breaking news
parag shah
-
అత్యంత ధనికుడైన కార్పొరేటర్ ఎవరో తెలుసా?
-
అత్యంత ధనికుడైన కార్పొరేటర్ ఎవరో తెలుసా?
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగర పాలక సంస్థ.. బీఎంసీ దేశంలోనే అత్యంత ధనికమైన కార్పొరేషన్. అక్కడ పోటీ చేసిన అభ్యర్థులలో బీజేపీకి చెందిన పరాగ్ షా తనకు ఏకంగా రూ. 690 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. దాంతో ఈసారి పోటీ చేసిన అభ్యర్థులందరిలోకీ ఆయనే బాగా ధనవంతుడిగా తేలారు. బీఎంసీ ఎన్నికల్లో ఆయన 132వ నెంబరు వార్డులో గెలిచారు కూడా. ఆయన ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రవీణ్ ఛద్దాను ఓడించి మరీ ఆయన కార్పొరేటర్ అయ్యారు. సాధారణంగా ఘట్కోపర్, ములుంద్ ప్రాంతాల్లో గుజరాతీలు, జైన్ల ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి చోట పరాగ్ గెలవడం పెద్ద విశేషమే అంటున్నారు. మన్ కన్స్ట్రక్షన్స్, మన్ డెవలపర్స్ పేరుతో సొంత సంస్థలున్న ఆయన.. ముంబైతో పాటు గుజరాత్లో కూడా పలు ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. ఇక పరాగ్ చేతిలో ఓడిన ప్రవీణ్ ఛద్దా కూడా సామాన్యుడు ఏమీ కాదు. ప్రస్తుత బీఎంసీలో ప్రతిపక్ష నేత. అలాంటి వ్యక్తిని ఓడించడం బీజేపీకి మంచి ప్రతిష్ఠాత్మక విజయం అయ్యింది. పరాగ్ లాంటి బలమైన అభ్యర్థి అయితేనే విజయవకాశాలు ఉంటాయని భావించిన బీజేపీ.. ఆయనను బరిలోకి దించింది. అఫిడవిట్ ప్రకారం ముంబై, థానేలలో పరాగ్ షాకు 9 ఆస్తులున్నాయి. థానెలో ఒక ఫ్లాట్ విలువే 8 కోట్లు. -
ఈ అభ్యర్థికి రూ.690కోట్ల కళ్లు చెదిరే ఆస్తులు
ముంబయి: త్వరలో జరగనున్న బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో కళ్లు చెదిరే ఆస్తులున్న అభ్యర్థి బరిలోకి దిగాడు. అతడు నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల కమిషన్కు అతడు తెలిపిన తన ఆస్తుల విలువ అక్షరాల రూ.690కోట్లు. దీంతో ఈ ఏడాది జరుగుతున్న ఈ ఎన్నికల్లో అతడే అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలవనున్నాడు. వివరాల్లోకి వెళితే.. పరాగ్ షా అనే వ్యక్తి ఘట్కోపార్ ప్రాంతం నుంచి బీఎంసీ ఎన్నికల్లో బరిలోకి దిగాడు. బీజేపీ తరుపున పోటీ చేస్తున్నాడు. ఇతడు మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రకాశ్ మెహతాకు అత్యంత సన్నిహితుడిగా చెబుతుంటారు. ఇప్పటి వరకు రాజకీయ ముఖచిత్రంలో కనిపించకపోయినా.. ఒక్కసారిగా తన అనూహ్య ఆస్తులు ప్రకటించి మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాడు. సొంతంగా మేన్ కన్స్ట్రక్షన్స్, మేన్ డెవలపర్స్ పేరిట ముంబయితోపాటు గుజరాత్, చెన్నై వంటి ప్రముఖ నగరాల్లో ప్రాజెక్టు పనులు చేస్తుంటారు. ఈయన ఒక పెద్ద రియల్టర్ కూడా. రూ.670 కోట్లు చరాస్తులుగా, రూ.20 కోట్లు స్థిరాస్తులుగా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. వీటిల్లో కొన్ని తన భార్య పేరిట ఉన్నట్లు చెప్పాడు.