేజీని షేర్ చేశారు. తుర్క్మెనిస్తాన్ వన్యప్రాణి సంరక్షకుడు నరిన్ టి రోసెన్ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరా ద్వారా ఈ దృశ్యాలు చిత్రీకరించారు. చిరుతపులి ఉపజాతిలో పర్షియన్ చిరుతపులి అతిపెద్దది. ప్రస్తుతం అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉంది. ప్రపంచంలో వెయ్యికి తక్కువగానే ఈ జాతి చిరుతపులులు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ‘పర్షియన్ చిరుతపులి కుటుంబం వసతి ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నప్పుడు.. ట్రాప్ కెమెరా ముందు.. మీరు చూస్తున్న ఈ అద్భుత వీడియో గొప్పదనం @NarynTRకి చెందుతుంది’ అంటూ వీడియోకు క్యాప్షన్ జతచేశారు. ఈ అరుదైన వీడియోలో నాలుగు పర్షియన్ చిరుతపులుల కుటుంబం విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తుంది. చిరుతపులి కూనలు చేస్తున్న సౌండ్స్ కూడా ఈ వీడియోలో వినిపిస్తాయి. ఇంటర్నెట్ యూజర్స్ ఈ వీడియోను అమితంగా ఇష్టపడుతున్నారు. ఒక యూజర్ ఇలా రాశాడు ‘వావ్.. ఇది నిజంగా అద్భుతం. ప్రకృతి ఒడిలో పర్షియన్ చిరుతపులి కుటుంబం’. మరొక యూజర్ ‘నేను చాలా కాలం తరువాత చూసిన అద్భుతం’ అని రాశారు. కాగా ట్రాప్ కెమెరా అనేది ఇన్ఫ్రారెడ్ సెన్సార్‌కు జోడించిన డిజిటల్ కెమెరా. ఇది వన్యప్రాణులు, వాటి ఆవాసాలు, జాతుల స్థానం, జనాభా పరిమాణం, జాతుల పరస్పర చర్యలకు సంబంధించిన డేటాను పొందుపరుస్తుంది. ఏదైనా జంతువు కెమెరా సెన్సార్ దగ్గరికు వెళ్ళినప్పుడు అది కెమెరాను ట్రిగ్గర్ చేస్తుంది. తర్వాత వీడియోను రికార్డ్ చేస్తుంది. ఇది కూడా చదవండి: 72 ఏళ్ల క్రితం మూసిన ఆలయం తెరవగానే.. When a Persian Leopard family decided to make home in front of a trap camera. The best thing you will watch. Credits to @NarynTR for raising awareness about them. pic.twitter.com/5hp8R4Whh1 — Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 14, 2023 -
పర్షియన్ గల్ఫ్‌లో భారత్ చమురు ట్యాంకర్లకు భద్రత
న్యూఢిల్లీ : ఇరాన్, అమెరికా సైనిక డాడుల నేపథ్యంలో భారత నేవీ.. పర్షియన్ గల్ఫ్‌లోని భారత్‌కు చెందిన ముడి చమురు ట్యాంకర్లకు భద్రత కల్పించనుంది. అమెరికా- ఇరాన్‌ల మధ్య యుద్ధం అనివార్యమైతే తమ చమురు ట్యాంకులకు నష్ట వాటిల్లకుండా చర్యలు చేపట్టింది. చమురు రవాణా నిమిత్తం పర్షియన్ గల్ఫ్‌లో భారత్‌కు చెందిన 5 నుంచి 8 చమురు ట్యాంకర్లు ఉన్నాయి. ఇవి భారత చమురు అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత దేశం సుమారు 63 శాతం ముడి చమురును సౌదీ అరేబియా, ఇరాక్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల భారత దేశానికి ముడి అందించే దేశాల్లో ఇరాన్ కూడా చేరింది. ఈ మేరకు పలు ఒప్పందాలు కూడా చేసుకుంది. కాగా తమ గగనతలంలో ప్రమాదకర అమెరికా డ్రోన్ ప్రవేశించినందుకే దానిని కూల్చివేసినట్లు ఇరాన్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘ ఇరాన్ తప్పు చేసింది ’ అని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా గతేడాది తమతో అణు ఒప్పందం విరమించుకున్న నాటి నుంచి ఇరాన్.. అమెరికా హెచ్చరికలను ఖాతరు చేయకుండా దీటుగా సమాధానమిస్తోంది. తాజాగా అగ్రరాజ్య డ్రోన్‌ను కూల్చివేసి సవాలు విసిరింది. ఈ నేపథ్యంలో అక్కడ నిలిపి ఉంచిన చమురు ట్యాంకర్లకు భద్రత పటిష్టపరిచే విషయమై భారత షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో శుక్రవారం చర్చ జరగనుంది.


