breaking news
Pancha Kattu
-
అచ్చ తెలుగుకట్టులో...
ప్యాంటు–షర్టు.. సూటూ బూటు.. ఇలా ఎన్ని వేసుకున్నా పంచె కట్టులో ఉండే అందమే వేరు. అందుకే హీరోలు పంచె కట్టుకుని కనిపిస్తే అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతారు. హీరోలు కూడా ఫ్యాన్స్‌ని ఆనందపరచడానికి సీన్ డిమాండ్ మేరకు పంచె కట్టుకుంటారు. మహేశ్‌బాబు తన ఫ్యాన్స్‌కి పంచె కట్టులో కనిపించి, కనువిందు చేయనున్నారని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ చిత్రం (‘భరత్ అనే నేను’ టైటిల్ పరిశీలనలో ఉంది) రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ పాటలో మహేశ్ పంచెకట్టులో కనిపిస్తారట. ‘శ్రీమంతుడు’లో మహేశ్‌తో గళ్ల లుంగీ కట్టించారు కొరటాల. ఇప్పుడు పంచె కట్టుకోవడానికి మహేశ్‌ని ఒప్పించారట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తమిళనాడులోని కారైకుడిలో జరుగుతోంది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మహేశ్ బాబు తన ఫ్యామిలీతో కలసి చిన్న ఫారిన్ ట్రిప్‌కు వెళతారట. -
ఒకరికి ఇద్దరు సోగ్గాళ్లు!
‘బంగార్రాజు భలే బాగున్నాడు.. పంచెకట్టు అదిరింది’ అంటూ ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్ర స్టిల్ చూసి, ఆయన అభిమానులే కాదు.. తెలుగు ప్రేక్షకులు కితాబులిచ్చేశారు. నాగ్ ఇలా పంచెకట్టులో కనిపించడం అక్కినేని అభిమానులకు కనువిందు. ఇక, ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్ కూడా అలా కనిపిస్తే, ఇక చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. సోమవారం చైతూ, అఖిల్ అలానే దర్శనమిచ్చారు. పంచెకట్టు, చలవ కళ్లద్దాలతో కారుకి కుడి, ఎడమపక్కల స్టైల్‌గా నిలబడి చైతూ, అఖిల్ దిగిన ఫొటో బయటికొచ్చింది. ఈ ఫొటో బయటికొచ్చిన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వీర విహారం చేసింది. ‘ది న్యూ కూల్ జూనియర్ అండ్ సీనియర్ బంగార్రాజు’ అని ఆ ఫొటోకు ఓ క్యాప్షన్ కూడా పెట్టారు. నాగార్జున అంటే సరే... సినిమా చేశారు కాబట్టి, పంచె కట్టక తప్పలేదు. మరి... కొడుకులిద్దరూ హఠాత్తుగా ఈ గెటప్‌లో ప్రత్యక్షం కావడానికి కారణం ఏమిటనే విషయానికొస్తే... ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం ప్రచారంలో భాగంగా ఓ టీవీ చానల్ నాగ్, చైతూ, అఖిల్... ఈ ముగ్గుర్నీ కలిపి ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూకే తండ్రీ కొడుకులు ఇలా హాజరయ్యారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 15న రిలీజ్ కానుంది. -
అసెంబ్లీకి ‘పంచెకట్టు’
సాక్షి, చెన్నై: పంచెకట్టుకు ఎదురైన పరాభావం సోమవారం అసెంబ్లీని తాకింది. క్రికెట్ క్లబ్ నిర్వాకంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. క్లబ్‌పై చర్య తీసుకోవాలని పట్టుబట్టాయి. న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యా శాఖ మంత్రి కేసీ వీరమణి సభకు హామీ ఇచ్చారు. తమిళ సంప్రదాయ వస్త్రధారణ పంచెకట్టుకు వ్యతిరేకంగా చెన్నై క్రికెట్ క్లబ్ వ్యవహరించిన తీరు గురించి తెలిసిందే. ఈ వ్యవహారంపై తమిళాభిమాన సంఘాలు, రాజకీయ పార్టీలుతీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ క్లబ్‌పై చర్యకు డిమాండ్ చేస్తూ ఆందోళనలు మొదలయ్యూయి. ఈ పరిస్థితుల్లో పంచెకట్టుకు ఎదురైన పరాభావం సోమవారం ఉదయం అసెంబ్లీని తాకింది. ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం ఈ వ్యవహారంపై చర్చకు ప్రత్యేక తీర్మానానికి ప్రతి పక్షాలు ప్రవేశ పెట్టారుు. ఇందుకు స్పీకర్ ధనపాల్ అనుమతి ఇవ్వడంతో అన్ని రాజకీయ పక్షాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రసంగించారు. చర్యకు పట్టు : డీఎంకే శాసన సభా పక్ష నేత ఎంకే స్టాలిన్ ప్రసంగిస్తూ, క్లబ్ నిర్వాకాన్ని తీవ్రంగా ఖండించారు. ఆంగ్లేయులు దేశం విడిచి వెళ్లినా, వారి సంస్కృతి, వారు పెట్టిన ఆంక్షలు, నిబంధనలు ఇంకా అనేక క్లబ్‌లు అనుసరించడం సిగ్గు చేటుగా పేర్కొన్నారు. క్రికెట్ క్లబ్, జింకాన క్లబ్‌తో పాటుగా కొన్ని స్టార్ హోటళ్ల తీరు తమిళ సంస్కృతి సంప్రదాయాలకు భంగం కలిగేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. డీఎండీకే ఎమ్మెల్యే చంద్రకుమార్ ప్రసంగిస్తూ, పంచెకట్టుకు వ్యతిరేకంగా వ్యవహరించడం తమిళుల మనోభావాల్ని కించ పరచడమేనని పేర్కొన్నారు. సీపీఎం ఎమ్మెల్యే సౌందరరాజన్ ప్రసంగిస్తూ, క్లబ్‌లు, హోటళ్లలో ఉన్న ఆంక్షల్ని ఎత్తి వేసే విధంగా ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ ఎమ్మెల్యే ఆర్ముగం ప్రసంగిస్తూ, పంచెకట్టుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కొన్ని సంస్థలు, మున్ముందు రోజుల్లో తమిళ సంప్రదాయాన్ని, సంస్కృతిని పూర్తిగా విచ్ఛిన్నం చేయడం ఖాయం అని హెచ్చరించారు. కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత గోపినాథ్ ప్రసంగిస్తూ, దివంగత నేతలు అన్నా, కామరాజర్ పంచెకట్టుతోనే ఢిల్లీకి వెళ్లారని, పార్లమెంట్లో సైతం పంచెకట్టుతో హాజరయ్యే తమిళ నేతలు నేటికీ ఉన్నారని వివరించారు. పార్లమెంట్‌లోనే పంచెకట్టుకు అనుమతి ఉన్నప్పుడు, ఈ క్లబ్‌ల్లో ఆంక్షలేమిటో అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్వర్డ్ బ్లాక్ ఎమ్మెల్యే కదిరవన్, పీఎంకే ఎమ్మెల్యే గణేష్‌కుమార్, ఎంఎంకే ఎమ్మెల్యే అస్లాం బాషా, ఎస్ఎంకే ఎమ్మెల్యే నారాయణ తమ ప్రసంగాల్లో ఆ క్లబ్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్లబ్‌పై కేసులు నమోదు చేయాలని, పంచెకట్టును అవమానించిన వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయ నిపుణులతో చర్చ: ప్రతి పక్షాల పట్టుకు అధికార పక్షం దిగి వచ్చింది. పాఠశాల విద్యా శాఖ మంత్రి కేసీ వీరమణి ప్రతి పక్షాల వినతిని పరిగణనలోకి తీసుకుని సభకు హామీ ఇచ్చారు. ఆ క్లబ్ నిర్వాకంపై పరిశీలన జరుపుతున్నామన్నారు. న్యాయ నిపుణులతో చర్చించినానంతరం, సీఎం జయలలిత దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.