breaking news
padmavathi devi
-
మృగరాజుపై యోగలక్ష్మి
తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం రాత్రి సింహ వాహనంపై యోగలక్ష్మిగా అమ్మవారు భక్తులను కటాక్షించా రు. వజ్రవైఢూర్య స్వర్ణాభరణాలతో దివ్యా లంకృతులైన అమ్మవారు యోగ ముద్రలో ఉన్న లక్ష్మీ దేవిగా సింహవాహనంపై కొలువుదీరి తిరువీధుల్లో విహరించారు. ఉద యం ఉట్టి కొట్టేందుకు నిచ్చెన అధిరో హిస్తున్న కృష్ణుడిలా ముత్యపుపందిరి వా హనంపై అమ్మవారు భక్తులను దీవించా రు. జియర్స్వాముల ప్రబంధ పారాయ ణం, వేద పారాయణం, కళా బృందాల ప్రదర్శనలు, మేళతాళాల నడుమ ఊరేగింపు అంగరంగవైభవంగా జరిగింది. తిరుచానూరు : శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన శుక్రవారం ఉదయం ముత్యపు పందిరిపై అలిమేలుమంగమ్మ భక్తులను కటాక్షించారు. ఇందులో భాగంగా వేకువజాము రెండు గంటలకు సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. నాలుగు గంటలకు మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు అమ్మవారి ని వాహన మండపానికి వేంచేపు చేశారు. పట్టుపీతాంబర వజ్రవైఢూర్య స్వర్ణాభరణాలతో ఉట్టి కొట్టేందుకు నిచ్చెన అధిరోహిస్తున్న కృష్ణుడిలా అమ్మవారిని అలంకరించి ముత్యపుపందిరి వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలు, వేద, ప్రబంధ పారాయణం, భజన బృందాల ప్రదర్శనల నడుమ తిరువీధుల్లో ఊరేగింపు వైభవంగా జరిగింది. మధ్యాహ్నం వేడుకగా స్నపన తిరుమంజనం, సాయంత్రం 6గంటలకు ఆస్థానమండపంలో ఊంజల్‌సేవ నేత్రపర్వంగా జరిగింది. రాత్రి సింహవాహనంపై అమ్మవారు భక్తులను దీవించారు. పట్టుపీతాంబర వజ్రవైడూర్య ఆభరణాలతో అమ్మవారిని యోగ నారాయణుడిగా అలంకరించి సింహ వాహనంపై కొలువుదీర్చారు. రాత్రి 8–30గంటలకు అమ్మవారు సింహవాహనంపై తిరువీధుల్లో విహరించారు. టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు, జేఈఓ పోల భాస్కర్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సీవీఎస్ఓ ఆకె.రవికృష్ణ, అదనపు సీవీఎస్ఓ శివకుమార్‌రెడ్డి, ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈఓ పి.మునిరత్నంరెడ్డి, పేష్కార్ రాధాకృష్ణ, వీజీఓ అశోక్‌కుమార్ గౌడ్, సూపరింటెండెంట్లు రవి, మాధవకుమార్, ఏవీఎస్ఓ పార్థసార«థి తదితరులు పాల్గొన్నారు. నేటి వాహనసేవలు తిరుచానూరు : శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన శనివారం ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహనంపై అమ్మవారు తిరువీధుల్లో విహరి స్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు ఆస్థాన మండపంలో ఊంజల్ సేవ జరుగుతుంది. -
స్వర్ణరథంపై సర్వతేజోమయి
తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం పద్మావతీ అమ్మవారు స్వర్ణరథంపై ఊరేగారు. భక్తుల కోలాటాలు, భజనబృందాల కళా ప్రదర్శనల నడుమ స్వర్ణరథోత్సవం కన్నులపండువలా సాగింది. ఉదయం పద్మావతిదేవి సర్వభూపాల వాహనంపై, రాత్రి గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తిరుచానూరు : కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమవారం రాత్రి శ్రీవారి పట్టపురాణి పద్మావతి అమ్మవారు గరుత్మంతునిపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువనే మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 8గంటలకు అమ్మవారు సర్వభూపాల వాహనంపై ఉట్టి కృష్ణుడి అలంకరణలో తిరువీధుల్లో భక్తులను అనుగ్రహించారు. మధ్యాహ్నం 12గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో అమ్మవారికి నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం జరిగింది. సాయంత్రం 4.10గంటలకు స్వర్ణరథంపై సర్వతేజోమయి అయిన అమ్మవారు కొలువై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. రాత్రి 7గంటలకు ఆస్థానమండపంలో అమ్మవారికి ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది. అనంతరం అమ్మవారిని వేంచేపుగా వాహనమండపానికిు తీసుకొచ్చి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర వజ్రవైడూర్య మణిమాణిక్యాలు, శ్రీవారి పాదాలు, శ్రీవారి సహస్రలక్ష్మీ కాసుల హారంతో అమ్మవారిని దివ్యాలంకారశోభితంగా అలంకరించారు. రాత్రి 8.30గంటలకు భక్తుల కోలాటాలు, సంప్రదాయ భజన బృందాలు, జీయర్ స్వాముల దివ్యప్రభంద పారాయణం, వేదగోష్టి నడుమ శ్రీవారి పాదాలతో అమ్మవారు గరుత్మంతునిపై ఆశీనులై తిరువీధులలో విహరిస్తూ భక్తులను ఆశీర్వదించారు. పెద్ద సంఖ్యలో భక్తులు గరుడసేవలో అమ్మవారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు.