breaking news
Olivia
-
ఔరా... ఒలీవియా
లండన్: మహిళల ఫుట్‌బాల్‌లో ఒలీవియా స్మిత్ కొత్త చరిత్ర సృష్టించింది. కెనడాకు చెందిన ఈ స్టార్ ప్లేయర్ కోసం... ఇంగ్లండ్‌కు చెందిన అర్సెనల్ ఫుట్‌బాల్ క్లబ్ రికార్డు ధర చెల్లించింది. గత సీజన్లో లివర్‌పూల్ క్లబ్ కోసం ఆడిన ఒలీవియా వచ్చే నాలుగేళ్లపాటు అర్సెనల్ క్లబ్ తరఫున బరిలోకి దిగుతుంది. ట్రాన్స్ఫర్ ఫీజు కింద అర్సెనల్ క్లబ్ 10 లక్షల పౌండ్లను (రూ. 11 కోట్ల 55 లక్షలు) లివర్‌పూల్‌కు చెల్లించింది. మహిళల ఫుట్‌బాల్ చరిత్రలో ఇదే అత్యధిక బదిలీ మొత్తం కాగా... ఈ ఏడాది జనవరిలో అమెరికా ప్లేయర్ నవోమీ గిర్మా కోసం చెల్సీ క్లబ్... సాన్ డియెగో వేవ్ జట్టుకు చెల్లించిన 9 లక్షల పౌండ్ల (రూ. 9 కోట్ల 47 లక్షలు) ధర రెండో స్థానానికి చేరింది. ‘ఒలీవియ స్మిత్ ప్రతిభావంతురాలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించగల సత్తా ఆమెలో ఉంది. క్లబ్ అభివృద్ధికి అది దోహదపడుతుంది’ అని అర్సెనల్ మహిళల ఫుట్‌బాల్ క్లబ్ డైరెక్టర్ క్లేర్ వీట్లీ తెలిపారు. 15 ఏళ్ల వయసులోనే కెనడా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసి ఆకట్టుకున్న ఒలీవియా... 2023 సీజన్లో స్పోరి్టంగ్ లిస్బన్ క్లబ్ తరఫున 28 మ్యాచ్‌ల్లో 16 గోల్స్‌తో మెరిసింది. ఇక గతేడాది లివర్‌పూల్‌కు ప్రాతినిధ్యం వహించిన 20 ఏళ్ల ఒలీవియా 25 మ్యాచ్‌ల్లో 9 గోల్స్ చేసింది. ‘ఒలీవియాలో అపార నైపుణ్యం ఉంది. అర్సెనల్ తరఫున ఆమె అద్భుతాలు చేయగలదనే నమ్మకముంది. చిన్న వయసులోనే గత రెండు యూరోపియన్ లీగ్‌ల్లో తన నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకుంది’ అని అర్సెనల్ హెడ్ కోచ్ రెనీ స్లెగెర్స్ అన్నాడు. 15 సార్లు ఇంగ్లిష్ చాంపియన్‌గా నిలిచిన అర్సెనల్ క్లబ్... గత సీజన్లో రెండోసారి చాంపియన్స్ లీగ్ టైటిల్ గెలుచుకుంది. ‘ఇది నా కల. అత్యున్నత స్థాయిలో ఇంగ్లండ్, యూరప్ లీగ్‌ల్లో రాణించాలనుకుంటున్నా. అర్సెనల్ జట్టు తరఫున ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. క్లబ్ విజయం కోసం నా వంతు కృషి చేస్తా’అని ఒలీవియా పేర్కొంది. గతంలో మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్లకు పెద్దగా డిమాండ్ లేకపోగా... ఇటీవలి కాలంలో వారి కోసం వెచ్చిస్తున్న మొత్తం భారీగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో గిర్మాకు కేటాయించిన ధరే అత్యధికం అనుకుంటే... ఆరు నెలలు తిరిగేసరికి ఒలీవియా ఆ రికార్డును బద్దలు కొట్టింది. పురుషుల విభాగంతో పోల్చుకుంటే ఇది తక్కువే అయినా... మహిళల ఆటకు దక్కుతున్న ఆదరణకు ఈ గణాంకాలు తాజా ఉదాహరణ. పురుషుల ఫుట్‌బాల్‌లో బ్రెజిల్‌కు చెందిన నెమార్ కోసం పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ) క్లబ్... 2017లో బార్సిలోనా క్లబ్‌కు 262 మిలియన్ల అమెరికా డాలర్లు (రూ. 2255 కోట్లు) చెల్లించింది. ఫ్రాన్స్ స్టార్ కిలియాన్ ఎంబాపె కోసం పీఎస్జీ క్లబ్... 216 మిలియన్ల అమెరికా డాలర్లు (రూ. 1859 కోట్లు) వెచ్చించింది. -
ఒలివియా–జాన్ పీర్స్ జోడీకి మిక్స్డ్ డబుల్స్ టైటిల్
ఆరంభ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ‘మిక్స్డ్ డబుల్స్’ ఫైనల్ కాస్తా ఆ్రస్టేలియన్ల సమరంగా మారింది. కోర్టులో ఇవతల... అవతల... నలుగురూ ఆ్రస్టేలియన్లే ట్రోఫీ కోసం ‘ఏస్’లు దూశారు. చివరకు ఒలివియా గడెస్కీ–జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా) జోడీ విజేతగా నిలిస్తే... సహచర ద్వయం కింబర్లీ బిరెల్–జాన్ ప్యాట్రిక్ స్మిత్ రన్నరప్‌తో తృప్తి పడింది. ఇరు జోడీలు ‘వైల్డ్‌కార్డ్’ ఎంట్రీతోనే సొంతగడ్డపై గ్రాండ్‌స్లామ్ ఆడటం గమనార్హం. మొత్తానికి 58 ఏళ్ల తర్వాత అంతా అ్రస్టేలియన్లే తలపడిన తుది పోరులో పీర్స్–ఒలివియా జోడీ 3–6, 6–4, 10–6తో స్మిత్–బిరెల్ జంటపై గెలిచింది.ఒలివియా–పీర్స్ జంటకు 1,75,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 95 లక్షల 36 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 22 ఏళ్ల ఒలివియాకిదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్. 36 ఏళ్ల పీర్స్ ఖాతాలో ఆ్రస్టేలియన్ ఓపెన్ (2017) పురుషుల డబుల్స్ టైటిల్, 2022లో యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ఉన్నాయి. -
‘ఆర్ఆర్ఆర్’: ఒలీవియా ఫస్ట్‌లుక్ అదుర్స్
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొమరం బీమ్‌గా, మెగా పవర్ స్టార్ అల్లూరి సీతారామారాజుగా కనిపించనున్నారు. ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్లో ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ట్విటర్లో విడుదల చేసింది. ‘అందమైన, ప్రతిభవంతురాలైన జెన్నీఫర్.. @ఒలివియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేసింది. రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తున్నారు. అయితే ఒలివియా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చూస్తుంటే ఇందులో ఆమె బ్రిటీష్ యువతిగా కనిపించునున్నట్లు తెలుస్తోంది. కాగా ఎన్టీఆర్ కూడా ఒలీవియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్లకు ప్రేక్షకులను నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా ఒలివియా ఫస్ట్‌లుక్‌కు సైతం తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ సీన్ల షూటింగ్‌ను జరుపుకుంట్ను ఈ మూవీని అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది. Wishing the talented and beautiful #Jennifer @OliviaMorris891 a very Happy Birthday. #RRRMovie #RRR pic.twitter.com/JLXZPxDZMa — RRR Movie (@RRRMovie) January 29, 2021 -
ఒలీవియా.. ఆలియా.. పాఠాలయ్యా
పాత్రను బట్టి డైలాగ్ మారుతుంది. అది చెప్పే విధానం మారుతుంది. పరభాషా నటీనటులు తమకు రాని భాషలో సినిమాలు చేసేప్పుడు డైలాగ్స్ సరిగ్గా పలికేందుకు డైలాగ్ కోచ్‌లను పెట్టుకుంటారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కూడా పలువురు డైలాగ్ ట్యూటర్స్‌ను నియమించిందట. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కొమరమ్ భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ కనిపించనున్నారు. వీళ్లకు జోడీగా ఒలీవియా మోరిస్, ఆలియా భట్ నటించనున్నారు. ఒలీవియా హాలీవుడ్ నటి, ఆలియా బాలీవుడ్ నటి. అందుకే వీళ్ల కోసం ప్రత్యేకంగా డైలాగ్ ట్యూటర్స్‌ను ఏర్పాటు చేశారట. ఆలియా భట్ వచ్చే వారం నుంచి ఈ సినిమా చిత్రీకరణలో జాయిన్ అవుతారట. అజయ్ దేవగన్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు. -
హాలీవుడ్ నటి ఒలివియా కన్నుమూత
హాలీవుడ్ సీనియర్ నటి, 1960ల సూపర్ స్టార్, రెండు సార్లు ఆస్కార్ గెలిచిన ఒలివియా కన్నుమూశారు. ఆదివారం రాత్రి నిద్రలోనే తుది శ్వాస విడిచినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఒలివియా వయసు 104. ఐదు దశాబ్దాల పాటు హాలీవుడ్ లో నటిగా కొనసాగారామె. సుమారు 49 సినిమాల్లో నటించారు. ‘టుఈచ్ హిజ్ ఓన్’ (1947), ‘ది హెయిరెస్’ (1950) సినిమాలకు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారామె. ‘కెప్టెన్ బ్లడ్, ది అడ్వెంచర్స్ ఆఫ్ రాబిన్ హుడ్, స్నేక్ పిట్’ వంటి పాపులర్ సినిమాల్లో కనిపించారు ఒలీవియా. హాలీవుడ్ గోల్డెన్ పీరియడ్ లో ఒలివియా తిరుగులేని సూపర్ స్టార్ అనిపించుకున్నారు. ఒలివియా మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
మారడోనాకు మళ్లీ పెళ్లి
ఫుట్‌బాల్ దిగ్గజం, నిత్యం వివాదా ల్లో ఉండే అర్జెంటీనా మాజీ స్టార్ డిగో మారడోనా మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. 54 ఏళ్ల మారడోనా 25 ఏళ్ల రికో ఒలివా అనే అమ్మాయితో చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. తామిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ఒలివా ప్రకటించింది. ప్రస్తుతం మారడోనా, అయన మాజీ భార్య క్లాడియా విలాఫెనీల మధ్య వివాదం న్యాయస్థానంలో ఉంది. క్లాడియాతో మారడోనాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మరో ముగ్గురు మహిళలతో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కూడా ఉన్నారు. ఇన్ని పెళ్లిళ్లు అయ్యాక... ఈ వయసులో మరోసారి పెళ్లి కొడుకు కాబోతున్నాడు మారడోనా. ఇటీవల మారడోనాకు, ఒలివాకు కూడా విభేదాలు వచ్చాయనే వార్తలు పెరిగిన నేపధ్యంతో ఆ అమ్మాయి ఈ ప్రకటన చేసింది.