breaking news
the panchayat
-
రూ.కోటిన్నర స్థలం ధారాదత్తం ?
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పీలేరులో కాంగ్రెస్ నాయకులకు భూ సంతర్పణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అసైన్మెంట్ కమిటీ ఆమోదం లేకనే కోటిన్నర విలువ చేసే ఇందిరమ్మ కాలనీ స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ నేతకు రెవెన్యూ అధికారులు అప్పగించారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ స్థలాన్ని ఆ నాయకుడు లే-ఔట్లు వేసి విక్రయూనికి సిద్ధం చేశాడు. పీలేరు, న్యూస్‌లైన్: పీలేరు శివార్లలోని దొడ్డిపల్లె పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ కాలనీకి కేటారుుంచిన సర్వే నెంబర్ 1136/5లో రెండెకరాల స్థలంలో లే-ఔట్లు వేయడం వివాదాస్పదమైంది. ఇందిరమ్మ కాలనీ నిర్మాణం కోసం పీలేరు శివారు ప్రాంతం కోళ్లఫారంమిట్టన 2007లో 85 ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం లే-ఔట్లు వేసిన స్థలం కాలనీ నిర్మాణం కోసం తీసుకున్నప్పటికీ, ఆరో విడత భూపంపిణీలో సర్వే నెంబర్ 1136/1పై రెండెకరాల స్థలాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతకు పట్టా ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ విలువైన భూమిని కాంగ్రెస్ నేతకు అధికారులు అప్పనంగా ఇచ్చేసారని విమర్శలు వస్తున్నారుు. నియోజకవర్గ అసైన్మెంట్ కమిటీ తీర్మానం లేకుండానే అధికారులు భూసంతర్పణ చేసినట్లు సమాచారం. అసలేం జరిగిందంటే... పీలేరు మండలంలో ఆరో విడత భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 2012, ఆగస్టు 15న కలికిరి తహశీల్దార్ కార్యాలయంలో అసైన్మెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అర్హులైన 70 మందికి 129.21 ఎకరాల భూమిని పంపిణీ చేయూలని ఆమోదముద్ర వేశారు. దొడ్డిపల్లె పంచాయతీలో ఒక ఎస్సీ, నలుగురు బీసీలకు 10.61 ఎకరాలు, ఎంసీపాళెంలో ముగ్గురికి 5.92 ఎకరాలు, మేళ్లచెరువులో 41 మందికి 74.37 ఎకరాలు, ఎర్రగుంట్లపల్లెలో ఇద్దరికి 3.53 ఎకరాలు, అగ్రహారంలో ఇద్దరికి 3.84 ఎకరాలు, ముడుపులవేములలో నలుగురికి 5.71 ఎకరాలు, గూడరేవుపల్లెలో ఒకరికి 2.14 ఎకరాలు, జాండ్లలో ఒకరికి 2.66 ఎకరాలు, తలపులలో 8 మందికి 12.56 ఎకరాలు, రేగళ్లులో ముగ్గురికి 7.87 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని అసైన్మెంట్ కమి టీ ఆమోదముద్ర వేసింది. అసైన్మెంట్ కమిటీ సమావేశంలో ఆమోదం పొందకనే ఈ జాబితాతో పాటు దొడ్డిపల్లె పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 1136/5లో రెండెకరాల స్థలాన్ని ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఇవ్వడానికి అప్పటి మదనపల్లె సబ్ కలెక్టర్ సూచించనట్లు పేర్కొన్నారు. ఈ పేరు వద్ద తహశీల్దార్ సీలు లేకుండా కేవలం సంతకం మాత్రం ఉండడంతో పాటు, జాబితాలోని 70 పేర్లతో పోల్చితే చేతి రాత లోనూ తేడా ఉంది. క్రయవిక్రయాలు చెల్లవు స్థలాన్ని భూ పంపిణీలో ఇచ్చిన విషయం వాస్తవం. ఈ భూముల క్రయ విక్రయాలు చెల్లవు. కొన్నా, అమ్మినా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. లే-ఔట్లు వేసిన విషయం నా దృష్టికి కూడా వచ్చింది. వెంటనే వాటిని అడ్డుకుంటాం. -ఎం.ఖాదర్‌షరీష్, తహశీల్దార్ అది నా స్థలమే.. కాలనీ నిర్మాణం కోసం నా వద్ద తీసుకున్న స్థలానికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించ లేదు. దీంతో తిరిగి ఆ స్థలాన్ని ఆరో విడత భూపంపిణీలో అప్పటి మదనపల్లె సబ్ కలెక్టర్ హరికిరణ్ నాకే ఇచ్చారు. 1993లో ఎస్.అబ్దుల్లా వద్ద సర్వేనెంబరు 1136/1లో రెండెకరాల స్థలాన్ని కొన్నాను. 13 సంవత్సరాలు స్థలంలో వ్యవసాయం చేశాను. కాలనీ నిర్మాణం కో సం అందరి స్థలాలతోపాటు నా స్థలాన్ని తీసుకున్నా రు. నేను మాజీ సైనికుడిని కాబట్టి సబ్ కలెక్టర్‌కు నివేదించడంతో కాలనీ సమీపంలోని సర్వే నెంబరు 1136/5లో రెండెకరాల స్థలానికి పట్టా ఇచ్చారు. -లే ఔట్ యజమాని -
కాంగ్రెస్, టీడీపీలకు ఎదురుదెబ్బ (2013)
=జిల్లాలో మారిన రాజకీయ సమీకరణలు =కాంగ్రెస్, టీడీపీలకు కలిసిరాని 2013 =పంచాయతీ, సహకార ఎన్నికల్లో అధికార పార్టీకి చేదు ఫలితాలు =దొడ్డిదారిన సైకిల్ సాయంతో డీసీసీబీలో తిష్ట =నియోజకవర్గాల్లో టీడీపీకి నేతల కరువు =బలం పుంజుకున్న వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్, టీడీపీలకు 2013 సంవత్సరం కలిసిరాలేదు. పంచాయతీ, సహకార ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుగాలి వీచింది. అయితే దొడ్డిదారిన సైకిల్ సాయంతో డీసీసీబీలో తిష్ట వేసింది. టీడీపీ పరిస్థితీ మెరుగుపడలేదు. ఆ పార్టీకి పలు నియోజకవర్గాల్లో నేతలు కరువయ్యారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నుంచి బలం పుంజుకుంది. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటింది. సాక్షి, చిత్తూరు: 2013 సంవత్సరంలో నిర్వహించిన సహకార, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లాలో గౌరవమైన సంఖ్యలో స్థానాలు గెలుచుకోలేని దుస్థితికి అధికారపార్టీ దిగజారింది. అదే సమయంలో టీడీపీకి బలమైన దెబ్బతగిలింది. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా మెరుగైన ఫలితాలు సాధించినా ద్వితీయ స్థానంతో సంతృప్తిపడాల్సి వచ్చింది. వైఎస్ఆర్సీపీ సహకార, పంచాయతీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థానాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. అయితే ముఖ్యమంత్రి అధికారాన్ని ఉపయోగించి టీడీపీ సింగిల్‌విండో డెరైక్టర్ల మద్దతుతో దొడ్డిదారిన అమాస రాజశేఖర్‌రెడ్డికి కేంద్ర సహకారబ్యాంక్ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. సహకార ఎన్నికల్లో 3వ స్థానానికే టీడీపీ పరిమితమైంది. మొత్తం మీద తెలుగుదేశం, కాంగ్రెస్‌పార్టీలకు ఈ ఏడాది రాజకీయంగా కలిసి రాలేదు. ముగ్గురు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీలో చేరడంతో పుంగనూరు, తంబళ్లపల్లె, పలమనేరు నియోజకవర్గాల్లో ఆ పార్టీ మరింతగా బలపడింది. అదే సమయంలో సంవత్సరం చివరిలో జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే గాంధీ చంద్రబాబుకు షాక్ ఇచ్చి రాజీనామా చేసి బయటకు వచ్చారు. బలపడిన వైఎస్ఆర్సీపీ పంచాయతీ, సహకార ఎన్నికల్లో విజయం సాధించి మండల, గ్రామస్థాయిల్లో వైఎస్ఆర్సీపీ బలపడింది. అదే సమయంలో తొలి నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసమర్థ విధానాలతో విభేదిస్తూ వచ్చిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఆయన అనుచరవర్గం వైఎస్ఆర్సీపీలో చేరింది. చంద్రబాబు నిరంకుశత్వంతో విసిగి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీలకు నాయకులు లేకుండా పోయారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడ సరైన అభ్యర్థులనూ పెట్టుకోలేని పరిస్థితికి ఆ పార్టీలు చేరుకున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ హవా జిల్లాలో మూడు విడతలుగా సాగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఆరు వందలకుపైగా పంచాయతీల్లో విజయకేతనం ఎగురవేసి ప్రథమ స్థానంలో నిలిచింది. చాలా చోట్ల టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై ఉమ్మడి అభ్యర్థిని పెట్టినా వైఎస్ఆర్సీపీని దెబ్బకొట్టలేకపోయాయి. వైఎస్ఆర్సీపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులనే సర్పంచ్‌లుగా ఓటర్లు గెలిపించారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో టీడీపీ, కాంగ్రెస్ నిలిచాయి. పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి గల్లా అరుణ, ముఖ్యమంత్రి సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని రచించిన వ్యూహాలు ఫలించలేదు. పుంగనూరు నియోజకవర్గంలో అత్యధిక ఏకగ్రీవాలు చేసి మాజీ మంత్రి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ తడఖా చూపించారు. రేణిగుంట వంటి మేజర్ పంచాయతీనీ హోరాహోరీ పోరులో వైఎస్ఆర్సీపీ దక్కించుకుంది. కాంగ్రెస్ ఖాళీ రాష్ర్ట విభజనకు యూపీఏ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. నిన్నటి వరకు కాంగ్రెస్ అధిష్టానం మాటే శిరోధార్యం అంటూ వచ్చిన చంద్రగిరి ఎమ్మెల్యే, మంత్రి గల్లా అరుణకుమారి, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మలు టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. అదే సమయంలో 2009లో ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులూ వీలైతే వైఎస్ఆర్సీపీలోకి అవకాశం రాకపోతే టీడీపీలో చేరాలన్న ఆలోచనలో ఉన్నారు. జిల్లాలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కాంగ్రెస్‌కు జిల్లాలో మిగిలేది గుండు సున్నే. పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణకు అంటూ ఇక్కడ అనుచరవర్గం ఏమీ లేదు. ఇక మిగిలింది తిరుపతి ఎంపీ చింతామోహన్ మాత్రమే. ఆయనే కాంగ్రెస్‌కు దిక్కు. దొడ్డిదారిన డీసీసీబీలో కాంగ్రెస్ పాగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవిని అతికష్టంపైన టీడీపీ డెరైక్టర్ల మద్దతుతో కాంగ్రెస్ దక్కించుకుంది. జిల్లాలో వైఎస్ఆర్సీపీకి సొంతంగా 28 సింగిల్ విండోలు వచ్చాయి. అలాగే 27 స్థానాలతో కాంగ్రెస్, 19 స్థానాలతో టీడీపీ ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. మరో ఆరు సింగిల్ విండోలకు ఎన్నికలు జరగలేదు. కాంగ్రెస్‌కు చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు అవసరమైన మద్దతు లేకపోవడంతో దొడ్డిదారి రాజకీయాలకు పాల్పడింది. జిల్లా సహకార మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవి టీడీపీకి ఇచ్చి, డీసీసీబీ చైర్మన్‌గిరి కాంగ్రెస్ దక్కించుకుంది. అత్యధిక స్థానాలు గెలుచుకున్నా వైఎస్ఆర్సీపీకి అధికారం దక్కనివ్వకుండా టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడ్డాయి.