breaking news
OTHER DEMANDS
-
అంగన్ ‘వేడి’.. ఆకలి కేకలు
ఏలూరు (మెట్రో): అఆ బడుల్లో (అంగన్ వాడీ కేంద్రాలు) చిన్నారుల ఆలనాపాలన చూడాలి. గర్భిణులు, చిన్నారులకు పోషకాహారం అందించాలి. మరోపక్క ప్రభుత్వం అప్పగించే సర్వే పనులు, పల్స్‌పోలియో పనులు నిర్వహిస్తూ సేవలందిస్తున్న అంగన్వాడీ కేంద్రాల సిబ్బందికి అర్ధ సంవత్సరంగా జీతాలు లేవు. ఇచ్చే అరకొర జీతం సరైన సమయంలో చేతి కందక అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్న మహిళలు కొందరైతే, అప్పులు చేయలేక పస్తులుంటున్న వారు మరికొందరు. ప్రభుత్వం వీరికి జీతాలు చెల్లించకపోవడంతో జిల్లావ్యాప్తంగా అంగన్వాడీల ఆకలికేకలు మిన్నం టుతున్నాయి. డిసెంబర్ నెల నుంచి వీరికి జీతాలు అందలేదు. అంతా పేద, మధ్య తరగతి వారే.. అంగన్వాడీల్లో పేద, మధ్యతరగతి మహిళలు ఎక్కువుగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 18 ప్రాజెక్టుల పరిధిలో 3,900 కేంద్రాలు ఉండగా 3,900 మంది అంగన్వాడీ వర్కర్లు, 3,900 మంది హెల్పర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్‌కు రూ.7,500, ఆ యాలకు రు.4,500 చెల్లిస్తోంది. అయితే ఈ చెల్లింపులు గత ఏడాది డిసెంబర్ నుంచి నిలిచిపోయాయి. కొందరికి గతేడాది అక్టోబర్ నుంచి జీతాల చెల్లింపులు నిలిపివేశారు. దీంతో వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు సర్కారు మోసం ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా చంద్రబాబు అంగన్వాడీ వర్కర్లకు ఎడాపెడా హామీలిచ్చారు. తాము అధికారంలోకి వస్తే అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తామని, జీతాలు, పదోన్నతుల విషయంలో న్యాయం చేస్తామన్నారు. గద్దెనెక్కిన తర్వాత వీరిని య ధావిధిగా పట్టించుకోవడం మానేశారు. కలెక్టరేట్ వద్ద ధ్వజం జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో జీతాల కోసం కలెక్టరేట్ వద్ద సోమవారం మహిళలు ధర్నా చేశారు. తక్షణమే జీతాలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. పెడింగ్ వేతనాలతోపాటు కేంద్రాల అద్దెలు, టీఏ బకాయిలు, గ్యాస్ బిల్లు, రవాణా చార్జీలు, యూనిఫాం, పెన్షన్‌తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని గళమెత్తారు. తెలంగాణలో మాదిరిగా వేతనాలు పెంచాలని నినదించారు. ధర్నాకు పీఎల్ఎస్ కుమారి, బీజేఎన్ కుమారి, ఎస్కే ఇజియా, జి.విజయకుమారి, బి.సత్యవతి, ఎండీ హసీనా నాయకత్వం వహించారు. పట్టించుకోకుంటే పస్తులే.. కొందరికి ఆరునెలలుగా, మరికొందరికి నాలుగు నెలలుగా జీతాలు చెల్లించాల్సి ఉంది. తక్షణమే బకాయి జీతాలు చెల్లించి అంగన్వాడీ కుటుంబాలను ఆదుకోవాలి. లేకుంటే కుటుంబాలన్నీ పస్తులుండాలి్సందే. – కె.విజయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు అప్పులతో జీవనం అప్పులతోనే జీవనం సాగిస్తున్నాం. అప్పులు దొరకని వాళ్లు పస్తులుంటున్నారు. ఆరునెలలుగా జీతాలు రాకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఎండల్లో మాత్రం విధులు నిర్వహించాల్సి వస్తోంది. –కె.ఝాన్సీలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు -
ఆశావర్కర్ల ఆందోళన
ఏలూరు అర్బ¯ŒS : అపరిష్కృతంగా ఉన్న సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు శుక్రవారం స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. జిల్లావ్యాప్తంగా డీఎంహెచ్‌వో ఆధీనంలో ఉన్న 79 పీహెచ్‌సీల్లో 2,500 మంది ఆశావర్కర్లుగా విధులు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాల జయప్రదానికి 11 ఏళ్లుగా తాము కృషి చేస్తున్నామని కార్యకర్తలు గుర్తుచేశారు. ఇంత చేస్తున్నా.. తమకు నెలనెలా జీతాలు కూడా సరిగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తల సంఘ నాయకులు డి.మాత, సుకుమారి, విజయకుమారి, చిట్టెమ్మ పాల్గొన్నారు.