breaking news
Pachabottu
-
వైరల్ : అషూ పేరు పచ్చబొట్టు.. చెంప చెళ్లుమనిపించిన బ్యూటి
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూరెడ్డికి సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఎక్కువే. ఇక డబ్ స్మాష్‌తో ఫేమస్ అయిన ఆమె బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. నిత్యం ఫొటోషూట్లతో, ఫన్నీ వీడియోలతో ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే అషూ ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. బిగ్‌బాస్ సీజన్-3లో తనతో పాటు పాల్గొన్న రాహుల్ సిప్లిగంజ్‌తో అషూ లవ్ ట్రాక్ నడిపింస్తుందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఈ మధ్యే రాహుల్.. సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ అంటూ అషూను హత్తుకున్న ఫొటోను షేర్ చేసి దానికి లవ్ సింబల్ యాడ్ చేసి రూమర్స్‌కి మరింత బలం చేకూర్చాడు. అయితే తాజాగా కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరి-అషూ మధ్య ఏదో ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అషూ కోసం హరి కూడా బోలెడు ప్రయత్నాలు చేస్తున్నట్లు వరుస స్కిట్లతో అలరిస్తున్నారు. ఇప్పుడు మరోసారి అషూపై తన ప్రేమను వ్యక్తం చేశాడు. తన గుండెలపై అషూ పేరును పచ్చబొట్టు వేసుకున్నానని, ఇది శాశ్వతంగా ఉంటుందని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. 'నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానంటే..ఎప్పటికీ నువ్వు నా గుండెలపై నిలిచిపోయేంత' అంటూ హరి తన ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేశాడు. దీంతో ఇది నిజమైన పచ్చబొట్టా? లేదా స్కిట్ కోసం చేశావా అని అడగ్గా..నిజంగానే పచ్చబొట్టు వేయించుకున్నానని హరి చెప్పాడు. దీంతో ఎందుకిలా చేశావ్ అంటూ అషూ..హరి చెంప పగలకొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రాహుల్-అషూ మధ్యలోకి హరి ఎంటర్ అయ్యాడు అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. టీఆర్పీ రేటింగుల కోసమే ఈ డ్రామాలంటూ మరొకొందరు కామెంట్ చేస్తున్నారు. -
నమ్రతా శిరోద్కర్ చేతిపై పచ్చబొట్టు
హైదరాబాద్: పచ్చబొట్టుపై సినిమా తారలు మనసు పారేసుకుంటున్నారు. ఒంటిపై పచ్చబొట్టు పొడిపించుకుంటున్న తారల సంఖ్య రోజురోజకు పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలో ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి, మాజీ నటి నమ్రతా శిరోద్కర్ చేరారు. తన భర్త మహేష్ బాబు పేరును ముంజేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నారు. అంతేకాదు తన కుమారుడు గౌతమ్, కుమార్తె సితార పేర్లను ఆమె పచ్చబొట్టుగా వేయించుకున్నారు. 'ఆగడు' సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి భర్త మహేష్ బాబుతో నమ్రతా శిరోద్కర్ కలిసివచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోల్లో ఆమె చేతిపై పచ్చబొట్టు స్పష్టంగా కనబడింది.