breaking news
palakonda mla kalavati
-
ప్రతి ఇంటికీ ఆడబిడ్డనయ్యా
సాక్షి, పార్వతీపురం మన్యం: ఏజెన్సీలో గిరిజన ప్రజలందరికీ నేను ఆత్మబంధువును. నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ ఆడబిడ్డనయ్యాను. పదేళ్లుగా పాలకొండ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరిస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ ప్రేమాభిమానాలు మున్ముందూ ఇలాగే సాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. నియోజకవర్గంలోని 102 సచివాలయాల పరిధిలోని దాదాపు 78 వేల గడపల వద్దకు వెళ్లి వారందరితో మమేకమయ్యా. కష్టసుఖాలు తెలుసుకున్నా. ఇన్ని వేల కుటుంబాలను నాకు ఇచ్చింది జగనన్నే.’’ అని పాలకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిని విశ్వాసరాయి కళావతి అన్నారు. పాలకొండ నియోజకవర్గంలో ఇంతవరకు చేసిన అభివృద్ధి, ఇంకా చేయబోయే పనులు..కూటమి దుష్ప్రచారం తదితర అంశాలను ‘సాక్షి’తో ముఖాముఖిలో ఆమె వివరించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ప్రజల కోసమే..పదవిమా కుటుంబంలో చాలామంది ఎమ్మెల్యేలున్నారు. నేను రెండుసార్లు గెలిచాను. పదవులు మాకు ము ఖ్యం కాదు. విలువలతో కూడిన ఎదుగుదల మా పెద్దల నుంచి నేర్చుకున్నా. అందుకే ఎప్పుడూ నిరా డంబరంగా ఉంటా. మా ప్రజల ప్రతి కష్టసుఖంలో నూ తోడుగా ఉంటా. వారితో కలిసిపోతాను. ఎప్పు డూ ప్రజల్లోనే ఉండాలని మా అధినేత జగన్మోహన్రెడ్డి చెబుతుంటారు. అందుకే అందరూ నన్ను ఆశీర్వదిస్తూ, వారి బిడ్డగా చూసుకుంటారు. ఇప్పు డు ప్రచారానికి వెళ్లినప్పుడు కూడా ఎక్కడికక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో మరింతగా ప్రజలకు సేవ చేసుకుంటాం.ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయితేనే తమకు మేలు చేస్తాడన్న నమ్మకం, భరోసా గిరిజనులందరిలోనూ ఉందని వైఎస్సార్సీపీ పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వాస రాయి కళావతి అన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో వివిధ సంక్షేమ పథకాల కింద దాదాపు రూ.1,300 కోట్ల మేర నియోజకవర్గంలోని పేదలకు అందించామని చెప్పారు. నాన్ డీబీటీ కింద సుమారు రూ.218 కోట్ల మేర వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులు పొందారని వివరించారు. గడిచిన 59 నెలల కాలంలోనే ఇదంతా సాధించామని చెప్పారు. ఎన్నికలొచ్చాయని ప్రజల ముందుకు బూటకపు హామీలతో వస్తున్న విషపు కూటమి నేతలను ఎవరూ నమ్మవద్దని హితవు పలికారు.సంపూర్ణంగా మహిళా సాధికారత2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన నవరత్నాల పథకాలు ప్రతి ఇంటికీ అందాయి. జీవితాలను బాగు చేశాయి. గతంలో ఏ ప్రభుత్వమూ ఇన్ని పథకాలను విజయవంతంగా 99 శాతం అమలు చేసింది లేదు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడి పథకాన్ని రూ.17 వేలకు పెంచుతున్నాం. రైతులకు ఇచ్చే భరోసా మొత్తం రూ.16 వేలు అవుతుంది. దీనివల్ల రైతుకు మరింత సాయం అందించేవారమవుతాం. మహిళల సాధికారత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ప్రతి పథకం మహిళలకే అందుతోంది. చేయూత పథకం ద్వారా ఎంతో మంది స్వయం ఉపాధి పొందారు. కొందరు భూములు, బంగారం కొనుగోలు చేసుకుని భవిష్యత్తు అవసరాలకు ఉంచుకున్నారు.నిన్ను ఎలా నమ్ముతారు బాబూ..గత టీడీపీ హయాంలో నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా గిరిజనులకు ఎటువంటి పథకాలూ అందలేదు. కనీసం రేషన్‌కార్డులు, ఆధార్ కార్డులు వంటివి కూడా లేవు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను గుర్తించి ప్రతి ఇంటికీ మేలు చేశాం. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూటమిగట్టి..బూటకపు హామీలిస్తున్నాయి. అవేవీ నమ్మశక్యంగా లేవు. 2014 మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఎన్ని అమలు చేశారు? పోనీ, ఇప్పుడు మేనిఫెస్టో కూడా ఉమ్మడిగా ఇచ్చే ధైర్యం చేయలేకపోయారు. కూటమిలోని బీజేపీ దూరంగా ఉంది. అంటే..దాని అమలు మీద వారిలో వారికే నమ్మకం లేదు. ఇంక ప్రజలు ఎలా నమ్ముతారు..అభివృద్ధి అంటే ఇది కాదా?59 నెలల కాలంలో గతంలో ఏ ప్రభుత్వమూ చేయని అభివృద్ధి నియోజకవర్గంలో చేసి చూపించాం. కొన్ని పెండింగ్ పనులు మిగిలిపోయాయంటే..అది గత టీడీపీ ప్రభుత్వ కక్షపూరిత వైఖరే. ఆ విషయం విజ్ఞులైన నియోజకవర్గ ప్రజలు, మేధావులందరికీ తెలుసు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 4,086 మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాం. కిమ్మి–రుషింగి వంతెన నిర్మాణం రూ.27.50 కోట్లతో పూర్తి చేశాం. సీతంపేటలో సుమారు రూ.50 కోట్లతో మల్లీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది. సీతంపేట ఆస్పత్రిని రూ.19 కోట్లతో అప్‌గ్రేడ్ చేశాం. టీటీడీ ద్వారా రూ.10 కోట్లతో ఆలయాన్ని నిర్మించాం. 146 దేవాలయాలకు ఒక్కో గుడికి రూ.10 లక్షలు చొప్పున టీటీడీ దేవస్థానం నుంచి మంజూరు చేయించాం. బత్తిలిలో రూ.2.5 కోట్లతో మోడల్ పోలీస్‌స్టేషన్ నిర్మాణం చేపట్టాం. నియోజకవర్గంలో రూ.214 కోట్లతో సుమారు 234 కి.మీ. మేర రోడ్లు, 41 కి.మీ మేర డ్రైన్లు వేశాం. 102 సచివాలయాల నిర్మాణం, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్ల నిర్మాణం, నాడు–నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి మా హయాంలోనే చేపట్టాం. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలు చొప్పున వెచ్చించి మరిన్ని పనులు చేశాం. సంక్షేమ పథకాల లబ్ధి కోసం మరో రూ.1,500 కోట్లకుపైగా వెచ్చించాం. ఇదంతా అభివృద్ధి కాదా? ముందు ప్రభుత్వాలు ఇవేవీ ఎందుకు చేయలేదు? మాపై దుష్ప్రచారం చేస్తున్న వారు వీటికి సమాధానం చెప్పగలరా? కరోనా వంటి కష్టకాలంలో పేదలకు మా ప్రభుత్వం అండగా నిలిచింది. అందుకే ఇప్పుడు ధైర్యంగా వారి వద్దకు వెళ్లగలుగుతున్నాం. పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం.పర్యాటకంగా అభివృద్ధి, ఉపాధిసీతంపేటలో పర్యాటకంగా అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయి. రూ.2.5 కోట్లతో అడలి వ్యూపాయింట్, గిరిజన మ్యూజియం అభివృద్ధితోపాటు, మరికొన్ని ప్రాంతాలు, జలపాతాలపై దృష్టి సారించాం. ఇప్పటికే ఇక్కడ అడ్వెంచర్పార్కు ఉంది. నేను అభివృద్ధి కోరుకునేదానిని. టూరిజం కోసం అప్పట్లోనే ప్రశ్నించా. యువతకు కూడా స్థానికంగా నే ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో పరిశ్రమలు తె చ్చే ఆలోచన ఉంది. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాం. దాదాపు 10 వేల మంది వరకూ ఇక్క డే ఉపాధి లభిస్తే బాగుంటుందన్నది నా ఆలోచన.కూటమికి ప్రజలే బుద్ధి చెబుతారు..కూటమి పేరుతో ఓట్ల కోసం వస్తున్న వారి గత చరిత్ర ఎలాంటిదో ఇక్కడ అందరికీ తెలుసు. వారి అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారికి ప్రజలే ఓట్ల ద్వారా బుద్ధి చెబుతారు. -
ఎమ్మెల్యే ప్రకృతి సేద్యం
రసాయనిక అవశేషాల్లేకుండా ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసుకోవడానికి రోజువారీ పనుల వల్ల తీరిక దొరకటం లేదనుకుంటూ ఉంటారు. అయితే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇందుకు శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి నిదర్శంగా నిలుస్తూ ఇంటిపంటలను ఇష్టంగా సాగు చేస్తున్నారు. ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజలతో మమేకం అవుతూ ఉండే ఆమె ప్రకృతి వ్యవసాయ ప్రేమికురాలు కావడం విశేషం. స్వగ్రామం వండువలో ఇంటి పక్కనే ఉన్న 50 సెంట్ల స్థలాన్ని ఉద్యాన పంటల వనంలా మార్చారు. ఆకుకూరలు, పందిరి కూరగాయ పంటలు ఆనప, బీర, బెండ, గుమ్మడి కాయల దిగుబడి బాగుంది. ఒక్కో ఆనపకాయ 10 నుంచి 20 కిలోల బరువు పెరుగుతున్నాయి. కంది, చెరకు, పెండలం, కంద ఇలా అనేక పంటలను సాగు చేస్తున్నారు. వంటకు బయోగ్యాస్‌ను వినియోగిస్తున్నారు. పంటలకు సొంతంగా తయారు చేసుకున్న సేంద్రియ ఎరువును, జీవామృతాన్ని, కషాయాలను వాడుతూ మంచి దిగుబడి సాధిస్తుండటం విశేషం. పెరటి పంటల పనులను కళావతి ప్రతి రోజూ ఉదయం గంట సేపు స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. పెరటి తోటలో కలియ దిరుగుతూ సిబ్బందికి తగిన సూచనలిస్తారు. పురుగు గానీ, ఆకు ముడత కనపడినా వెంటనే వాటిని తీసేయడం ద్వారా చక్కని పంట దిగుబడులు పొందుతుండడం విశేషం. – సూరాబత్తుల గాంధీ, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా మహిళలు పెరటి తోటల సాగు చేపట్టాలి శ్రద్ధగా చేస్తే ప్రకృతి/సేంద్రియ సాగు అసాధ్యమేమీ కాదు. సేంద్రియ ఎరువుతో భూమిని సారవంతం చేస్తే పంటల సాగుకు అనుకూలంగా మారుతుంది. బాల్యం నుంచీ పంటల సాగు అంటే బాగా ఇష్టం. ఇంటి దగ్గర కొద్ది స్థలంలో సరదాగా చేపట్టిన సాగు 50 సెంట్లకు విస్తరించింది. మహిళలంతా పెరటి తోటల సాగు చేపట్లేలా స్ఫూర్తినివ్వాలన్నది నా కోరిక. సేంద్రియ ఎరువులతో ఇంటి వద్దనే ఆరోగ్యదాయకమైన కూరగాయలు, పండ్లు సాగు చేసుకునేందుకు మహిళలు ముందుకు రావాలి. – విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా -
చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
విశాఖ : తెలుగుదేశం పార్టీలో చేరాల్సిన అగత్యం తనకు లేదని పాలకొండ ఎమ్మెల్యే కళావతి వ్యాఖ్యానించారు. పార్టీ మారతారన్న వార్తలను ఆమె సోమవారమిక్కడ ఖండించారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేక ప్రజలను మోసగిస్తున్న టీడీపీలో తాను ఎందుకు చేరతానని కళావతి ప్రశ్నించారు. తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నందుకే చంద్రబాబు ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. పార్టీ మరుతున్నట్లు టీడీపీ నేతలు, ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న మీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై ఉన్న విశ్వాసంతోనే తమను ప్రజలు గెలిపించారన్నారు. పార్టీపై, వైఎస్ జగన్‌పై ఉన్న విశ్వాసాన్ని వమ్ము చేయనని ఎమ్మెల్యే కళావతి తెలిపారు.