breaking news
Pallerlamudi
-
రామిలేరులో గోదావరి జలాల ఉధృతి
హనుమాన్‌జంక్షన్ రూరల్ : రామిలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం కుడి ప్రధాన కాలువకు నూజివీడు మండలం పల్లెర్లమూడిలో రామిలేరుపై నిర్మించిన అండర్‌టెన్నెల్ వద్ద సోమవారం తెల్లవారుజాయున గండి పడింది. దీంతో రామిలేరు గోదావరి జలాలతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎన్నడూ లేని విధంగా నీటి ప్రవాహం ఉండటంతో పల్లెర్లమూడి, సీతారామపురం, కొయ్యూరు, బొమ్ములూరు తదితర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేల క్యూసెక్కుల గోదావరి జలాలు కోల్లేరులోకి వృథాగా చేరుతున్నాయి. బాపులపాడు మండలం కొయ్యూరు వద్ద రామిలేరు నుంచి పెద్ద చెరువులోకి నీళ్లు మళ్లించేందుకు నిర్మించిన చెక్‌డ్యాం సైతం నీటి వేగానికి పూర్తిగా ధ్వంసమైంది. పొక్లెయిన్ సైతం నీటి ఉధృతికి కొట్టుకొచ్చింది. గట్టు బలహీనంగా ఉన్నచోట్ల గండి పడే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
పల్లెర్లమూడిలో భారీ చోరీ
పల్లెర్లమూడి(నూజివీడు రూరల్), న్యూస్‌లైన్ : మండలంలోని పల్లెర్లమూడిలోని ఓ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి సమయంలో భారీ దొంగత నం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సొసైటీ అధ్యక్షుడు పెదర్ల సత్యవరప్రసాద్ శుభకార్యం నిమిత్తం మంగళవారం రాత్రి నూజి వీడు వచ్చారు. వివాహం ముగిసిన తరువాత రాత్రి ఒంటిగంట సమయంలో స్వగ్రామం చేరుకున్నారు. ఇంటికి వెళ్లి చూడగా ముఖద్వారానికి వేసిన తాళం పగులగొట్టి ఉంది. తలుపులు తెరిచి ఉన్నాయి. లోపల బీరువా తలుపులు కూడా తెరిచి ఉన్నాయి. అందులోని వస్తువులు, దుస్తులు మంచం మీద చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో దాచిన రూ.90 వేలు నగదు, 45 కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఆయన గుర్తించారు. ఆభరణాల విలువ రూ.11.25 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపారు. ఘటన జరిగిన రోజు వరప్రసాద్ భార్య వేరే ఊరికి వెళ్లారు. దొంగతనం గురించి సమాచారం అందుకున్న సీఐ సిహెచ్.వి.మురళీకృష్ణ, రూరల్ ఎస్సై బి.ఆదిప్రసాద్ సిబ్బందితో వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. తెలిసినవారి పనే ? సంఘటన జరిగిన తీరును చూస్తే బాగా తెలిసిన వ్యక్తులే చోరికీ పాల్పడి ఉంటారని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమ యం చూసుకుని అర్ధరాత్రి ఒంటిగంట లోపే తాళం పగులగొట్టి సొత్తు దొంగిలించుకుపోవడాన్ని బట్టి వీరు ఆ విధంగా అంచనాకు వచ్చారు. సత్యవరప్రసాద్ వివాహానికి వెళ్లిన సంగతిని, ఆయన భార్య ఊరికి వెళ్ళిన విషయాన్ని బాగా గమనించి ఈ చోరీకి పాల్పడి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు.