breaking news
pavala interest loans
-
ఐదేళ్లలో కోటి మంది మహిళా కోటీశ్వరులు
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లలో రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రా ష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో (ఎస్‌హెచ్ జీలు) ప్రస్తుతం ఉన్న 63 లక్షల మంది మహిళలను కోటికి పెంచడమే కాకుండా ప్రతి ఒక్కరిని కోటీశ్వ రులను చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహిళల ను లక్షాధికారుల్ని చేసే లక్ష్యంతో పావలా వడ్డీ రుణాలను ప్రారంభించారని, ఇప్పుడు ప్రతి మహిళ ను కోటీశ్వరురాలిని చేసే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో నిలిచి పోయిన వడ్డీలేని రుణాల పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ, ధనిక తెలంగాణ, అభివృద్ధి చెందిన తెలంగాణ అవుతుందని, మహిళలు తమ పిల్లలను డాక్టర్లు, ఐఏఎస్‌లను చేసుకోగలరని అన్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ‘మహాలక్ష్మి స్వశక్తి మహిళా సదస్సు’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే అధికారంలోకి.. ‘పదేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణలో ఆడబిడ్డల ను పట్టించుకోలేదు. పావలా వడ్డీ, సున్నా వడ్డీ ఇవ్వలేదు. అందుకే మా ఆడబిడ్డలు కంకణం కట్టుకుని ఎన్నికల్లో కేసీఆర్‌ను బండకేసి కొట్టారు. వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నేను సీఎం అయ్యా. అధికారంలోకి వచ్చిన వెంటనే గతేడాది సెప్టెంబర్ 17న సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ప్రారంభించాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే, ఇప్పటివరకు 23 కోట్ల మంది వినియోగించుకున్నారు. కానీ కేసీఆర్, హరీశ్, కవిత, కేటీఆర్ కిరాయి ఇచ్చి ఆటో డ్రైవర్లతో ధర్నాలు చేయిస్తున్నారు. ఎవరు అడ్డు వచ్చినా సరే.. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కొనసాగిస్తాం. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీని కేసీఆర్ ఎటుగాకుండా చేశారు. మహిళలను కట్టెల పొయ్యి కష్టాల నుంచి గట్టెక్కించేందుకు గతంలో దీపం పథకం ద్వారా సోనియాగాంధీ రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తే, ప్రధాని నరేంద్ర మోదీ, కేసీఆర్ కలిసి దానిని రూ.1200కు పెంచి మళ్లీ కట్టెల పొయ్యికి మళ్లే పరిస్థితి కల్పించారు. అందుకే ఇప్పుడు రూ.500లకే మహిళలకు గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. గృహాలక్ష్మి పథకం ద్వారా పేదల ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం..’ అని రేవంత్ తెలిపారు. టాటా, బిర్లాలతో పోటీ పడేలా చేస్తాం ‘ఎస్‌హెచ్‌జీల మహిళలు తయారు చేసే ఉత్పత్తుల కు మార్కెటింగ్ సౌకర్యం లేదనే విషయం నా దృష్టికి వచ్చింది. రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన ఎస్‌హెచ్‌జీల మహిళలకు వంద స్టాళ్లు ఏర్పా టు చేస్తాం. మీరు తయారు చేసిన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాం. ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ కూడా మహిళా ఉత్పత్తుల విక్రయానికి బజార్లు ఏర్పాటు చేస్తాం. టాటా, బిర్లాలు, అదానీ, అంబానీలతో పోటీ పడే విధంగా మహిళలు రాణించేలా కృషి చేస్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. డబుల్ బెడ్రూం ఆశ చూపి మోసం చేశారు ‘ఇందిరమ్మ ఇళ్లు ఎన్నికలు అయిపోయిన తరువాత ఇద్దామనుకున్నాం. కానీ మహిళల కోసం భద్రాద్రి రామచంద్ర స్వామి ఆశీస్సులతో ఈ పథకాన్ని ప్రారంభించుకున్నాం. కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్ల ఆశ చూపి మహిళలను మోసం చేసిండు. మేం మొత్తం రూ.22,500 కోట్లతో ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించబోతున్నాం..’ అని రేవంత్ తెలిపారు. మోదీ, కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు ‘మా ప్రభుత్వాన్ని పడగొడతామంటూ కొందరు చిందులు వేస్తున్నారు. కేసీఆర్, మోదీలు కుట్రలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కుర్చీలో దొరలే కూర్చో వాలా? రైతు బిడ్డ కూర్చోకూడదా? నేనేం పాపం చేశా? మీ అవినీతి సొమ్ములో షేర్ అడిగానా? నేనే మన్నా అయ్య పేరు చెప్పుకొని, విరాసత్ రాయించుకొని ముఖ్యమంత్రి అయ్యానా? ఎవరి కుర్చీనైనా గుంజుకున్నానా? రేవంత్‌ను, ప్రభుత్వాన్ని పడగొడ తామని ఎవరైనా వస్తే.. మా ఆడబిడ్డలు చీపురు కట్టలు మర్లేసి కొడతారు. కొద్దిరోజుల్లో 10 లక్షల మంది ఆడబిడ్డలతో కవాతు చేస్తాం. మా సైన్యం మీరే.. మా బలగం మీరే..’ అని సీఎం అన్నారు. అధికారం పోతుందని తెలిసినా సోనియా తెలంగాణ ఇచ్చారు ‘కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ. మేము ఒక మహిళ నాయకత్వంలో పని చేయడానికి గర్విస్తున్నాం. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోతుందని తెలిసినా 2004లో కరీంనగర్లో ఇచ్చిన మాట కోసం సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు..’ అని రేవంత్ చెప్పారు. స్టాళ్ల సందర్శన.. మహిళలతో సంభాషణ సదస్సుకు ముందు ముఖ్యమంత్రి ఎస్‌హెచ్‌జీల మహిళలు ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తులతో కూడిన స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని సీఎంను కోరారు. విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ‘మహిళా శక్తి మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి’ విజన్ డాక్యుమెంట్‌ను మంత్రివర్గ సహచరులతో కలిసి సీఎం ఆవిష్కరించారు. వచ్చే ఐదేళ్లలో బ్యాంకులు, స్త్రీ నిధి ద్వారా ఎస్‌హెచ్‌జీలకు సంబంధించిన రూ.లక్ష కోట్ల రుణాలను అనుసంధానించడం, వడ్డీ లేని రుణాలు పునరుద్ధరించడం, సంఘాల ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ కల్పించడం, సంఘాలకు శిక్షణ, సంఘాల్లోని మహిళలకు రూ. పది లక్షల జీవిత బీమా, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సంఘాలతో నిర్వహణ లాంటి అంశాలు విజన్ డాక్యుమెంట్లో ఉన్నాయి. ఈ సదస్సు కు సీఎస్ శాంతికుమారి అధ్యక్షత వహించగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీత క్క, సురేఖ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు ప్రసంగించారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రులు జూప ల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్‌కు మార్ రెడ్డి, రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
పొదుపు వ్యవస్థలో విప్లవం..వైఎస్ ‘పావలా వడ్డీ’
సాక్షి, అమరావతి: నిరంతరం ప్రజాసంక్షేమం కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి ఆలోచనలోంచి రూపుదిద్దుకున్న పథకం దేశంలో పొదుపు వ్యవస్థలో విప్లవం సృష్టించింది. మహిళల ఆర్థికాభివృద్ధికి దన్నుగా నిలిచింది. దేశవ్యాప్తంగా ఈ పథకం అమలుకు దిక్సూచిగా నిలిచింది. అదే పావలా వడ్డీ పథకం. ఆ పథకం రూపకర్త మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో అమలు చేసిన ఈ పథకం తరువాత దేశవ్యాప్తంగా విస్తరించింది. కొన్ని ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థలు పేదల నుంచి రోజువారీ వడ్డీలు వసూలు చేసే సమయంలో.. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన పావలా వడ్డీ పథకం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుత విభిజిత ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మొత్తం పొదుపు సంఘాల్లో మూడోవంతుకుపైగా 2004–08 మధ్య కాలంలో ఏర్పడినవే. దీనికి పావలా వడ్డీ అమలే ప్రధాన కారణం. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఎనిమిది లక్షల వరకు పొదుపు సంఘాలున్నాయి. వీటిలో 2,90,928 సంఘాలు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 2004–08 మధ్య ఏర్పడినవే. అదే సమయంలో పావలా వడ్డీ కార్యక్రమంతో అప్పట్లో పెద్దసంఖ్యలో మహిళలు రాష్ట్రంలో పొదుపు సంఘాల్లో చేరారు. దీన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని దేశమంతా అమలు చేయాలని నిర్ణయించింది. అభయహస్తంతో భరోసాకి దారి..: పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండే మహిళల వయసు 60 ఏళ్ల దాటిన తర్వాత వారికి రుణాలిచ్చేందుకు అప్పట్లో చాలా బ్యాంకులు ఆసక్తి చూపేవి కాదు. ఈ నేపథ్యంలో 60 ఏళ్ల వయసు దాటిన పొదుపు సంఘాల మహిళలకు ఆదాయ భద్రత, భరోసా కల్పించేందుకు రాజశేఖరరెడ్డి అప్పట్లో ‘అభయహస్తం’ అనే మరో విన్నూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. నేడు మళ్లీ జగన్ ‘ఆసరా’తో..: చంద్రబాబు హయాంలో మోసపోయిన డ్వాక్రా మహిళలకు ఆసరాగా నిలవాలని 2019లో ముఖ్యమంత్రిగా పదవీ చేపట్టిన వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి మహిళల పేరిట ఉండే పొదుపు సంఘాల రుణాలు రూ.25,571 కోట్లను ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా నాలుగు విడతల్లో నేరుగా ఆ మహిళలకు అందజేస్తున్నారు. ఇప్పటికే మూడు విడతల్లో ప్రభుత్వం రూ.19,178 కోట్లు ఈ పథకం కింద చెల్లించింది. దీనికితోడు.. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా గత నాలుగేళ్లు సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళలకు ఆ వడ్డీ డబ్బులను ఏ ఏడాదికి ఆ ఏడాదే నేరుగా వారికే ప్రభుత్వం అందజేస్తోంది. -
మహిళా.. భవిత నీదే!
ఇది దివంగత నేత వైఎస్ ఆశయం.. స్త్రీల పట్ల ఆయనకున్న గౌరవానికి నిదర్శనం. అప్పటి దాకా మైక్రో రుణాల పేరుతో స్త్రీలు పడుతున్న అగచాట్లకు ఫుల్స్టాప్ పెట్టాలనుకున్నారు. వారి స్వయం సమృద్ధికోసం పావల వడ్డీకే రుణాలు అనే సరికొత్త పథకానికి 2004 సెప్టెంబర్‌లో రూపక ల్పన చేశారు. ఆయన హయాంలో ఎంతో మంది అభ్యున్నతి సాధించారు. కానీ వైఎస్ అకాల మరణం తర్వాత పొదుపు గ్రూపుల సభ్యులపై బ్యాంకర్ల వేధింపులెక్కువయ్యాయి. పాలకుల చిన్నచూపు మహిళలను అప్పుల్లోకి నెట్టింది. ‘అక్కల్లారా.. చెల్లెళ్లారా.. ఇక మీ కష్టాలు ఎంతో కాలం ఉండవు.. రుణాలు తీసుకున్న నేరానికి కుమిలిపోవాల్సిన అవసరం లేదు. మీరు తీసుకున్న రుణాలన్నీ నేను అధికారంలోకి రాగానే రద్దు చేస్తా.. మీ కన్నీటిని తుడుస్తా’.. అంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. సీఎంగా తన నాలుగో సంతకాన్ని ఇదే ఫైలుపై పెడతానని స్పష్టం చేశారు. 55,541 జిల్లాలోని పొదుపు గ్రూపులు జిల్లాలో ఐకేపీ, మెప్నా ఆధ్వర్యంలో స్వయం సహాయ గ్రూపులు పని చేస్తున్నాయి. ఐకేపీ గ్రామీణ ప్రాంతాల్లో 47150 గ్రూపులతో పనిచేస్తుండగా.. మెప్నా పట్టణ ప్రాంతాల్లో 8391గ్రూపులు కలిగి ఉంది. ఒక్క ఐకేపీలోనే గ్రూపునకు 9 నుంచి 11 మంది చొప్పున 4,80,000 మంది స్వయం సభ్యులు లబ్ధిదారులుగా ఉన్నారు. అలాగే మెప్నాలో కూడా సుమారు 20 వేల మంది సభ్యులుంటారు. ఒక్కో గ్రూపునకు రూ50 వేల నుంచి రూ5 లక్షల వరకు బ్యాంకు లింకేజీ రుణాలు లభిస్తాయి. రూ.622 కోట్లు ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ)లోని 47,150 గ్రూపులు ప్రస్తుతం రూ622 కోట్ల మేర బ్యాంకు లింకే జీ రుణాలు పొంది ఉన్నాయి. రూ.92.96 కోట్లు స్త్రీనిధి అనే పథకం మరోటి ఉంది.. దీని ద్వారా గ్రూపు సభ్యుల వ్యక్తిగత అవసరాలకు రుణాలు అందిస్తారు. అంటే వారి కుటుంబ సభ్యుల చదువు, వివాహం, ఆరోగ్యం మొదలైన వాటి కోసం. అయితే వీటిని 24 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి రుణాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐకేపీ, మెప్నా సభ్యులు ఇప్పటికి రూ 92.96 కోట్లు తీసుకున్నారు. రూ.70 కోట్లు మెప్నా ఆధ్వర్యంలో పట్టణాలల్లోని మురికి వాడల్లో పని చేస్తున్న దాదాపు 8391 గ్రూపులు ప్రస్తుతానికి బ్యాంకుల నుంచి రూ70 కోట్ల రుణాలు తీసుకున్నాయి. రూ.785.46 కోట్లు సుమారు 5 లక్షల గ్రూపులకు జగన్ మాఫీ చేయనున్న రుణం గ్రూపు వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఆయా సంఘాలు రూ785.46 కోట్లు బ్యాంకర్లకు చెల్లించాల్సి ఉంది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ఈ మొత్తాన్ని రద్దు చేయనున్నారు. దీనివల్ల సుమారు 5 లక్షల మంది మహిళలు తమ రుణాల నుంచి విముక్తి పొందనున్నారు. రూ.15.50 కోట్లు పాలప్రగతి కేంద్రాలు, జీవప్రగతి కేంద్రాలు, నిరుపేదల వ్యూహం పథకాల కింది ఇప్పటి వరకు జిల్లాలోని వివిధ గ్రూపులకు రూ15.50 కోట్లు చెల్లించారు.