breaking news
Pakistan foreign secretary
-
ఇస్ ఇండియన్‌కో నికాలో!
న్యూయార్క్: పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శి న్యూయార్క్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ భారతీయ టీవీచానెల్ జర్నలిస్టుకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఎన్డీటీవీ జర్నలిస్టు పట్ల కొంత దురుసుగా ప్రవర్తిస్తూ.. ’ఇస్ ఇండియన్‌కో నికాలో’ (ఈ భారతీయుడ్ని వెళ్లగొట్టండి) అంటూ బయటకు పంపించారు. జమ్మూకశ్మీర్‌లోని యూరిలో తాజా ఉగ్రవాద దాడితో భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో న్యూయార్క్‌లోని రూజ్వెల్ట్ హోటల్లో పాక్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారతీయ జర్నలిస్టులెవరినీ అనుమతించలేదు. ఈ సమావేశానికి హాజరైన ఎన్డీటీవీ జర్నలిస్టు నమ్రత బ్రార్‌ను బయటకు పంపించారు. అంతేకాకుండా 18మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న యూరి ఉగ్రవాద దాడిపై భారతీయ పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు పాక్ నాయకత్వం జవాబు దాటవేసింది. న్యూయార్క్‌లో ఉన్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారతీయ విలేకరుల ప్రశ్నలను పూర్తి తోసిపుచ్చుతూ.. వారిని ఏమాత్రం పట్టించుకోనట్టు వ్యవహరించారు. మరోవైపు మాత్రం జమ్ముకశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, బ్రిటన్ ప్రధాని థెరిసా మేలతో సమావేశాల్లో మొసలి కన్నీరు కార్చారు. -
యూఎస్‌లో పాక్ నూతన రాయబారిగా జిలానీ
అమెరికాలో పాకిస్థాన్ నూతన రాయబారిగా జలీల్ అబ్బాస్ జిలానీని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గత రాత్రి పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం జలీల్ అబ్బాస్ జిలానీ పాక్ విదేశాంగ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కావున డిసెంబర్ మాసంలో జిలానీ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారని విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొంది. గతంలో జిలానీ పాక్ రాయబారిగా బెల్జియం, లక్సింబర్గ్, యూరోపియన్ యూనియన్ దేశాల్లో పని చేశారని ఈ సందర్భంగా తెలిపింది. అలాగే 1990 -1992 మధ్య కాలంలో పాక్ ప్రధాన మంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేశారని వెల్లడించింది.