breaking news
offers prayers
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ శ్వేత పరషార్ (ఫోటోలు)
-
కేదారనాథ్ దర్శించిన రాష్ట్రపతి
-
కేదారనాథ్ దర్శించిన రాష్ట్రపతి
డెహ్రాడూన్ః రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం కేదారనాథ ఆలయాన్ని దర్శించారు. ఉత్తరాఖండ్ గవర్నర్ కె.కె. పాల్, ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా ప్రణబ్ ముఖర్జీతో ఉన్నారు. జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్ నాథ్ లోని శివలింగ దర్శనం చేసుకొన్న రాష్ట్రపతి ఆనందపరవశులయ్యారు. కేదారనాథాలయాన్ని దర్శించిన ప్రణబ్ ముఖర్జీ ప్రజా శ్రేయస్సుకోసం గర్భగుడిలో 20 నిమిషాల పాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. పట్టిష్ట భద్రతమధ్య ప్రణబ్ ముఖర్జీ ఓ ఐఏఎఫ్ ఛాపర్ లో కేదారనాథ్ వెళ్ళారు. రాష్ట్రపతికి పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రామనామాన్ని రాసిన ఓ వస్త్రంతోపాటు, రుద్రాక్షమాలను ఆయనకు బహుమతిగా ఇచ్చారు. మరోవైపు ఆలయ అధికారులు సైతం గౌరవ ప్రెసిడెంట్ కు చెక్కతో తయారు చేసిన ఆలయ ప్రతిరూపాన్ని బహూకరించారు. జూన్ 22న కూడా ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ఉత్తరాఖండ్ సందర్శించారు. అయితే అప్పట్లో వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో వెంటనే ఢిల్లీ తిరుగు ప్రయాణమయ్యారు. ప్రస్తుతం మరోసారి పరమేశ్వరుని దర్శనంకోసం వెళ్ళిన ప్రణబ్.. ఆలయ పూజారులు, అధికారులతో ముచ్చటించారు. మందిర పరిసరాల్లో జరుగుతున్న ఆలయ పునరుద్ధరణ పనులను గురించి సమచారాన్ని అడిగి తెలుసుకున్నారు. 2013 లో వచ్చిన ఆకస్మిక వరదలు, వర్షాలు కేరారనాథ్ ప్రాంతంలో విధ్వంసాన్ని సృష్టించాయి. అప్పటి జల ప్రళయానికి వేలమంది మృతి చెందగా వందల్లో జనం కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళే రహదారులతో పాటు ఆలయ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.