breaking news
Orly Airport
-
టికెట్ లేని విమాన ప్రయాణం
- ల్యాండింగ్ గేర్ లో దాక్కుని బ్రెజిల్ నుంచి పారిస్ కు - ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన రహస్యప్రయాణికుడు బస్సులు, రైళ్లలోనైతే టికెట్ లేని ప్రయాణం నేరం. కండక్టర్ కు దొరికితే అక్కడికక్కడో, లేదంటే తర్వాతి స్టేషన్ లోనో దించేస్తాడు. అదే విమానంలోనైతే..? దిగే సంగతి దేవుడెరుడు.. ప్రాణాలు పోవడం మాత్రం ఖాయం. అలా ఎయిర్ ఫ్రాన్స్ కు చెందిన బోయింగ్ 777 విమానం ల్యాండిగ్ గేర్ లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన యువకుడి మృతదేహాన్ని మెయింటెనెన్స్ సిబ్బంది వెలికితీశారు. మంగళవారం పారిస్ లోని ఓర్లే అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో చనిపోయిన యువకుడు బ్రెజిల్ నుంచి పారిస్ కు(9,400 కిలోమీటర్లు) రహస్యంగా ప్రయాణించాలనుకున్నాడు. 'బోయింగ్ 777 జెట్ చాలా ఎత్తులో ప్రయాణిస్తుంది. అక్కడ ఆక్సిజన్ ఉండదు. ల్యాండిగ్ గేర్ లో దాక్కున యువకుడు బహుశా ఊపిరాడక చనిపోయి ఉంటాడు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాం. త్వరలోనే అతడు ఎవరు? ఎలా చనిపోయాడనే పూర్తివివరాలు తెలుస్తాయి' అని ఎయిర్ పోర్ట్ అధికారులు వివరించారు. 'విమాన సర్వీసులు ఎక్కువగా ఉండే దేశాల్లో స్టోవవే (రహస్యప్రయాణికుడు)ల సంఖ్య తక్కువేమీ కాదని, అలా ప్రయాణించిన వారిలో ఇప్పటివరకు ఒక్కరు కూడా ప్రాణాలు నిలుపుకోలేకపోయారని, ఎయిర్ పోర్ట్ చుట్టూ సరైన రక్షణవలయం లేకపోవటంతో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని విమానయాన నిపుణులు చెబుతున్నారు. విమానం టైర్లలో దాక్కుని ప్రయాణించి ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది.. ల్యాండింగ్ గేర్ తెరుచుకునే సమయంలో ఎయిర్ పోర్టు పరిసరాల్లోని బిల్డింగులపై పడిపోయిన సంఘటనలు పరిపాటేనని అధికారులు చెబుతున్నారు. గతేడాది జూన్ లో జొహాన్నెస్ బర్గ్ నుంచి లండన్ కు (5 వేల అడుగుల ఎత్తులో, మైనస్ 50 డిగ్రీల ఉష్టోగ్రతలో 11 గంటల ప్రయాణం) విజయవంతంగా ప్రయాణించిన యువకుడు.. ల్యాండింగ్ గేర్ తెరుచుకోవటంతో హిత్రూ ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ బిల్డింగ్ పై పడి చనిపోయాడు. -
ఎయిర్పోర్ట్ వద్ద సైనికుడిపై ఆగంతకుడి దాడి
పారిస్: ఎయిర్పోర్ట్ వద్ద గస్తీ నిర్వహిస్తున్న సైనికుడిపై ఆగంతకుడు కత్తితో దాడి చేశాడు. అనంతరం అతడు పరారైయ్యాడు. ఈ ఘటన పారిస్‌లోని ఒర్లీ ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మరియు అంతర్గత మంత్రులు సంయుక్తంగా విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. దాడి చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు. అలాగే ఈ దాడిపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. అయితే దేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌ల వద్ద గస్తీని తీవ్రతరం చేసినట్లు మంత్రులు వివరించారు.