breaking news
permanant commission
-
వేడి నీటి పైపు పేలి అయిదుగురు మృతి
మాస్కో : వేడి నీటి పైపు పేలి అయిదుగురు మరణించిన ఘటన రష్యాలో చోటు చేసుకుంది. పెర్మ్ నగరంలోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో ఉన్న హోటల్లో సోమవారం సాయంత్రం వేడి నీటితో ఉన్న పైపు పేలింది. దీంతో మరుగుతున్న వేడి నీరుహోటల్ గదుల్లోకి రావడంతో ఓ చిన్నారితో సహా అయిదుగురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లోని ఓ మహిళ శరీరం 35 శాతం కాలిపోయి ఆమె పరిస్థితి విషమంగా ఉండగా మిగతా ఇద్దరు పరిస్థితి సాధారణంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనను ఘోర ప్రమాదమని, ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రాంతీయ గవర్నర్ మాగ్జిమ్ రేషెట్నికోవ్ అన్నారు. అదే విధంగా వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా సోమవారం ఉదయమే పైపు లీకేజ్ అవుతున్నట్లు ఓ వీడియోలో రికార్డు అయ్యింది. పేలిన పైపు 1962 నుంచి ఉపయోగిస్తున్నారని, గతంలో అనేక సార్లు విరిగిపోయినట్లు స్థానిక వార్తా సంస్థ నివేదించింది.అయితే గతంలో సంభవించిన పేలుల్లో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని ఈ సారి మాత్రం యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించిదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. -
ఎయిర్ఫోర్సును ట్రిబ్యునల్‌కు లాగిన పూజా ఠాకూర్
గత సంవత్సరం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత దేశం వచ్చినప్పుడు ఆయనకు గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించే కార్యక్రమానికి ఓ మహిళా వింగ్ కమాండర్ నేతృత్వం వహించారు. ఆమె ఎవరా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఆమే వింగ్ కమాండర్ పూజా ఠాకూర్. అలాంటి పూజ.. ఇప్పుడు తనకు భారత వైమానిక దళం శాశ్వత కమిషన్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమె సైనిక దళాల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. తనకు శాశ్వత కమిషన్ ఇవ్వకపోవడం వివక్షాపూరితమని ఆమె మండిపడింది. ట్రిబ్యునల్ ఈ కేసును విచారణకు స్వీకరించిందని ఠాకూర్ తరఫు న్యాయవాది సుధాంశు పాండే చెప్పారు. గత సంవత్సరం రిపబ్లిక్ డే పెరేడ్ నుంచి మహిళా అధికారులకు కూడా మార్చింగ్ కంటింజెంట్లకు నేతృత్వం వహించే అవకాశం ఇచ్చారు. 2000 సంవత్సరంలో భారత వైమానిక దళంలో చేరిన పూజా ఠాకూర్.. అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచికి చెందిన అధికారిణి. ఆమె ప్రస్తుతం వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో ప్రచార విభాగం ‘దిశ’లో పనిచేస్తున్నారు.