breaking news
not done
-
పరిమితంగా పఠనోత్సవం
సగం పాఠశాలల్లో కానరాని కార్యక్రమం సమన్వయ లోపంతో తొలిరోజే గ్రహణం భానుగుడి (కాకినాడ) : విద్యార్థుల్లో సృజనను వెలికితీసి, పుస్తక పఠనంపై శ్రద్ధ పెంచాలన్న తలంపుతో ఎస్సీఈఆర్టీ రూపొందించిన పఠనోత్సవం కార్యక్రమం తొలిరోజు జిల్లాలో సగం పాఠశాలలకే పరిమితమైంది. సోమవారం నుంచి ఈనెల 14వ తేదీ వరకు దీని అమలుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన ఈ కార్యక్రమం ఆదిలోనే హంసపాదు అన్నట్టు తయారైంది. సమావేశమేదీ..సమన్వయం ఎక్కడ? అక్టోబరు 27న ఎస్సీఈఆర్టీ ద్వారా వెలువడిన ఉత్తర్వుల ప్రకారం డీఈవో సంబంధిత ఉపవిద్యాశాఖాధికారులతో, మండల విద్యాశాఖాధికారులతో, రాజీవ్ విద్యామిషన్, సర్వశిక్షాభియాన్, డైట్ ప్రిన్సిపాల్స్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఆయా అ«ధికారుల సమన్వయంతో అన్ని పాఠశాలల్లోను కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. జిల్లాలో సోమవారం నుంచి పఠనోత్సవాలు ప్రారంభమయినా ఇప్పటి వరకు ఏ అ«ధికారితోను డీఈవో సమావేశం నిర్వహించలేదు. జిల్లాలో సగానికి పైగా పాఠశాలలకు ఈ కార్యక్రమ వివరాలు తెలియలేదు. ప్రతి చిన్న విషయాన్ని డీఈవో వెబ్సైట్లో ఉంచే అ«ధికారులు ఈ రాష్టస్థాయి కార్యక్రమాన్ని విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. మండల విద్యాశాఖాధికారులు, ఉపవిద్యాశాఖాధికారులు ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి కార్యక్రమాన్ని జరిపించాలి. పైస్థాయిలోనే పక్కతోవ పట్టడంతో మండల, డివిజ¯ŒS స్థాయిలోను అదే తరహా ధోరణి నెలకొంది. దీంతో సమాచారం తెలిసిన పాఠశాలల్లో మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సగం పాఠశాలల్లో నిల్. జిల్లాలో 1నుంచి 10వ తరగతి వరకు 5,760 పాఠశాలల్లో 7లక్షల50వేలమంది విద్యార్థులకు ఈ పఠనోత్సవ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. పదోతరగతి విద్యార్థులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందే. రోజువారీ 6, 7, 8 పిరియడ్లలో ఈ కార్యక్రమం జరగాలి. కనీసం రెండోరోజైనా జిల్లా అధికారులు శ్రద్ధ తీసుకుని విద్యార్థులకు ఉపకరించే కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలుపరచాలని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. కాకినాడలో ఎండోమెంట్ పాఠశాల, గుడారిగుంట, గాంధీనగర్ మినహా మిగిలిన పాఠశాలల్లో పద్యపఠనాన్ని అయిందనిపించడం గమనార్హం. దీనిపై కలెక్టర్ విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారంటున్నారు. కొన్నిచోట్లే ప్రారంభం కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : జిల్లాలో సోమవారం కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ పఠనోత్సవాలను ఈనెల 14 వరకు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించించారు. విద్యార్థులు ఒక కథ రాస్తే దానికి శీర్షిక, చక్కని ప్రారంభ వాక్యాలు, ముగింపు ఉండేలా ఉపాధ్యాయులు సలహాలు ఇవ్వాల్సివుంది. దాతల ద్వారా గ్రంథాలయ పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చూడాలి. సోమవారం పద్యపఠనం ప్రారంభంకాగా, ఎనిమిదిన కథలు చెప్పించడం, తొమ్మిదిన వ్యాసాలు, కథనాలపై స్పందన, 10న నాటికలు, 11న సృజనాత్మక రచనలు ఉంటాయి. వీటిలో మంచి ప్రతిభ కనపర్చిన వారికి ఈనెల 14 బాలల దినోత్సవం నాడు బహుమతులు అందజేస్తారు. వీటిలో ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులంతా పాల్గొనేలా చూడాల్సిన బాధ్యత ప్రధానోపా«ధ్యాయులదే. ఈ పఠనోత్సవాలపై రోజువారీ నివేదికను జిల్లాలోని స్థానిక విద్యాశాఖ కార్యాలయాల్లో అందజేయాల్సి వుంది. పఠనోత్సవాలను నిత్యం పర్యవేక్షిస్తామని డిప్యూటీ స్కూల్స్ ఆఫ్ ఇన్ స్పెక్టర్ అయ్యంకి తులసీదాస్ తెలిపారు. వీటిని పాటించని పాఠశాలలపై తగు చర్యలు చేపడతామన్నారు. -
విస్తరణలో తాత్సారం
ముందుకు సాగని కెనాల్ రోడ్డు విస్తరణ పనులు ప్రజల ప్రాణాలు పోతున్నా మూడేళ్లుగా సాగ..దీత అధికార పార్టీ ఎంపీ కాంట్రాక్టు సంస్థ కావడంతో నోరుమెదపని స్థానిక ప్రజాప్రతినిధులు సర్కారుకు ఒత్తిడి తేవడానికి అనపర్తి వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సిద్ధం అనపర్తి (బిక్కవోలు) : గత ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్రం కాకినాడ నుంచి వాణిజ్య కేంద్రం రాజమండ్రిని కలుపుతూ చేపట్టిన కెనాల్ రోడ్డు విస్తరణ పనులు మూడేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. రోడ్డు అభివృద్ధి చేస్తే తమ గ్రామాలకు రాకపోకలు సులువుగా సాగుతాయని భావించిన రోడ్డు వెంబడి ఉన్న గ్రామాల వారు ఏళ్ల తరబడి నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ మూడేళ్లలో ఈ రోడ్డుపై జరిగిన ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోగా ఈ ఏడాది ఇప్పటికి నలుగురు మృతిచెందారు. కెనాల్ రోడ్డు అభివృద్ధిలో భాగంగా కాకినాడ నుంచి వేమగిరి వరకు 56 కిలోమీటర్లు రోడ్డును ఎనిమిది నుంచి 10 మీటర్ల రోడ్డుగా అభివృద్ధి చేయడానికి, వేట్లపాలెం నుంచి కాకినాడకు నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయడానికి ప్రపంచబ్యాంకు నిధులు సుమారు రూ.260 కోట్లు మంజూరయ్యాయి. కాంట్రాక్టు చేజిక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ సంస్థ మూడేళ్లలో పనులు పూర్తి చేయవలసి ఉంది. నిబంధనల ప్రకారం ఈ ఏడాది అగస్టుకు పనులు పూర్తయి రోడ్డు వినియోగంలోకి రావలసి ఉంది. కాని ఇప్పటి వరకు 5 శాతం మాత్రమే పనులు జరిగాయి. రాజకీయాల్లో హేమాహేమీలుగా చెప్పకునే మూడు నియోజకవర్గాల శాసనసభ్యులు, రాష్ట్ర హోంమంత్రి నియోజకవర్గాల పరిధిలో ఉన్నప్పటికీ పనులు ముందుకుసాగడం లేదు. కాంట్రాక్టు దక్కించుకున్నది తెలుగుదేశం ఎంపీకి చెందిన కంపెనీ కావడంతో.. నిధులిచ్చిన ప్రపంచబ్యాంకు కాంట్రాక్టర్‌ను తొలగించమన్నా ప్రభుత్వం స్పందించడంలేదు. ప్రజాప్రతినిధులు తమ స్వప్రయోజనాల కోసం మౌనంగా ఉంటున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రేపు సూర్యనారాయణరెడ్డి పాదయాత్ర ఈ రోడ్డు పనులు పూర్తికాక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన అనపర్తి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఈ నెల 26వ తేదీన అనపర్తి నుంచి బిక్కవోలు వరకు 12 కిలోమీటర్లు పాదయాత్రను చేపట్టనున్నారు. ఈ పాదయాత్రకు నియోజకవర్గంలోని జనం పార్టీల కతీతంగా సంఘీభావం ప్రకటిస్తున్నారు.