breaking news
Own language
-
మన నినాదం స్వదేశీ, స్వభాష
జోద్పూర్/జైపూర్: ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు స్వదేశీ, స్వభాషకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దేశ ప్రజలు స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేసి, ఉపయోగించుకోవాలని, ఇంట్లో మాతృభాషలోనే మాట్లాడుకోవాలని సూచించారు. మనదేశంలోనే తయారైన ఉత్పత్తులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక సమాజాన్ని, సంస్కృతిని, మతాన్ని కాపాడుకోవాలంటే భాష అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఆధునిక ప్రపంచంలో మనుగడ సాగించడానికి, జీవితంలో ప్రగతి సాధించడానికి ఇతర భాషలు నేర్చుకోవడం, మాట్లాడడం అవసరమని తెలిపారు. ఇంట్లో మాత్రం పిల్లలతో మాతృభాషలో సంభాషించాలని చెప్పారు. దానివల్ల వారికి తమ మూలాలతో అనుబంధం మరింత బలపడుతుందన్నారు. స్వదేశీ, స్వభాష మనందరి నినాదం కావాలని స్పష్టంచేశారు. రాజస్తాన్‌లోని జోద్‌పూర్‌లో శనివారం మహేశ్వరి అంతర్జాతీయ సదస్సులో అమిత్ షా ప్రసంగించారు. దేశ విదేశాల్లో స్థిరపడిన మహేశ్వరి వర్గం ప్రజలు హాజరయ్యారు. పిల్లలతో మాతృభాషలో మాట్లాడితే వారు స్వస్థలంతో, సొంత చరిత్రతో అనుసంధానమవుతారని అమిత్ షా వివరించారు. సమాజాన్ని, మతాన్ని సజీవంగా ఉంచేది, సంస్కృతిని ముందుకు నడిపించేది భాషేనని స్పష్టంచేశారు. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’ మన ధ్యేయమని పునరుద్ఘాటించారు. ఆ దిశగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మనకు అవసరమైన ఉత్పత్తులను మన దేశంలోనే తయారు చేసుకోవాలన్నారు. ఇప్పటిదాకా మనదేశంలో ఉత్పత్తి కానివాటిని తయారు చేయడానికి ముందుకు రావాలని కంపెనీలకు సూచించారు. దేశ అభివృద్ధిలో మహేశ్వరి వర్గం ప్రజల కృషిని అమిత్ షా ప్రశంసించారు. ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. రాజస్తాన్‌లో పేపర్ లీక్‌లు బంద్ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ నేతృత్వంలో రాజస్తాన్ అభివృద్ధి పథంలో వేగంగా దూసుకెళ్తోందని అమిత్ షా పేర్కొన్నారు. శనివారం జైపూర్‌లోని రాజస్తాన్ పోలీసు అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శాంతి భద్రతలు సక్రమంగా ఉంటేనే ఏ రాష్ట్రమైనా ప్రగతి సాధిస్తుందని అన్నారు. భజన్‌లాల్ శర్మ ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందని చెప్పారు. క్రైమ్ రేటు చాలావరకు తగ్గిపోయిందని, పేపర్ లీక్‌లు ఆగిపోయానని తెలిపారు. లంచాలు, సిఫార్సుల బెడద లేకుండా యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయని చెప్పారు. -
ఫేస్బుక్ చాట్‌బోట్..కిలికిలి భాష!
- సొంత భాష అభివృద్ధి చేసుకున్న చాట్బోట్లు - ఉలిక్కిపడ్డ శాస్త్రవేత్తలు.. వెంటనే వ్యవస్థల నిలిపివేత - ఎప్పటికైనా చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్న నిపుణులు.. అనుకున్నంత పనీ అయింది.. తృటిలో ప్రమాదం తప్పిపోయింది.. లేదంటేనా మనమంతా రోబోల చెప్పు చేతల్లో మెలగాల్సిన పరిస్థితి వచ్చేసేదే! మానవజాతికి ఇంత పెద్ద విపత్తు వచ్చిపడితే.. ఎక్కడా హడావుడే లేదే..! ఏమా విపత్తు.. ఎలా వచ్చింది.. ఎలా తప్పిపోయింది.. మీరెప్పుడైనా వెబ్‌సైట్‌లోని చాట్‌బోట్‌తో మాట్లాడారా? నిన్న మొన్నటివరకూ ఇలాంటి చాట్బోట్లతో చెడ్డ చిక్కుండేది.. మనం ఒకటి అడిగితే.. అది తనకు తోచిన రీతిలో.. లేదంటే సాఫ్ట్‌వేర్‌లో ఏది ఉంటే అదే చెప్పేది. కానీ కృత్రిమ మేధస్సు పుణ్యమా అని ఈ మధ్య అవీ తెలివి మీరాయి. అచ్చం మనుషుల్లాగే సందర్భానికి తగ్గట్లు మాట్లాడు తున్నాయి. దాదాపు ఇలాంటి చాట్‌బోట్ ప్రోగ్రామే ఫేస్బుక్ లోనూ ఉంది. ఫేస్బుక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రీసెర్చ్ పేరుతో నడుస్తున్న ప్రాజెక్టులో గత నెల ఓ విచిత్రమైన ‘ప్రమాదం’ చోటు చేసుకుంది. కొన్ని చాట్బోట్లు తమ కోసం ఓ భాషను సృష్టించుకున్నాయి. పదాలు ఇంగ్లిషులోనే ఉన్నప్పటికీ.. ఆ వాక్యాలు చూస్తే మనకు ఏమీ అర్థం కాదు. కానీ మిగిలిన చాట్బోట్లు మాత్రం అదే భాషలో స్పందిస్తున్నాయి. తామిచ్చిన కోడ్లను ధిక్కరించాయని శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్నారు. ఈ పరిణామంతో ఉలిక్కిపడ్డ శాస్త్రవేత్తలు వెంటనే ఆ చాట్‌బోట్ తాలూకు సర్వర్‌ను ఆఫ్ చేశారు. అంత సీరియస్ వ్యవహారమా.. చాలా సీరియస్. ఎందుకంటే ఆ చాట్బోట్లు ఏం మాట్లాడుతున్నాయో మనకు తెలియదు. తెలిసో తెలియకో మనుషులకు హాని కలిగించే చర్యలకు పాల్పడితే..? ఇంటర్నెట్కు అనుసంధానమైన వ్యవస్థలను తనకిష్టమొచ్చినట్లు నడిపించడం మొదలుపెడితే...? తలుచుకుంటునే ఒళ్లు గగుర్పొడిచే భవిష్యత్ అది. కాకపోతే ఫేస్బుక్ నిపుణులు సర్వర్‌ను సకాలంలో ఆపేశారు కాబట్టి ప్రస్తుతానికి సమస్య లేనట్లే. చాట్‌బోట్‌కు అంత అవసరమేమొచ్చింది చాట్బోట్లు సొంత భాష సృష్టించుకోవడం వెను క మన అజాగ్రత్త కూడా కొంత ఉంది. ఈ చాట్బో ట్లను సంప్రదింపులు (లావాదేవీలు జరపడం.. మీతో ఏదైనా వస్తువు/సేవ కొనేలా చేయడం) జరిపేందుకు ఉద్దేశించారు. వెబ్సైట్ల ద్వారా ఇతరు లతో మాట్లాడిన ప్రతిసారి ఇవి కొన్ని కొత్త విష యాలను నేర్చుకుని తర్వాతి సంప్రదింపుల్లో వాటిని ఉపయోగిస్తుంటాయి. తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగు పరచుకోవడం ఈ చాట్ బోట్ల ముఖ్య లక్ష్యం. ఈ వ్యవస్థను అభివృద్ధి చేసే క్రమంలో శాస్త్రవేత్తలు అన్ని విషయాలను పరిగణ నలోకి తీసుకున్నారు కానీ ఒక్క భాష విషయాన్ని మాత్రం మర్చిపోయారు. మొదట్లో ఈ చాట్బోట్లు మనకు అర్థమయ్యే ఇంగ్లిష్‌లోనే సంప్రదింపులు జరిపేవి. అయితే ఈ చర్యకు బహుమతుల్లాంటి వేవీ లేకపోవడంతో చాట్బోట్లు ఈ భాషకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్న అంచనాకు వచ్చాయి. మంచి చాట్బోట్గా మారాలన్న లక్ష్యా న్ని చేరుకునేందుకు ఇంగ్లిష్ భాష ద్వారా వచ్చే లాభమేమీ లేదనుకున్నాయో ఏమో కానీ కొంత కాలం తర్వాత తమదైన భాషలో మాట్లాడటం మొదలుపెట్టాయి. ‘మనుషులతో చక్కగా మాట్లా డగలిగే బోట్లను సృష్టించాలనుకున్నాం గానీ.. ఇవి తమదైన భాషను అభివృద్ధి చేసుకోవడంతో సమస్య మొదలైంది. వాటి భాషను మన భాషలోకి అనువదించగలిగాం కానీ అది ఎంత వరకు సరైనదో మాకే తెలియదు. ఎందుకంటే చాట్బోట్ల భాష తెలిసిన వారెవరూ లేరు కదా’ అని ప్రాజెక్టులో పనిచేస్తున్న మైక్ లూయిస్ పేర్కొన్నారు. భవిష్యత్తు ఏంటి? ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, మెషీన్ లెర్నింగ్ వంటి పేర్లు తరచూ వినిపిస్తున్న ఈ తరుణంలో ఫేస్బుక్ చాట్బోట్ల వ్యవహా రం కాస్త ఇబ్బంది పెట్టేదే. కృత్రిమ మేధస్సు గురించి మనకు తెలిసింది తక్కువే నని ఈ రంగంపై మరింత లోతైన చర్చ జరగా ల్సిన అవసరముందనే విషయాన్ని ఈ ఘటన నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. శాస్త్ర ప్రపం చం కూడా కృత్రిమ మేధస్సుపై రెండుగా చీలిపోయింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ వంటి వారు ఈ టెక్నాలజీతో ఎప్పటికైనా చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్నారు. అయితే ఫేస్బుక్ వ్యవస్థాపకు డు మార్క్ జుకర్‌బర్గ్‌తో పాటు మరికొందరు కృత్రి మ మేధస్సుకు మద్దతుగా నిలుస్తున్నారు. ‘కృత్రిమ మేధస్సుపై జుకర్‌బర్గ్‌తో మాట్లాడా. దీనిపై అతడికి ఉన్నది చాలా పరిమితమైన జ్ఞానమని నాకు అర్థమైంది’ అని ఎలన్ మస్క్ విమర్శించిన కొద్ది రోజులకే ఇలా జరగడం గమనార్హం. – సాక్షి నాలెడ్జ్ సెంటర్


