breaking news
one day cricket rankings
-
టాప్ లేపిన మిథాలీ.. మూడేళ్ల తర్వాత అగ్రపీఠం కైవసం
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్, యువ ఓపెనర్ షెఫాలీ వర్మ దుమ్ము లేపారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అద్భుతంగా రాణించిన మిథాలీ.. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడేళ్ల తర్వత మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా చిచ్చర పిడుగు షెఫాలీ టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. ఈ జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన.. 701 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. 💥 @M_Raj03 is the new No.1 💥In the latest @MRFWorldwide ICC Women's ODI Player Rankings for batting, the India skipper climbs to the 🔝 of the table.Full list: https://t.co/KjDYT8qgqn pic.twitter.com/2HIEC49U5i— ICC (@ICC) July 6, 2021 బౌలింగ్ విభాగంలో జూలన్ గోస్వామి(694 పాయింట్లు) 4వ స్థానంలో, పూనమ్ యూదవ్(617 పాయింట్లు) 9వ ర్యాంక్‌లో నిలిచారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా బౌలర్లు జెస్ జొనాస్సెన్ (808 పాయింట్లు), మేఘన్ షట్(762 పాయింట్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఆల్‌రౌండర్ల విభాగంలో టీమిండియా మహిళా క్రికెటర్ దీప్తి శర్మ(331 పాయింట్లు) ఐదో ర్యాంకును దక్కించుకోగా.. మరిజన్నె కప్ (సౌతాఫ్రికా), ఎలిసా పెర్రి(ఆస్ట్రేలియా) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇక, టీ20 ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. బ్యాటింగ్ విభాగంలో ఇద్దరు భారత మహిళా బ్యాటర్లు టాప్ -10లో నిలిచారు. టీమిండియా చిచ్చర పిడుగు షెఫాలీ వర్మ 776 రేటింగ్ పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలువగా, మరో స్టార్ బ్యాటర స్మృతి మంధాన(693 పాయింట్లు) నాలుగో ర్యాంక్‌లో నిలిచింది. ఈ ఫార్మాట్లోని బౌలింగ్ విభాగంలో భారత బౌలర్లు దీప్తి శర్మ 5వ ర్యాంక్‌లో, రాధా యాదవ్ 6వ స్థానంలో ఉన్నారు. ఆల్‌రౌండర్ విభాగంలో దీప్తి శర్మ.. 304 పాయింట్లతో ఐదో ర్యాంకులో ఉంది. -
వన్డే ర్యాంకింగులో 3వ స్థానానికి పడిపోయిన విరాట్ కోహ్లీ
వన్డే ర్యాంకింగులలో భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మూడో స్థానానికి పడిపోయాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగులను దుబాయ్‌లో మంగళవారం ప్రకటించింది. ఇంతకుముందు రెండో స్థానంలో కోహ్లీ ఉండగా.. ఇప్పుడు ఆ స్థానంలోకి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హషీం ఆమ్లా వచ్చాడు. అయితే.. నవంబర్ రెండో తేదీ నుంచి శ్రీలంకతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్ రూపంలో కోహ్లీకి తన స్థానాన్ని మెరుగు పరుచుకోడానికి మరో అవకాశం ఉంది. ఆమ్లాకు, కోహ్లీకి మధ్య కేవలం రెండు రేటింగ్ పాయింట్లు మాత్రమే తేడా ఉంది. మొదటి ర్యాంకులో దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డీవీలియర్స్ ఉన్నాడు. భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఆరో స్థానాన్ని యథాతథంగా నిలుపుకొన్నాడు. అయితే శిఖర్ ధవన్ మాత్రం తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. ఆరు, ఏడు స్థానాల్లో భారత బౌలర్లు రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్ యథాతథంగా ఉన్నారు. పాకిస్థాన్ బౌలర్ సయీద్ అజ్మల్ తన మొదటి స్థానాన్ని నిలుపుకొన్నాడు. ప్రపంచ ఛాంపియన్లు గా ఉన్న భారత జట్టు నెంబర్ 3లోనే కొనసాగగా, దక్షిణాఫ్రికా మాత్రం ఐదేళ్ల తర్వాత మళ్లీ వన్డేలలో టాప్ ర్యాంకును సాధించింది. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా కంటే ఒక్క రేటింగ్ పాయింటు తేడాతో ఆస్ట్రేలియా నిలిచింది. ఇంతకుముందు 2009 సెప్టెంబర్ నెలలో ఒక్కసారి దక్షిణాఫ్రికాకు నెంబర్ 1 స్థానం లభించినా, 2009 ఛాంపియన్స్ ట్రోఫీ తొలి రౌండులోనే వెనుదిగడంతో ఆస్ట్రేలియాకు ఆ స్థానం అప్పగించేసింది.