నమ్రతా శిరోద్కర్ చేతిపై పచ్చబొట్టు | Mahesh Babu's tattoo on Namrata's hand | Sakshi
Sakshi News home page

నమ్రతా శిరోద్కర్ చేతిపై పచ్చబొట్టు

Aug 31 2014 2:04 PM | Updated on Sep 2 2017 12:41 PM

నమ్రతా శిరోద్కర్ చేతిపై పచ్చబొట్టు

నమ్రతా శిరోద్కర్ చేతిపై పచ్చబొట్టు

నమ్రతా శిరోద్కర్ తన భర్త మహేష్ బాబు పేరును ముంజేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నారు.

హైదరాబాద్: పచ్చబొట్టుపై సినిమా తారలు మనసు పారేసుకుంటున్నారు. ఒంటిపై పచ్చబొట్టు పొడిపించుకుంటున్న తారల సంఖ్య రోజురోజకు పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలో ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి, మాజీ నటి నమ్రతా శిరోద్కర్ చేరారు. తన భర్త మహేష్ బాబు పేరును ముంజేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నారు.

అంతేకాదు తన కుమారుడు గౌతమ్, కుమార్తె సితార పేర్లను ఆమె పచ్చబొట్టుగా వేయించుకున్నారు. 'ఆగడు' సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి భర్త మహేష్ బాబుతో నమ్రతా శిరోద్కర్ కలిసివచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోల్లో ఆమె చేతిపై పచ్చబొట్టు స్పష్టంగా కనబడింది.

Advertisement
 
Advertisement
Advertisement