breaking news
peoples difficulties
-
జనరేషన్ కష్టాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కొత్త రేషన్‌కార్డుల కోసం ప్రభుత్వం విధించిన నిబంధనలు ప్రజలకు గుదిబండగా మారాయి. వివాహ రిజిస్ట్రేషన్ సర్టీఫికెట్ తప్పనిసరి చేయడంతో తరాలతో సంబంధం లేకుండా ఎప్పుడో పెళ్లయిన వారూ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. కొత్త కార్డుల దరఖాస్తుకు గడువు 15 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొత్తగా పెళ్లయిన జంటలతోపాటు ఇంత వరకు రేషన్‌కార్డు లేని వారు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవడంతో మొదలయ్యే ప్రక్రియ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్టీఫికెట్ వచ్చే వరకు ప్రహసనంగా మారుతోంది. స్లాట్ విధానంలో లోపాలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్‌లో లోపాల వల్ల మ్యారేజ్ సర్టీఫికెట్ కోసం వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. ఒకే సమయానికి ఎక్కువ మందికి స్లాట్ ఇవ్వడం వల్ల పిల్లాపాపలతో గంటల తరబడి కార్యాలయాల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. మండే ఎండలతో నరకం చవి చూడాల్సిన దుస్థితి నెలకొంది. వాస్తవానికి ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ఒక సమయానికి.. ఒక స్లాట్ విధానమే అమలులో ఉంది. కానీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌కు మాత్రం ఒకే సమయానికి ఎంతమందికి కావాలంటే అంతమందికి అధికారులు స్లాట్ ఇస్తున్నారు.ఈ–సైన్ సైట్లో నమోదు, భార్యాభర్తలు, ముగ్గురు సాక్షుల ఫింగర్ప్రింట్ల సేకరణ తదితర పనుల వల్ల ప్రక్రియ బాగా ఆలస్యమవుతోంది. దీనిని అవకాశంగా తీసుకుని కొందరు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో రిజిస్ట్రేషన్‌కు రూ.2,500 నుంచి రూ.4,000 వంతున దరఖాస్తుదారుల నుంచి వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత మంగళవారం ఒక్క రోజే కాకినాడ జిల్లా రిజి్రస్టార్ కార్యాలయానికి సుమారు 70 మంది మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు కోసం దరఖాస్తులతో తరలివచ్చారు. ఇక్కడ ఈ పని అంతా చేసేది ఒకే ఒక సీనియర్ అసిస్టెంట్ కావడంతో దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పలేదు. కాకినాడ జిల్లాలోని సర్పవరం, ప్రత్తిపాడు, తాళ్లరేవు, సామర్లకోట, తుని తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలూ రోజూ మ్యారేజ్ సర్టీఫికేట్ల కోసం వచ్చేవారితో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాల్లోనే.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్లు జారీ చేసేవారు. ఈ–సైన్ లేకపోవడంతో పది నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తయిపోయేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భార్యాభర్తలు, ముగ్గురు సాక్షులు, ఈ–సైన్ చేయాల్సి రావడంతో కష్టాలు తప్పడం లేదు.రిజిస్ట్రేషన్ కార్యాలయ ఉద్యోగులపై ఒత్తిడి మ్యారేజ్ సర్టీఫికెట్ కోసం రోజూ జనం పోటెత్తడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉద్యోగులపైనా ఒత్తిడి పెరుగుతోంది. సిబ్బంది అంతంతమాత్రంగా ఉండడంతో మానసిక వేదనకు గురవుతున్నారు. ఇలాంటి ఒత్తిళ్లతోనే ఇటీవల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ శివరాం మృతి చెందడాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. గ్రామ సచివాలయాలు లేదా, రిజి్రస్టార్ కార్యాలయాల్లోనూ మ్యారేజ్ సర్టీఫికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.సాయంత్రం వరకు పడిగాపులే రేషన్ కార్డు కోసం పెళ్లి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. ముందు రోజు స్లాట్ బుక్ చేసుకున్నాను. పనులు అన్ని మానుకుని ఉదయమే 11 గంటలకు కాకినాడ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చాను. అప్పటికే పదుల సంఖ్యలో అర్జీదారులు ఉండటంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు పడాల్సి వచ్చింది. – కుంది కరుణ, జగన్నాథపురం, కాకినాడ -
పెద్ద సార్లు లేకపోతే అంతే..!
♦ సమయపాలన పాటించని అధికారులు ♦ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆదిలాబాద్ రూరల్ : జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారుల సమయపాలన కొరబడింది. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయాలకు అనుకొని ఉన్న ఆదిలాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలోని ఉద్యోగులు సమయ పాలన పాటించకపోవడంతో సుదుర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయ పని వేళలు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సంబంధిత తహసీల్దార్ ఒక వేళ ఏదైనా మీటింగ్‌లకు వెళ్లితే చాలు వారి ఇష్టమైన సమయానికి వచ్చి వెళ్లిపోతున్నారనే ఆరోపనలు లేకపోలేదు. ఉదయం 10.30 గంటలకు కారాయానికి రావాలి్సన సంబంధిత అధికారులు 11.30 గంటల తర్వాత కార్యాలయానికి వస్తున్నారు. అలాగే కొద్దీసేపు కార్యాలయంలో ఉండి మధ్యాహ్నం 1 గంటల, 1.30 గంటల సమయంలో భోజనానికి వెళ్లిన అధికారులు మూడున్నర, నలుగు గంటల సమయంలో కార్యాలయానికి వస్తున్నారని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు వాపోతున్నారు. శనివారం మధ్యాహ్నం భోజనానికి వెళ్లిన అధికారులు 3.15 గంటల వరకు కూడా కార్యాలయంలో లేరు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో తమ సమయం, బస్సు ఛార్జీలు, కూలీ వృథా అవుతుందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్, జేసీలు నివాసం ఉండే ప్రాంతాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే మారుమూల మండలాల పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందోనని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి అధికారులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా... తమ కార్యాలయ ఉద్యోగులు ప్రొద్దున వస్తారు. వివిధ పనుల నిమిత్తం తమ కార్యాలయానికి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చిన్నప్పుడు ఆలస్యంగా వెళ్తారు. అయిన్నప్పటికీ సమయ పాలన పాటించని అధికారులపై ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటాం. ఇక నుంచి సమయ పాలన పాటించేలా చూస్తా. – శ్రీదేవి, తహసీల్దార్, ఆదిలాబాద్ రూరల్