అచ్చ తెలుగుకట్టులో... | Panche Kattu by Mahesh Babu | Sakshi
Sakshi News home page

అచ్చ తెలుగుకట్టులో...

Dec 25 2017 12:07 AM | Updated on May 10 2018 12:13 PM

Panche Kattu by Mahesh Babu  - Sakshi

ప్యాంటు–షర్టు.. సూటూ బూటు.. ఇలా ఎన్ని వేసుకున్నా పంచె కట్టులో ఉండే అందమే వేరు. అందుకే హీరోలు పంచె కట్టుకుని కనిపిస్తే అభిమానులు ఫుల్‌ ఖుషీ అయిపోతారు. హీరోలు కూడా ఫ్యాన్స్‌ని ఆనందపరచడానికి సీన్‌ డిమాండ్‌ మేరకు పంచె కట్టుకుంటారు. మహేశ్‌బాబు తన ఫ్యాన్స్‌కి పంచె కట్టులో కనిపించి, కనువిందు చేయనున్నారని సమాచారం.

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ చిత్రం (‘భరత్‌ అనే నేను’ టైటిల్‌ పరిశీలనలో ఉంది) రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ పాటలో మహేశ్‌ పంచెకట్టులో కనిపిస్తారట. ‘శ్రీమంతుడు’లో మహేశ్‌తో గళ్ల లుంగీ కట్టించారు కొరటాల. ఇప్పుడు పంచె కట్టుకోవడానికి మహేశ్‌ని ఒప్పించారట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ తమిళనాడులోని కారైకుడిలో జరుగుతోంది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం మహేశ్‌ బాబు తన ఫ్యామిలీతో కలసి చిన్న ఫారిన్‌ ట్రిప్‌కు వెళతారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement