breaking news
paternity
-
పిల్లలు నాకే పుట్టారా?.. డీఎన్ఏ టెస్టుల కలకలం
ఆఫ్రికా దేశం ఉగాండాలో ఓ కొత్త సామాజిక సమస్య తలెత్తింది. తాము ప్రాణంగా పెంచుకుంటున్న పిల్లలు తమకు పుట్టినవారేనా అన్న అనుమానంతో పురుషులు భారీ సంఖ్యలో డీఎన్ఏ పితృత్వ పరీక్షల చేయించుకునేందుకు ఆసక్తి కనబరుస్తుండటం బాధకరం. అయితే, ఈ పరీక్షల ఫలితాలు వారి జీవితాలను అల్లకల్లోలం చేసి కాపురాలను కూల్చేస్తున్నాయి. ప్రస్తుతం ఉగాండ దేశంలో ఈ ధోరణి ఏ స్థాయిలో ఉందంటే, సాక్షాత్తు ప్రభుత్వమే రంగంలోకి దిగి "గుండె ధైర్యం ఉంటే తప్ప ఈ పరీక్షలకు వెళ్లొద్దు" అని సలహా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇటీవల కంపాలాలోని ఓ సంపన్న విద్యావేత్త కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనం సృష్టించింది. కోర్టు ఆదేశాల మేరకు జరిగిన డీఎన్ఏ పరీక్షలో, ఆయన ముగ్గురు పిల్లల్లో ఒకరు ఆయనకు పుట్టలేదని తేలింది. స్థానిక మీడియాలో ఈ వార్త విపరీతంగా హల్చల్ చేయడంతో, ఒక్కసారిగా చాలామంది పురుషుల్లో తమ సంతానంపై సందేహాలు మొదలయ్యాయి. ఇదే అదనుగా దేశవ్యాప్తంగా డీఎన్ఏ పరీక్షా కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలిసిపోయాయి. ఆఖరికి రేడియోలు, ట్యాక్సీలపై కూడా ఈ టెస్టులకు సంబంధించిన ప్రకటనలు హోరెత్తించేస్తున్నాయి. మరోవైపు ఉగాండా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైమన్ పీటర్ ముండేయీ ప్రకారం, స్వచ్ఛందంగా డీఎన్ఏ పరీక్షలు చేయించుకుంటున్న వారిలో 95% పురుషులే ఉంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే, వీరిలో 98% మందికి పైగా ఫలితాలు తాము ఆ పిల్లలకు జీవసంబంధ తండ్రులు కారని నిర్ధారిస్తున్నాయి. దాంతో కుటుంబాలు విచ్ఛిన్నమై..ఎన్నో ఏళ్ల బంధాలు తెగిపోతున్నాయి. అలా చేయడం నేరం..దీంతో ఈ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు మతపెద్దలు, తెగల నాయకులు రంగంలోకి దిగుతున్నారు. ఈ మేరకు స్థానిక గిరిజన నాయకుడు మోసెస్ కుటోయ్ వంటి సంప్రదాయ పెద్దలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన దగ్గరకు వచ్చే కుటుంబ వివాదాలను పరిష్కరించే క్రమంలో..తాను కూడా తన తండ్రి పోలికతో ఉండనంటూ ఉదాహణగా చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదీగాక ఇలా పిల్లల పితృత్వాన్ని శంకించడం పూర్వకాలంలో పెద్ద నేరమని, జరిమానా కూడా విధించేవారంటూ గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వివాదాలు ఎక్కువగా ఆస్తి పంపకాలు, విడాకుల సమయంలోనే జరుగుతున్నట్లు సమాచారం. నిజానికి మత పెద్దల మాటలు ఒకప్పుడు కుటుంబాలను విచ్చిన్నం అవ్వకుండా కాపాడేవి. కానీ ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ చేదు నిజాన్ని నిగ్గుతేల్చి చెప్పేయడంతో, ఉగాండా సమాజం తీవ్రమైన కలవరపాటుకి గురవుతోంది. అదే ఈ సమస్యకు మూలం..ఇక ఆఫ్రికా సంప్రదాయం ప్రకారం మహిళ తన భర్తకు సంతానాన్ని కని ఇవ్వకపోతేవిడాకులు ఇవ్వడం లేదా ఆమెను ఇంటి నుంచి బయటకు పంపడం చేసే వారు. చాలా కేసుల్లో పురుషుల్లోనే సంతాన సమస్యలు ఉన్నా, శిక్ష మాత్రం తమకు పడుతుండటంతో చాలా మంది మహిళలు ఇతరులతో కలిసి పిల్లలను కంటున్నారని ఓ అధికారి వెల్లడించారు.(చదవండి: Inspiring Story: సక్సెస్ అంటే కోట్లు గడించడం కాదు..! కష్టానికి తలవంచకపోవడమే..) -
ఫేస్ బుక్ ఉద్యోగులకు శుభవార్త
ఫేస్ బుక్ ఉద్యోగులకు శుభవార్త. ఫేస్ బుక్ లో ఫుల్ టైం జాబ్ చేస్తున్న ఉద్యోగులు (పురుషులు) నాలుగు నెలల పాటు పెటర్నిటీ లీవ్ తీసుకోవచ్చని సంస్థ అధికారికంగా ప్రకటించింది. అమెరికా మినహా ఇతర ప్రాంతాల్లో ఇంతకు ముందు నాలుగువారాలు మాత్రమే ఉన్న పితృత్వ సెలవు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేస్ బుక్ లో పనిచేస్తున్నవారందరికీ నాలుగు నెలల పాటు మంజూరు చేసింది. ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్.. సోషల్ నెట్ వర్క్ లో పనిచేస్తున్న తండ్రులంతా తమ శిశువులతో బంధాన్ని పెంచుకునేందుకు కొత్త సంవత్సరం ప్రారంభం నుంచీ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. 'మా పేరెంటల్ లీవ్ పాలసీస్ కు అనుగుణంగా మేమీ నిర్ణయం తీసుకున్నాం' అని ఫేస్ బుక్ హ్యూమన్ రిసోర్సెస్ అధికారి లోరీ మెట్లాఫ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ సెలవులను పిల్లలు పుట్టిన తర్వాత లేదా దత్తత తీసుకున్న సంవత్సరం లోపు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఫేస్ బుక్ ఇప్పటికే శిశువుల పెంపకానికి సహాయంగా ఇరవై లక్షల రూపాయల వరకూ బోనస్ ను కూడా అందిస్తోంది. గత నెల్లో ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్.. తన భార్య ప్రిసిల్లా మొదటి సంతానానికి జన్మనివ్వడంతో రెండు నెలల పెటర్నిటీ లీవ్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగులైతే... పిల్లలు పుట్టిన సమయంలో వారితో ఎక్కువ సమయం గడిపేలా చూడాలని అధ్యయనాలు కూడ చెబుతున్నాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని ఫేస్ బుక్ ఉద్యోగులు వారికిచ్చే నాలుగు నెలల పెటర్నిటీ, లేదా మెటర్నిటీ సెలవును సంవత్సరం లోపు వారికి అవసరమైన విధంగా విడదీసి వాడుకునే వీలు కల్పిస్తోంది. -
గృహనిర్బంధంలో ఎన్డీ తివారీ?
కాంగ్రెస్ కురువృద్ధుడు నారాయణ దత్త తివారీ గృహనిర్బంధంలో ఉన్నారా? అవుననే అంటున్నారు సీనియర్ కాంగ్రెస్ నేత అలనాటి ప్రేయసి, కాంగ్రెస్ నేత ఉజ్వల శర్మ, ఆమె కుమారుడు రోహిత్ శేఖర్. వారు 88 ఏళ్ల నేతను కలిసేందుకు వెళ్తే అధికారులు వారిని ఆపేశారు. దాంతో ఆమె ఇనుప గేటు బద్దలు గొట్టి మరీ అనుచరులతో సహా లోపలికి వెళ్లారు. లక్నోలో శుక్రవారం ప్రజలకు ఈ వివాదం పెద్ద వినోదంగా మారింది. 'తివారీ అనారోగ్యంగా ఉన్నారు. ఆయనకు సహాయం అవసరం. కాబట్టి నేను లోపలికి వెళ్లాల్సిందే. అసలు ఇదంతా ఒక కుట్ర. ఆయనని గృహనిర్బంధంలో ఉంచినట్టుగా ఉంది.' అని 70 ఏళ్ల ఉజ్వల వాదించారు. ఉజ్వలతో తివారీకి వివాహేతర సంబంధం ద్వారా రోహిత్ శేఖర్ జన్మించారు. అయితే చాలా కాలం తివారీ ఈ విషయాన్ని అంగీకరించలేదు. చివరికి కోర్టు బలవంతంగానైనా డీఎన్ ఏ పరీక్ష చేయించాలని ఆదేశించడంతో తివారీ రోహిత్ తన పుత్రుడేనని అంగీకరించారు. ఈ సంఘటన జరిగిన ఇరవై రోజుల తరువాత నుంచీ తనను తివారీని కలవనీయకుండా నిర్బంధాలు పెరుగుతున్నాయని ఉజ్వల ఆరోపిస్తున్నారు. 'నాకు తివారీ ఆస్తిపాస్తులు వద్దు. ఆయన జీవన సంధ్యా కాలంలో కాసింత సేవచేసుకునే అవకాశం కల్పించండి' అని ఆమె అన్నారు. అయితే తివారీ ఆదేశాల మేరకే తాము ఆమెను నిరోధించామని పోలీసులు చెబుతున్నారు.


