breaking news
Pension removal
-
AP: ప్రాణం తీసిన పెన్షన్ తొలగింపు
సాక్షి, కృష్ణా జిల్లా: పెన్షన్ తొలగింపుతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ దివ్యాంగురాలు.. గుండెపోటుతో మృతి చెందింది. మొవ్వ మండలం పెదపూడి సచివాలయం పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇటీవల పెన్షన్ల సర్వేలో దివ్యాంగురాలైన మేడం లక్ష్మి పెన్షన్‌ను తొలగించారు. పెన్షన్ తొలగించడంతో తీవ్ర మనోవేదనతో గత రాత్రి లక్ష్మికి గుండెపోటుకు గురైంంది.పెదపూడి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ మాట్లాడుతూ.. ‘‘మా సచివాలయ పరిధిలో 113 పెన్షనర్లు ఉన్నారు. వారందరి పెన్షన్లను రీ వెరిఫికేషన్‌కు పంపించాం. 8 పక్షవాతం వచ్చిన వారి పెన్షన్లు ఉన్నాయి. వాటిని 6 వేల రూపాయల పెన్షన్‌లోకి మార్చారు. 34 మంది పెన్షన్ దారులను రిజెక్ట్ చేశారు. లక్ష్మి ఇంటికి పెన్షన్ రిజెక్ట్ చేసిన లెటర్ ఇవ్వడానికి వెళ్లాను. పెన్షన్ రిజెక్షన్ లెటర్ ఇవ్వగానే కన్నీరు పెట్టుకున్నారు. నేను లక్ష్మి సోదరుడికి ఫోన్ చేసి విషయం తెలియజేశాను. ఉదయం లక్ష్మి చనిపోయారని తెలిసింది’’ అని ఆమె తెలిపారు.డోన్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు వికలాంగుల నిరసననంద్యాల జిల్లా: పెన్షన్ల తొలగింపుపై డోన్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర వికలాంగులు ఆందోళన చేశారు. అంగ వైకల్య శాతం తక్కువగా ఉందని నోటీసులు అందడంతో పింఛన్ లబ్ధిదారులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. తమకు ఎటువంటి పరీక్షలు చేయకుండానే నోటీసులు ఇవ్వడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. -
ఇదేమి అన్యాయం ‘బాబూ’!
- పింఛను తొలగింపుపై ఆవేదన - జన్మభూమిలో నిలదీసిన బాధితులు చోడవరం : ‘బాబూ కాళ్లూ చేతులు సరిగ్గా లేవు.. కళ్లు సరిగ్గా కనిపించవు... వెయ్యి రూపాయల పింఛనొస్తుందని ఆశపడితే.. ఇచ్చే రెండొందల పింఛను తొలగిస్తారా? ఇదేం అన్యాయం బాబూ’ అవయాలు కోల్పోయి, కదలలేని స్థితిలో ఉన్న మట్టిపిడి గంగమ్మ ఆవేదన ఇది. ‘నాకు కళ్లు కనిపించవు. నాలాటిదాన్ని పింఛనే తీసేత్తారా.. ఇదే నాయం బాబూ’ అంటూ తాకేటి చినతల్లి అనే నిరాదరణ అంధ మహిళ రోదన . ఇలాంటి అభాగ్యులెందరో పింఛన్ కోల్పోయి జన్మభూమి గ్రామ సభల్లో అధికారుల ముందు నెత్తీ నోరు కొట్టుకుంటున్న హృదయవిదాకర సంఘటనలు వెలుగుచూశాయి. చోడవరం మండలం గవరవరంలో శనివారం జరిగిన జన్మభూమి గ్రామసభలో పింఛన్ జాబితాలో పేర్లు లేని ఎందరో అభాగ్యులు అధికారుల ముందు కన్నీరు పెట్టారు. ఈ గ్రామంలో 31 మంది పింఛన్లు తొలగించారు. వీరిలో నిరుపేదలైన అవ యవాలు స్వాధీనంలో లేని నిర్భాగ్యులు, అనాథ మహిళలు ఉన్నారు. పింఛన్ జాబితాలో పేర్లు లేకపోవడంతో పలువురు వృద్ధులు టీడీపీకి చెందిన సర్పంచ్ చప్పగడ్డి వెంకటస్వామి నాయుడును, అధికారులను నిలదీశారు. హైదరాబాద్‌లో జాబితాను తొలగించారని, మళ్లీ ఇస్తామంటూ స్థానిక సర్పంచ్ చెప్పడానికి ప్రయత్నించినప్పటకీ వారు శాంతించలేదు. ఈ సభకు దిగువ స్థాయి అధికారులు మాత్రమే రావడంతో వీరి రోదన అరణ్య రోదనే అయ్యింది. ఈ గ్రామానికి చెందిన మట్టిపిడి గంగమ్మ కాళ్లు చేతులు పనిచేయక పోగా, ఎడమ చేతికి ఒక వేలు మాత్రమే ఉంది. మండ వరకు మిగిలిన వేళ్లు కోల్పోయింది. ఈమె భర్త 60 ఏళ్ల వయస్సులో రిక్షా లాగుతున్నాడు. ఈమెను పేరును జాబితా నుంచి తొలగించారు. కళ్లు కనిపించక... నా అన్న వారెవరూ లేని తాకేటి చినతల్లి పింఛన్ కూడా తొలగించారు. వైద్య సిబ్బందిపై ఫిర్యాదు ఇదిలా ఉండగా స్థానిక పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండడం లేదంటూ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అనర్హత పేరుతో 449 యూనిట్ల బియ్యం రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెడెంట్ శివ, హెచ్‌డీటీ రామారావు, సీడీపీఓ ఉమాదేవి, గ్రామకార్యదర్శి పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.