breaking news
NRI investments
-
US : ఆస్టిన్ తెలుగు సంఘానికి కొత్త కార్యవర్గం
అమెరికా టెక్సాస్ రాజధాని ఆస్టిన్లో 2024కి గాను తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) నూతన కార్యవర్గం ఏర్పాటయింది. రౌండ్ రాక్ విన్గేట్ బై విందామ్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో కొత్త కార్యవర్గాన్ని ఆస్టిన్ తెలుగు కమ్యూనిటీ ప్రకటించింది. తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) కార్యవర్గం వివరాలు అధ్యక్షుడు : పరమేశ్వర రెడ్డి నంగి ఉపాధ్యక్షుడు : శ్రీని బైరపనేని సెక్రెటరీ : భరత్ పిస్సాయ్ ట్రెజరర్ : చిన్నపరెడ్డి కుందూరు సంయుక్త కార్యదర్శులు : కల్చరల్ : ప్రతిభ నల్ల ఫైనాన్స్ & స్పాన్సర్షిప్ : లక్ష్మీకాంత్ ఫుడ్ & లాజిస్టిక్స్ : వెంకటేష్ దూబాల మెంబర్షిప్ & టెక్నాలజీ : శ్రీలత అంబటి స్పోర్ట్స్ : సర్వేశ్వరా రెడ్డి పాశం బోర్డు అఫ్ డైరెక్టర్లు : అర్జున్ అనంతుల గిరి మేకల బ్రహ్మేంద్ర రెడ్డి లాక్కుని గత కార్యవర్గంలో సేవలందించిన రామ్ హనుమంతు మల్లిరెడ్డి,మురళీధర్ రెడ్డి వేలూరు, శ్రీనివాస్ బత్తుల మరియు ఇతర TCA సభ్యులకు కొత్త కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది. అమెరికాలోని తెలుగు సమాజానికి, ప్రవాసాంధ్రులకు మరిన్ని సేవలందించేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపింది. -
హైదరాబాద్కు ఎన్నారై పెట్టుబడులు నో!
సాక్షి, హైదరాబాద్: అనుకున్న వెంటనే పెట్టుబడులు పెట్టగలిగేది.. దీర్ఘకాలికంగా లాభాలు ఆర్జించేది స్థిరాస్తి రంగమే. కానీ, ఈ విషయంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కాసింత దూరంలోనే ఉందంటోంది అసోచామ్ సర్వే. ఏడాది కాలంగా డాలర్ విలువ పెరగటం, ఎన్నారైలకు ప్రత్యేక రాయితీలూ కల్పిస్తున్నా.. హైదరాబాద్కు ఎన్నారై పెట్టుబడులు రావట్లేదని అసోచామ్ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. ఎన్నారై పెట్టుబడులను ఆకర్షిస్తున్న నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. హైదరాబాద్కు స్థానమే దక్కలేదు. సర్వేలోని పలు అంశాలివే.. స్థిరాస్తి రంగంలో ఎన్నారై పెట్టుబడులు ఏ స్థాయిలో ఉంటున్నాయనే అంశంపై ఢిల్లీ, చండీఘడ్, ముంబై, కోల్కత్తా, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పుణే, డెహ్రాడూన్, చెన్నై నగరాల్లో దాదాపు 850 స్థిరాస్తి సంస్థలతో అసోచామ్ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది హై ఎండ్ ప్రాపర్టీలు, వాణిజ్య సముదాయాల్లోనే ఎన్నారై పెట్టుబడులు పెరుగుతున్నాయి. గతేడాది బెంగళూరులోని మొత్తం స్థిరాస్తి పెట్టుబడుల్లో 18 శాతంగా ఉన్న ఎన్నారై పెట్టుబడులు ఈ ఏడాది 35 శాతానికి పెరిగాయని సర్వే చెబుతోంది. ఇందుకు కారణం.. బెంగళూరులో ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు ఎక్కువగా ఉండటం వల్లే. 2,200 ఐటీ కంపెనీలు, 664 ఎంఎన్సీలు, 183 బయోటెక్నాలజీ కంపెనీలు, 248 బీపీఓలు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో అహ్మదాబాద్ (32 శాతం), పుణే (30.5 శాతం), చెన్నై (28 శాతం), గోవా (23 శాతం) నిలిచాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో మాత్రం గతేడాదితో పోల్చుకుంటే ఈసారి 21 శాతం ఎన్నారై ఎక్వయిరీలు పెరిగాయే కానీ, పెట్టుబడులు మాత్రం ఆ స్థాయిలో రాలేదని సర్వే చెబుతోంది. దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం, నిబంధనలను సరళీకృతం చేయటం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కారణంగా దేశంలో స్థిరాస్తి పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి యూఎస్, యూఏఈ, యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా దేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, స్థిరాస్తి సంస్థలూ ప్రాపర్టీ షోలు నిర్వహించటం, విదేశాల్లో కార్యాలయాలను ప్రారంభించటం, ఎన్నారైలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తుండటం వంటివి మరింతగా కలిసొస్తుందని అసోచామ్ సర్వే సారాంశం.