breaking news
one day international
-
ఆల్ ఫార్మాట్ రౌండర్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మెరుపులు మెరిపించి జాతీయ సెలక్టర్ల దృష్టిలో పడ్డ నితీశ్ కుమార్ రెడ్డి... ఏడాది తిరిగేలోపు జాతీయ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. గతేడాది అక్టోబర్‌లో టీమిండియా తరఫున తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన నితీశ్ రెడ్డి... ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టాడు. ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు ద్వారా సుదీర్ఘ ఫార్మాట్ బరిలోకి దిగిన ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్... ఆ సిరీస్‌లో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఆడాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చి ధాటిగా షాట్లు ఆడగల సత్తా... ఉపయుక్తమైన మీడియం పేస్ బౌలింగ్ అతడికి వరుసగా అవకాశాలు కల్పించింది. హార్దిక్ పాండ్యా టెస్టు ఫార్మాట్‌కు దూరం కావడంతో... సుదీర్ఘ ఫార్మాట్లో భారత జట్టు చాలా కాలంగా పేస్ ఆల్‌రౌండర్ కోసం నిరీక్షిస్తోంది. అందివచ్చిన అవకాశాలను వినియోగించుకున్న నితీశ్ ఇప్పుడు తాజాగా వన్డే ఫార్మాట్లో సైతం అవకాశం దక్కించుకున్నాడు. పాండ్యా గైర్హాజరీలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. పెర్త్ వేదికగా ఆదివారం జరిగిన పోరులో ఆఖర్లో బ్యాటింగ్‌కు వచి్చన ఈ ఆల్‌రౌండర్ 11 బంతులెదుర్కొని 2 సిక్సర్లతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా సాగకపోవడంతో అతడికి క్రీజులో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కలేదు. బౌలింగ్‌లో మాత్రం 2.1 ఓవర్లు వేసిన నితీశ్ 16 పరుగులిచ్చాడు. వికెట్ తీయలేకపోయాడు. టెస్టు అరంగేట్రం చేసిన చోటే... ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా పెర్త్ టెస్టు ద్వారానే తొలి టెస్టు ఆడిన 23 ఏళ్ల నితీశ్ రెడ్డి... మళ్లీ ఇప్పుడు అక్కడే వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో టాపార్డర్ మొత్తం విఫలమైన చోట... ధనాధన్ బ్యాటింగ్‌తో 41 పరుగులు చేసిన నితీశ్... రెండో ఇన్నింగ్స్‌లో అయితే ఏకంగా టి20 మ్యాచ్ ఆడాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 38 పరుగులు చేసి భారత జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మిచెల్ స్టార్క్, జోష్ హాజల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ అతడు చూపిన తెగువ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దీంతో టీమ్ మేనేజ్మెంట్ సైతం నితీశ్‌కు విరివిగా అవకాశాలు ఇచి్చంది. వాటిని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక మెల్బోర్న్ మైదానంలో జరిగిన పోరులో నితీశ్ వీరవిహారం చేశాడు. ఎనిమిదో స్థానంలో క్రీజులోకి వచి్చన అతను ఆసీస్ బౌలింగ్‌ను ఓ ఆటాడుకొని సెంచరీతో అదరగొట్టాడు. దీంతో ఒక్కసారిగా అతడి పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత మరో నాలుగు టెస్టులు మాత్రమే ఆడిన అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో పాటు... గాయాల బారిన పడి కాస్త వెనుకబడ్డాడు. అయితే క్లిష్టమైన విదేశీ పర్యటనల్లో సత్తాచాటిన నితీశ్‌పై సెలెక్టర్లు నమ్మకముంచారు. గాయం నుంచి కోలుకొని... ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మాంచెస్టర్‌లో ప్రాక్టీస్ చేస్తూ గాయపడిన నితీశ్ జట్టుకు దూరమయ్యాడు. గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇంగ్లండ్ నుంచి తిరిగొచ్చాక అతడు పూర్తిగా మారిపోయాడు. సమయపాలన, క్రమశిక్షణ మొదటి నుంచే ఉన్న నితీశ్ రెడ్డి... వాటిని మరింత కఠినతరం చేశాడు. సరదాలు, షికార్లు పక్కనపెట్టి పూర్తిగా క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. అదే సమయంలో తండ్రికి మోకాలి శస్త్రచికిత్స జరిగినా ఇంటికి వెళ్లకుండా పూర్తిగా సాధనకే పరిమితమయ్యాడు. విశాఖపట్నంలో ఉన్నన్ని రోజులు... జిమ్ లేదంటే మైదానంలోనే గడిపేవాడని అతడి తండ్రి ముత్యాల రెడ్డి పేర్కొన్నారు. అలా గంటల తరబడి శిక్షణ సాగిస్తూ మరింత రాటుదేలాడు. మోకాలి శస్త్రచికిత్స అనంతరం అతడి ఫిట్నెస్ మునుపటికంటే రెట్టింపు అయింది. అది ఇటీవల వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో ప్రస్ఫుటమైంది. సూపర్ క్యాచ్ వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో నితీశ్ ఫర్వాలేదనిపించాడు. స్పిన్‌కు సహకరించే భారత పిచ్‌లపై పేస్ ఆల్‌రౌండర్‌గా ఎక్కువ ఓవర్లు వేసే అవకాశం దక్కని ఆంధ్ర ప్లేయర్... బ్యాటింగ్‌లో రాణించాడు. వెస్టిండీస్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో నితీశ్ పట్టిన క్యాచ్ చూస్తే... అతడి ఫిట్నెస్ స్థాయి ఏంటో అర్థమవుతుంది. స్క్యేర్ లెగ్‌లో విండీస్ బ్యాటర్ ఇచ్చిన క్యాచ్‌ను చిరుతలా దూకుతూ అందుకున్న తీరు చూసి తీరాల్సిందే. ప్రస్తుతం జట్టులో ఉన్న ఫిటెస్ట్ ప్లేయర్లలో అతడు ఒకడు అనడంలో సందేహం లేదు. యో–యో టెస్టు, బ్రంకో టెస్టుల్లో టీమిండియాలో అందరికంటే మెరుగైన స్కోరు నితీశ్ రెడ్డిదే అని సమాచారం. విండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఎక్కువ బౌలింగ్ చేసే అవకాశం రాకున్నా... హెడ్ కోచ్ గంభీర్ మాత్రం నితీశ్‌పై నమ్మకముందని అతడికి అండగా ఉంటామని స్పష్టంచేశాడు. ‘నితీశ్ ఎన్ని ఓవర్లు వేశాడనేది ముఖ్యం కాదు. జట్టుతో ఉండటమే ప్రధానం. అది ఎంతో నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. 23 ఏళ్ల కుర్రాడిని కేవలం విదేశీ పిచ్‌లపైనే పరీక్షించాలనే ఆలోచన మాకు లేదు. అవకాశం ఉన్నప్పుడల్లా స్వదేశంలో సైతం అతడికి చాన్స్‌లు ఇస్తాం. ప్రస్తుతం పేస్ ఆల్‌రౌండర్లు చాలా తక్కువ మంది అందుబాటులో ఉన్నారు. అందుకే నితీశ్‌కు అండగా ఉంటాం’ అని గంభీర్ అన్నాడు. వన్డే, టి20 ఫార్మాట్లలో హార్దిక్ పాండ్యా వంటి నిఖార్సైన పేస్ ఆల్‌రౌండర్ అందుబాటులో ఉండగా... టెస్టుల్లో ఆ స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు... పరిమిత ఓవర్లలోనూ తనదైన ముద్ర వేయాలని నితీశ్ భావిస్తున్నాడు. -
ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
ఐసీసీ మెన్స్ టీమ్ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలోకి దూసుకువచ్చింది. టీమిండియాను వెనక్కి నెట్టి నంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకుంది.ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 టైటిల్ గెలిచిన కంగారూ జట్టు 124 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా.. రన్నరప్ టీమిండియా 120 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.ఇక ఈ రెండు జట్లతో పాటు ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ టాప్-5లో చోటు దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో టీమిండియా అగ్రస్థానం కోల్పోయినా వన్డే, టీ20లలో మాత్రం టాప్ ర్యాంకు పదిలంగా ఉంది.పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ సేన ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.మెన్స్ టీమ్ టెస్టు ర్యాంకింగ్స్ టాప్-51. ఆస్ట్రేలియా- 124 రేటింగ్ పాయింట్లు2. ఇండియా- 120 రేటింగ్ పాయింట్లు3. ఇంగ్లండ్- 105 రేటింగ్ పాయింట్లు4. సౌతాఫ్రికా- 103 రేటింగ్ పాయింట్లు5. న్యూజిలాండ్- 96 రేటింగ్ పాయింట్లు.మెన్స్ టీమ్ వన్డే ర్యాంకింగ్స్ టాప్-51. ఇండియా -122 రేటింగ్ పాయింట్లు2. ఆస్ట్రేలియా- 116 రేటింగ్ పాయింట్లు3. సౌతాఫ్రికా- 112 రేటింగ్ పాయింట్లు4. పాకిస్తాన్- 106 రేటింగ్ పాయింట్లు5. న్యూజిలాండ్- 101 రేటింగ్ పాయింట్లుమెన్స్ టీమ్ టీ20 ర్యాంకింగ్స్ టాప్-51. ఇండియా- 264 రేటింగ్ పాయింట్లు2. ఆస్ట్రేలియా- 257 రేటింగ్ పాయింట్లు3. ఇంగ్లండ్- 252 రేటింగ్ పాయింట్లు4. సౌతాఫ్రికా- 250 రేటింగ్ పాయింట్లు5. న్యూజిలాండ్- 250 రేటింగ్ పాయింట్లుచదవండి: -
రెండునాళ్ల ముచ్చట.. నంబర్ వన్ నుంచి మూడో స్థానానికి పడిపోయిన పాక్
ODI Rankings: ఐసీసీ తాజాగా (మే 8) విడుదల చేసిన వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ నంబర్ వన్ స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. 48 గంటల కిందటే టాప్ ర్యాంక్‌కు చేరిన పాక్‌కు ఆ హోదా రెండునాళ్ల ముచ్చటగానే మిగిలింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో ఓటమిపాలైన పాక్.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశంతో పాటు టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకునే గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకుంది. పాక్ ఓటమితో ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్‌కు, టీమిండియా రెండో స్థానానికి ఎగబాకాయి. టీమిండియా, ఆస్ట్రేలియాకు సమానమైన రేటింగ్ పాయింట్లు (113) ఉండగా.. పాక్‌కు ఒక పాయింట్ (112) తక్కువగా ఉంది. ఈ జాబితాలో ఇంగ్లండ్ (111) నాలుగులో, న్యూజిలాండ్ (108), సౌతాఫ్రికా (101), బంగ్లాదేశ్ (95), శ్రీలంక (86), వెస్టిండీస్ (72), ఆఫ్ఘనిస్తాన్ (71) వరుసగా ఐదు నుంచి పది స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో పాక్ 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. విల్ యంగ్ (87), కెప్టెన్ టామ్ లాథమ్ (59) అర్ధశతకాలతో రాణించడంతో 49.3 ఓవర్లలో 299 పరుగులు చేసి ఆలౌటైంది. చాప్మన్ (43), హెన్రీ నికోల్స్ (23), మెక్‌కోంచి (26), రచిన్ రవీంద్ర (28) పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3, ఉసామా మిర్, షాదాబ్ ఖాన్ తలో 2 వికెట్లు, హరీస్ రౌఫ్, మహ్మద్ వసీం చెరో వికెట్ దక్కించుకున్నారు. ఛేదనలో ఇఫ్తికార్ అహ్మద్ (94 నాటౌట్) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చినప్పటికీ పాక్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయాడు. పాక్ 46.1 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. ఇఫ్తికార్‌కు అఘా సల్మాన్ (57) నుంచి కాసేపు తోడ్పాటు లభించింది. ఫకర్ జమాన్ (33) పర్వాలేదనిపించగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లే, రచిన్ రవీంద్ర తలో 3 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాశించగా.. ఆడమ్ మిల్నే, మ్యాట్ హెన్రీ, ఐష్ సోధి తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో న్యూజిలాండ్ పాక్ ఆధిక్యాన్ని 1-4కు తగ్గించింది. చదవండి: సాహో సాహా.. టెస్ట్ జట్టులో చోటు కన్ఫర్మ్.. రహానే లాగే..! -
సచిన్ రికార్డుకు సరిగ్గా 14 ఏళ్లు.. నేటికీ చెక్కుచెదరలేదు
ముంబై: సరిగ్గా 14 సంవత్సరాల క్రితం ఇదే రోజున(జూన్ 29) క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఫార్మాట్లో 15 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో సచిన్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 227 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. సచిన్ (106 బంతుల్లో 93; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ అర్ధశతకం సాయంతో దక్షిణాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలోనే సచిన్.. వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయిని దాటాడు. నాడు నెలకొల్పిన ఈ రికార్డు నేటికీ చెక్కుచెదరకపోవడం విశేషం. కాగా, 15 నవంబరు 1989లో టెస్ట్ క్రికెట్లో కాలు మోపిన సచిన్.. అదే ఏడాది డిసెంబరు 18న తొలి వన్డే ఆడాడు. 200 టెస్టుల్లో 68 అర్ధశతకాలు, 51 శతకాల సాయంతో 15,921 పరుగులు సాధించిన సచిన్.. 463 వన్డేల్లో 96 హాఫ్ సెంచరీలు, 49 సెంచరీల సాయంతో 18,426 పరుగులు చేశాడు. వన్డే ఫార్మాట్లో తొలి ద్విశతకంతో పాటు పలు రికార్డులను తన ఖాతాలో వేసుకన్న ఈ క్రికెట్ దేవుడు.. 23 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు వన్డే క్రికెట్లో కొనసాగాడు. ఈ క్రమంలో ఆయన ఆరు వన్డే ప్రపంచకప్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2011లో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సచిన్ సభ్యుడు. చదవండి: 'చెత్త' పనికి పరిహారం కట్టిన టీమిండియా మాజీ క్రికెటర్ -
సచిన్ రికార్డుపై కన్నేసిన మిథాలీ రాజ్
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత సుదీర్ఘ కాలం వన్డే క్రికెట్ ఆడిన రెండో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. 1999, జూన్ 26న అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఆమె.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే ద్వారా వన్డే క్రికెట్లో 22 వసంతాలు పూర్తి చేసుకొంది. ఈ క్రమంలో ఆమె సచిన్ రికార్డుపై కన్నేసింది. సచిన్.. 22 ఏళ్ల 91 రోజుల పాటు వన్డే క్రికట్లో కొనసాగగా, మిథాలీ మరో 90 రోజుల్లో ఆ రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. కాగా, కొంతకాలం క్రితమే పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన మిథాలీ.. టెస్ట్‌లు, వన్డే క్రికెట్లో కొనసాగుతుంది. వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచి క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని భావిస్తున్న ఆమె.. టీమిండియాను ఇప్పటి వరకు రెండు సార్లు వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్‌కు చేర్చింది. కాగా, 38 ఏళ్ల మిథాలీ.. వన్డేల్లో పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది. అత్యధిక మ్యాచ్‌లు(215), అత్యధిక పరుగులు(7170), అత్యధిక అర్ధసెంచరీలు(56) ఇలా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఓవరాల్‌గా 11 టెస్ట్‌లు, 215 వన్డేలు, 89 టీ20లు ఆడిన మిథాలీ.. 8 శతకాలు 77 అర్ధశతకాల సాయంతో 10000కుపైగా పరుగులను సాధించింది. చదవండి: యూరో కప్ నుంచి పోర్చుగల్ ఔట్.. రొనాల్డో భావోద్వేగం -
పాక్ వన్డే, టి20 జట్ల కెప్టెన్‌గా ఆజమ్
లాహోర్: స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్‌ను పాకిస్తాన్ వన్డే, టి20 జట్లకు కొత్త కెప్టెన్‌గా నియమించారు. సర్ఫరాజ్ అహ్మద్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి వీటిని బాబర్ ఆజమ్‌కు కట్టబెట్టారు. టెస్టులకు మాత్రం కెప్టెన్‌గా అజహర్ అలీనే కొనసాగుతాడని చీఫ్ సెల క్టర్ మిస్బా ఉల్ హక్ తెలిపాడు. అలాగే 2020–21 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. 18 మంది ప్లేయర్ల కాంట్రాక్టులో కొత్తగా ఇద్దరికి చోటు దక్కింది. నసీమ్ షా, ఇఫ్తికార్ అహ్మద్‌లు రాగా... హసన్ అలీ, ఆమిర్, వహాబ్ రియాజ్‌లకు కాంట్రాక్టు దక్కలేదు. ఇమామ్, మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, యాసిర్ షాల కాంట్రాక్టు గ్రేడ్ తగ్గించారు. వీళ్లంతా ‘బి’ కేటగిరీకి పడిపోయారు. ఇప్పుడు ‘ఎ’ కేటగిరీలో కొత్తగా షహీన్ షా అఫ్రిదికి చోటు దక్కగా మొత్తంగా ఈ గ్రేడ్‌లో ఉన్నది ముగ్గురే. మిగతా ఇద్దరు అజహర్ అలీ, బాబర్ ఆజమ్‌లు కాగా... ఈ కాంట్రాక్టు జూలై 1 నుంచి వచ్చే జూన్ దాకా అమల్లో ఉంటుంది. -
ఆసీస్ ఘనవిజయం
మాంచెస్టర్: యాషెస్‌ను ఘోరంగా ఓడినప్పటికీ ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు ఘనంగానే ఆరంభించింది. తొలి వన్డే వర్షార్పణం కాగా కెప్టెన్ మైకేల్ క్లార్క్ (102 బంతుల్లో 105; 14 ఫోర్లు) మెరుపు సెంచరీ సహాయంతో రెండో వన్డేను 88 పరుగుల తేడాతో గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 315 పరుగుల భారీ స్కోరు సాధించింది. తొలి ఓవర్లోనే షాన్ మార్ష్ వెనుదిరిగినా ఆసీస్ జోరు ఏమాత్రం తగ్గలేదు. క్లార్క్, జార్జి బెయిలీ (67 బంతుల్లో 82; 5 ఫోర్లు; 4 సిక్స్) తుఫాన్ ఆటతీరుతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. నాలుగో వికెట్‌కు వీరి మధ్య 155 పరుగుల భారీ స్కోరు లభించింది. ఫిన్, రాన్‌కిన్, బొపారాలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 44.2 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌట్ అయ్యింది.


