Pakistan agent
-
ఐఎస్ఐ ఏజెంట్ జ్యోతి మల్హోత్రా!
చండీగఢ్/న్యూఢిల్లీ: ఇండియన్ అండర్‌కవర్ ఏజెంట్లను గుర్తించడానికి పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra)(33)ను వాడుకుందా? నిజమేనని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఐఎస్ఐ హ్యాండ్లర్ అలీ హసన్‌తో వాట్సాప్‌లో జ్యోతి చేసిన చాటింగ్‌లను వెలికి తీశారు. ఇద్దరి మధ్య కోడ్ భాషలో ఈ చాటింగ్‌లు జరిగాయి. ఒక చాటింగ్‌ను పరిశీలిస్తే.. భారత అండర్‌కవర్ ఏజెంట్ల వివరాలు, వారి ఆపరేషన్ల గురించి అలీ హసన్ ఆమెను ప్రశ్నించాడు.భారత్–పాక్ సరిహద్దు అయిన అటారీ బోర్డర్‌ను సందర్శించినప్పుడు ప్రత్యేక ప్రోటోకాల్ ఉన్న అండర్‌కవర్ ఏజెంట్లను చూశావా? అని ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని జ్యోతి బదులిచ్చింది. ప్రోటో కాల్ అందుకున్నవారే అండర్ కవర్ ఏజెంట్లు కావొ చ్చు అని అలీ హసన్ చెప్పగా, అలాంటి వారిని తాను చూడలేదని పేర్కొంది. భారత నిఘా ఏజెంట్ల గుట్టుమట్లు తెలుసుకోవడానికి జ్యోతిని అస్త్రంగా ఉపయోగించినట్లు అంచనా వేస్తున్నారు. ఐఎస్ఐ కోసమే పని చేస్తున్నట్లు ఆమెకు పూర్తి అవగాహన ఉందని పేర్కొంటున్నారు. పాకిస్తాన్‌కు సంబంధించిన భారీ గూఢచార ముఠాలో ఆమె ఒక కీలక సభ్యురాలని నిర్ధారణకు వచ్చారు. జ్యోతి తొలిసారిగా 2023లో బైశాఖి పండుగ సమయంలో పాకిస్తాన్లో పర్యటించింది. ఈ సరిహద్దులు ఇంకా ఎన్నాళ్లో.. జ్యోతి మల్హోత్రా వ్యక్తిగత డైరీ దర్యాప్తు అధికారుల చేతికి చిక్కింది. ఆమె తన ఆలోచనలు, పర్యటనల గురించి ఇందులో రాసుకుంది. పాకిస్తాన్ ప్రస్తావన సైతం ఉంది. డైరీలో 11 పేజీల్లో రాయగా.. 8 పేజీల్లో సాధారణ అంశాలు, 3 పేజీల్లో పాకిస్తాన్ గురించి హిందీ, ఇంగ్లిష్ భాషలో రాతలు కనిపిస్తున్నాయి. ‘‘పాకిస్తాన్ ప్రజల ఆదరణ, వారి అతిథి మర్యాదలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాకిస్తాన్లో భారతదేశ హిందువుల పర్యటనలు ఇంకా పెరగాలని కోరుకుంటున్నా. పాకిస్తాన్‌లోని తమ పూరీ్వకుల గ్రామాలను హిందువులు సందర్శించాలి.అక్కడి హిందూ ఆలయాలు, గురుద్వారాలకు సులువుగా వెళ్లొచ్చే పరిస్థితులు రావాలి. 1947లో దేశ విభజన తర్వాత విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలిస్తే బాగుంటుంది. పాకిస్తాన్లో పది రోజుల పర్యటన పూర్తి చేసుకొని ఈ రోజే ఇండియాకు తిరిగొచ్చా. రెండు దేశాల మధ్య ఈ సరిహద్దులు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. బాధపడే హృదయాలకు ఉపశమనం కలగాలి. మనమంతా ఒకే దేశం, ఒకే నేలకు చెందినవాళ్లం’’ అని జ్యోతి తన డైరీలో రాసుకుంది. మరోవైపు ఆమె కశీ్మర్ పర్యటనల వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.అర్ధరాత్రి పొద్దుపోయే దాకా పనిచేయడం ఆమెకు అలవాటు అని గుర్తించారు. రాత్రి ఒంటి గంట సమయంలో వీడియోలను ఎడిటింగ్ చేసి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండేదని చెప్పారు. చాలా సందర్భాల్లో ఢిల్లీకి వెళ్తున్నానని ఇంట్లో వాళ్లకు చెప్పి మరోచోటుకి వెళ్లినట్లు గుర్తించారు. జ్యోతి వ్యవహారం తెలిసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఆమె ఫోటోలన్నీ తొలగించారు. తన బిడ్డ సంగతి తనకు తెలియదని, దీనిపై తనను ఏమీ ప్రశ్నించవద్దని జ్యోతి తండ్రి స్పష్టం చేశారు. నిందితురాలిపై ప్రశ్నల వర్షంయూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)తోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. పూర్తి సమాచారం రాబట్టానికి భిన్న కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. జ్యోతి మల్హోత్రా ఆర్థిక లావాదేవీలు, ప్రయాణాల వివరాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. ఆమె పాకిస్తాన్, చైనాతోపాటు ఇతర దేశాల్లో పర్యటించినట్లు తెలుస్తోంది. ‘ట్రావెల్ విత్ జో’ అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ నెల 16న ఆమెను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు. గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో గత రెండు వారాల్లో మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. ఆదాయానికి, ఖర్చులకు పొంతనేదీ?ఇదిలా ఉండగా, నిందితురాలు జ్యోతి మల్హోత్రా ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ పర్యటించింది, ఎవరిని కలిసిందీ పూర్తి వివరాలు తెలిస్తే వాటన్నింటినీ క్రోడీకరిస్తామని, దానివల్ల దర్యాప్తు వేగంగా ముందుకు సాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. యూట్యూబ్ చానల్ ద్వారానే తనకు ఆదాయం వస్తోందని నిందితురాలు చెబుతుండగా, అధికారులు విశ్వసించడం లేదు. ఆమెకు వచ్చిన ఆదాయానికి, విదేశీ పర్యటనలకు అయిన ఖర్చులకు పొంతన లేదని అంటున్నారు. అందుకే ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వివరాలు కూపీ లాగుతున్నారు.జ్యోతి ల్యాప్‌టాప్‌పై ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతోందని అధికారులు చెప్పారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్–పాకిస్తాన్ మధ్య నాలుగు రోజులపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో జ్యోతి మల్హోత్రా ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేసే ఓ అధికారిని తరచుగా కలిసింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సిబ్బందితో ఆమెకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు. సోషల్ మీడియా ద్వారా జనంలో గుర్తింపు పొందినవారిని నియమించుకొని, దేశ రహస్యాలు కొల్లగొట్టడం ఆధునిక యుద్ధరీతిలో ఒక భాగంగా మారిందని తెలిపారు. -
పాక్ మహిళల మాయలో ఆర్మీ జవాన్.. కీలక సమాచారం లీక్!
జైపూర్: పాకిస్థాన్ మహిళలు విసిరిన వలపు వల(హనీట్రాప్)లో పడి సైన్యానికి సంబంధించిన కీలక సమాచారం లీక్ చేశాడన్న ఆరోపణలతో ఓ ఆర్మీ ఉద్యోగి అరెస్టయ్యారు. సైన్యానికి సంబంధించిన సమాచారం లీక్ ఆరోపణలతో భారత ఆర్మీ జవాన్ శాంతిమే రాణా(24)ను అరెస్ట్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అధికారిక రహస్యాల చట్టం 1923 కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని బగుండా జిల్లా కంచన్పుర్ గ్రామానికి చెందిన శాంతిమే రాణా ప్రస్తుతం జైపూర్‌లోని ఆర్టెరీ యూనిట్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘సామాజిక మాధ్యమాల వేదికగా పాకిస్థాన్ ఏజెంట్లు గుర్నౌర్ కౌర్ అలియాస్ అంకిత, నిషాలు రాణాకు పరిచయమయ్యారు. రాణా ఫోన్ నంబర్ తీసుకున్నారు. వాట్సాప్ ద్వారా ఇద్దరు జవాన్‌తో మాట్లాడేవారు. వారిని పూర్తిగా నమ్మినట్లు గుర్తించిన తర్వాత నిఘా సమాచారం సేకరించటం మొదలు పెట్టారు. అందుకు బదులుగా రాణా ఖాతాలో కొంత డబ్బు సైతం జమ చేశారు.’ అని రాజస్థాన్ పోలీస్ నిఘా విభాగం డీజీ ఉమేష్ మిశ్రా తెలిపారు. ఇలా ట్రాప్ చేశారు.. 2018, మార్చిలో ఆర్మీ చేరారు జవాన్ శాంతిమే రాణా. ప్రస్తుతం జైపూర్‌లోని ఆర్టెరీ యూనిట్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమయ్యారు ఇద్దరు పాకిస్థానీ మహిళా ఏజెంట్లు. చాలా కాలంగా ఆ ఏజెంట్లతో వాట్సాప్ చాట్, వీడియా, ఆడియో సందేశాలతో మాట్లాడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన మహిళగా పరిచయం చేసుకుంది గుర్నౌర్ కౌర్ అలియాస్ అంకిత. మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో పని చేస్తున్నట్లు తెలిపింది. మరో మహిళ నిషాగా పరిచయమైంది. ఆమె మిలిటరీ నర్సింగ్‌లో ఉన్నట్లు పేర్కొంది. కొద్ది రోజుల తర్వాత సైనిక సమాచారం, రహస్య పత్రాల కోసం రాణాను అడిగారు. వారిని నమ్మిన రాణా వాటిని అందించారు. జవాన్ కదలికలపై అనుమానంతో నిఘా వేసిన ఉన్నతాధికారులు.. పాకిస్థాన్ మహిళలతో మాట్లాడుతున్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: రూ.3వేల కోట్లు విద్యుత్తు బిల్లు.. షాక్‌తో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి! -
పాక్ మహిళ హనీట్రాప్.. భారత ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి ఏం చేశాడంటే..
దేశంలో ఇప్పటికి ఎన్నో హనీట్రాప్ కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో హనీట్రాప్ ఉదంతం కలకలం సృష్టించింది. దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళ.. భారత వైమానిక దళానికి చెందిన అధికారిని హనీట్రాప్ చేసింది. దీంతో సదరు అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. పాక్‌కు చెందిన మహిళ హనీ ట్రాప్‌లో చిక్కుకుని దేశ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని లీక్ చేసినట్లు భారత వైమానిక దళానికి చెందిన అధికారి దేవేంద్ర శర్మపై ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు, ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు.. సోషల్ మీడియాలో శర్మను పాక్ మహిళ ట్రాప్ చేసినట్టు గుర్తించారు. దేవేంద్ర శర్మను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, శర్మ ద్వారా దేశ భద్రతకు సంబంధించిన వివరాలు లీక్ అవుతున్నట్టు తెలుసుకున్నారు. మే 6న కస్టడీలోకి తీసుకోగా.. మే 12న (గురువారం) విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. ఈ విచారణలో భాగంగా శర్మ నుంచి ఆధారాలు, సాక్ష్యాలు సేకరించిన తర్వాతే అరెస్ట్ చేసినట్టు స్పష్టం చేశారు. ఇక, దేవేంద్ర శర్మ.. ఢిల్లీ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. ఈ లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో శర్మను సర్వీస్ నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: వైద్యుల నిర్వాకం.. బాలికకు తెలియకుండా మత్తుమందు ఇచ్చి.. -
మహిళల ముసుగులో పాక్ ఏజెంట్లు
న్యూఢిల్లీ: ఆన్లైన్లో అపరిచితులతో స్నేహం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సైన్యం హెచ్చరించింది. భారత జవాన్లే లక్ష్యంగా పాక్ గూఢచార సంస్థ పనిచేస్తోందని, ఆధ్యాత్మిక బోధకులు, విదేశీ మహిళలమంటూ స్నేహహస్తం అందించే వారి విషయంలో, ముఖ్యంగా సున్నితమైన సమాచారం పంచుకునే విషయంలో విచక్షణతో మెలగాలని సూచించింది. సున్నిత ప్రాంతాల్లో మెహరించిన సైనికులకు సంబంధించిన సమాచారం, ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లు తెలుసుకునేందుకు తప్పుడు ప్రొఫైల్స్‌తో పాక్ ఏజెంట్లు భారత జవాన్లకు ఎరవేస్తున్నారని తెలిపింది. రెండు, మూడేళ్ల క్రితం నాటి ఇటువంటి 150 ప్రొఫైల్స్‌ను ఇప్పటివరకు గుర్తించామని గత నెలలోనే దేశవ్యాప్తంగా ఉన్న కమాండింగ్ సెంటర్లు, డైరెక్టరేట్ల ద్వారా హెచ్చరించినట్లు సైన్యం తెలిపింది. సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్‌కు చెందిన మహిళా ఏజెంట్లకు సామాజిక మాధ్యమాల ద్వారా అందించారనే ఆరోపణలపై జోథ్‌పూర్‌లో ఒక జవానును తాజాగా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పట్టుబడిన జవాను విచిత్ర బెహ్రా ఒడిశాకు చెందిన వారు. విచారణలో బెహ్రా వెల్లడించిన వివరాల ప్రకారం.. సదరు మహిళ మారు పేరుతో ఉన్న పాక్ ఏజెంటే అని నిర్ధారణకు వచ్చారు. -
అనుష్కతో ఫోన్లోనే పరిచయం
పాకిస్థాన్ నుంచి ఆమె పంపిన డబ్బులనే పటన్ అకౌంట్లో వేశా పటన్ వివరాలిచ్చింది అనుష్కనే రెండోరోజు విచారణలో ఆసిఫ్అలీ హైదరాబాద్ : ‘పాకిస్థాన్ ఏజెంట్ అనుష్క అగర్వాల్‌తో నాకు నేరుగా పరిచయం లేదు.. కేవలం ఫోన్లోనే ఆమె నాతో మాట్లాడేది..’ అని ఆర్మీ రహ స్యాల బహిర్గతం కుట్ర కేసులో నిందితుడైన ఆసిఫ్అలీ నగర నేర పరిశోధక విభాగం అధికారుల విచారణలో వెల్లడించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దేశ ఆర్మీ రహస్యాలను పాకిస్థాన్ ఏజెంట్ అనుష్కకు వెల్లడించిన సికింద్రాబాద్ ఆర్మీ సుబేదార్ పటన్‌కుమార్ పొద్దార్ కేసులో మరో నిందితుడైన ఆసిఫ్‌అలీని చంచల్‌గూడ జైలులో సీసీఎస్ దర్యాప్తు అధికారుల బృందం ఏసీపీ జోగయ్య నేతృత్వంలో మంగళవారం రెండోరోజు విచారించింది. మూత్ర నాళాల వ్యాధితో బాధపడుతున్న అలీని సీసీఎస్ కస్టడీకి ఇవ్వడానికి నిరాకరించిన నాంపల్లి కోర్టు అతన్ని జైల్లోనే విచారించడానికి అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో సోమ, మంగళవారాల్లో దర్యాప్తు అధికారులు ఆయన్ను చంచల్‌గూడ జైల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గదిలో విచారించారు. కాగా, ఈ విచారణ కోసం వారు ప్రత్యేక ప్రశ్నాపత్రాన్ని రూపొందించుకున్నా రు. ఇంతకుముందు విచారించిన పటన్‌కుమార్ నుంచి రాబట్టిన కొన్ని అంశాల్ని క్రోడీకరించిన అధికారులు అలీని ప్రశ్నిస్తున్నారు. దీంతో కొన్నిసార్లు అతను మౌనంగా ఉంటూ, మరికొన్నిసార్లు కాదు.. అని సమాధానం ఇస్తున్నట్లు తెలిసింది. పటన్తో ఫోన్లో, మెయిల్లో చాటింగ్ చేసిన అనుష్క వివరాలను అలీ నుంచి రాబట్టేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నట్లు సమాచారం. పటన్ వివరాలు, మెయిల్ ఐడీ, బ్యాంక్ అకౌంట్ వివరాల్ని కూడా ఆమే ఇచ్చినట్లు విచారణలో అలీ వెల్లడించినట్లు సమాచారం. ఆమె సూచనల మేరకే తాను పటన్ అకౌంట్లో రూ.70 వేలు వేసినట్లు అలీ తెలిపాడు. అలా ఎందుకు చేశావని ప్రశ్నిస్తే.. చేసిన పనికి ప్రతిఫలంగా తనకూ డబ్బులు అందాయని చెప్పిన అలీ.. ఆ డబ్బులు ఎంత అనేది ఒక్కోసారి ఒక్కోరీతిగా చెప్పినట్లు సమాచారం. విచారణ మరో రెండురోజులు ఇదిలా ఉండగా ఆసిఫ్అలీ ఆనారోగ్యం కారణంగా అతన్ని విచారించడానికి తమకిచ్చిన గడువు సరిపోలేదని, మరో రెండురోజులు పొడిగించాలని సీసీఎస్ అధికారులు నాంపల్లి కోర్టును మంగళవారం కోరారు. దీనికి స్పందించిన న్యాయమూర్తి మరో రెండురోజులు (బుధ, గురువారం) విచారణ గడువును పొడిగించారు. దీంతో ఈ రెండురోజులు మరింత పకడ్బందీగా అలీని ప్రశ్నించడానికి సీసీఎస్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పాక్ ఏజెంట్‌గా పేర్కొంటున్న అనుష్క అగర్వాల్ ఎవరు.. ఆమె అసలు పేరేమిటి?, ఆమె వలలో ఆసిఫ్అలీ పడటానికి కారణమేమిటి.. ఇంకా ఇందులో ఎవరెవరికి సంబంధాలున్నాయి? కేవలం డబ్బుల కోసమే అలీ ఈ పనికి ఒప్పుకున్నాడా.. మరేమైనా కారణాలున్నాయా? అన్న కోణాల నుంచి సీసీఎస్ దర్యాప్తు ముందుకు సాగనుందని తెలిసింది. కాగా, పీటీ వారెంట్‌పై మీరట్ నుంచి తీసుకొచ్చిన అలీని 18వ తే దీ రాత్రి సీసీఎస్ అధికారులు మళ్లీ అక్కడికే తరలించనున్నారు. ఇదిలావుండగా, ఆర్మీ అధికారులు రెండురోజులపాటు పటన్‌ను విచారించేందుకు కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆర్మీ అధికారుల విజ్ఞప్తి మేరకు చంచల్‌గూడ జైల్లో ఎప్పుడైనా.. ఏరోజైనా అక్కడి సూపరింటెండెంట్ అనుమతిలో పటన్‌ను విచారించుకోవచ్చని నాంపల్లి కోర్టు తాజాగా ఆదేశించింది.