breaking news
paritala suneetha follwers
-
పేదల భూములు కొల్లగొడుతున్న పరిటాల వర్గీయులు
సాక్షి, అనంతపురం : గతంలో పేద రైతులకు పంపణీ చేసిన భూములను పరిటాల వర్గీయులు ఆక్రమిస్తున్నారని, అధికారులపై పెత్తనం చెలాయిస్తూ రైతుల భూములను తమ పేరిట మార్చుకుంటున్నారని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ కార్యకర్తల నిర్వాకంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న రైతు కేశవనాయక్ కుటుంబాన్ని ఆయన ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేశవనాయక్ ఆత్మహత్యకు మంత్రి పరిటాల సునీత బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారులు ఆత్మకూరు మండలం వేపచర్ల రైతు కేశవనాయక్కు చెందిన భూమి పట్టాను రద్దు చేసి అదే భూమిని టీడీపీ కార్యకర్తలకు కేటాయించడంతో మనస్తాపానికి గురైన కేశవనాయక్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. -
రాళ్లు రువ్వుకున్న పరిటాల వర్గీయులు
సీకేపల్లి : అనంతపురం జిల్లా సీకేపల్లి మండలం ఓబులాపురంలో జరిగిన జనచైతన్య యాత్రలో రభస చోటుచేసుకుంది. పౌరసర ఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలుగా చీలిపోయిన టీడీపీ కార్యకర్తలు వాళ్లలో వాళ్లే రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు.