no relief
-
బీజేపీ ఎంపీ ఈటలకు హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్, సాక్షి: బీజేపీ నేత, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై దాఖలైన కేసును కొట్టేయాలని ఆయన చేసిన అభ్యర్థన పిటిషన్‌ను గురువారం న్యాయస్థానం కొట్టేసింది. ఘట్కేసర్లోని కొర్రెములలో శ్రీహర్ష కన్స్ట్రక్షన్ సెక్యూరిటీ గార్డుపై ఈటల రాజేందర్ చేయి చేసుకున్నారని అభియోగం ఉంది. సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఈటలపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే కేసులో ప్రాథమిక ఆధారాలున్నందునే పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ దశలో కేసును కొట్టేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. ఈటలపై నమోదైన కేసును కొట్టేసేందుకు నిరాకరించింది. కేసు గురించి కింది కోర్టులోనే తేల్చుకోవాలని ఈటలకు సూచిస్తూ పిటిషన్‌ను కొట్టేసింది. -
ఆ నేరగాళ్లకు రాజీ అవకాశం ఉండదు
న్యూఢిల్లీ: నగదు అక్రమ రవాణా, ఉగ్రవాదులకు నిధుల చేరవేత, బినామీ ఆస్తులను, రహస్యంగా విదేశీ ఆస్తులను కలిగి ఉండటం, అవినీతి తదితర నేరాలకు పాల్పడేవారికి ఇక నుంచి ఐటీ విభాగంతో రాజీ కుదుర్చుకునే అవకాశాన్ని కల్పించకూడదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) నిర్ణయించింది. పై నేరాలకు పాల్పడేవారు రాజీ కుదుర్చుకునే హక్కును కోల్పోతారంది. అయితే నేరస్తుడి ప్రవర్తన, నేరం స్వభావం, తీవ్రత, నేరానికి పాల్పడేందుకు ప్రేరేపించిన పరిస్థితులు తదితరాలను పరిగణనలోనికి తీసుకున్న అనంతరం, అవసరమనుకుంటే ఆ వ్యక్తులు/సంస్థలకు రాజీ అవకాశం ఇచ్చే అధికారం కేంద్ర ఆర్థిక మంత్రికి ఉంటుందని స్పష్టం చేసింది. -
బడ్జెట్లో సామాన్యులను పట్టించుకోలేదు
పార్టమెంటులో అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే పెదవి విరిచారు. ఈ బడ్జెట్ లో సామాన్యులకు ఎటువంటి ఉపశమనం లేదని అన్నారు. ఎట్టకేలకు పారిశ్రామికవేత్తలకు కాస్త ఉపశమనం కలిగేలా చూశారని చిరకాలంగా ఉన్న రైతుల రుణమాఫీ డిమాండ్‌ను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో గ్రామీణ ఉపాధి హామీ కింద వేతనాలు పెరిగేందుకు ఏమాత్రం ఉపయోగపడిందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. యూపీఏ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో ఉపాధి హామీకి 40,000 కోట్లు ఇచ్చిందన్నారు. దాంతో పోలిస్తే ఈ బడ్జెట్ పెద్ద విషయమేమీ కాదన్నారు. మొత్తం కేటాయింపులు ఎంత పెరిగాయన్నది ముఖ్యం కాదని, వేతనాల్లో ఎంత పెరిగిందన్నది పోల్చి చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. రోజుకూలి 100 రూపాయలు ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం 40 వేల కోట్లు మంజూరు చేసిందని, ఇప్పుడు రోజు కూలి 150కి మారిందని అన్నారు. అరుణ్ జైట్లీ బడ్జెట్ ఒక్క డబ్బు విషయాన్నే పరిగణలోకి తీసుకుందని, భౌతిక భాగాన్ని పరిశీలించలేదని ఖర్గే విమర్శించారు. ముఖ్యంగా బడ్జెట్లో మహిళలు, యువతకు ఏమాత్రం ప్రాముఖ్యతను ఇవ్వలేదంటూ ఆరుణ్ జైట్లీ బడ్జెట్ పై కాంగ్రెస్ నేత ఖర్గే విమర్శలు ఎక్కుపెట్టారు. -
డిజీపీ దినేష్ రెడ్డికి క్యాట్‌లో మరోసారి చుక్కెదురు!