breaking news
No cashless treatment
-
ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు క్యాష్‌లెస్ సేవలు బంద్
నగదు రహిత పాలసీపై బీమా కంపెనీలు, ఆస్పత్రుల మధ్య వివాదం పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 15 వేలకు పైగా ఆసుపత్రులు రెండు బీమా కంపెనీల క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ సదుపాయాన్ని సెప్టెంబర్ 1 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. వీటిలో బజాజ్ అలియాంజ్, కేర్ హెల్త్ ఉన్నాయి.ఆస్పత్రుల సంస్థ అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా (ఏహెచ్‌పీఐ) ఈ విషయాన్ని వెల్లడించింది. చికిత్స వ్యయం నిరంతరం పెరుగుతోందని, కానీ సంబంధిత బీమా కంపెనీలు చికిత్స ఖర్చుల రేట్లు (పరిమితులు) మాత్రం పెంచడం లేదని, ఏహెచ్‌పీఐ చెబుతోంది.అంతే కాకుండా ఆయా కంపెనీలు చెల్లింపుల్లో జాప్యం చేస్తూ అనవసరమైన పత్రాలు అడుగుతున్నాయని ఆస్పత్రుల వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీంతో పాలసీ సంబంధిత చెల్లింపుల్లో అనేక సమస్యలు తలెత్తడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.ఏహెచ్‌పీఐ పిలుపు మేరకు సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా 15 వేల ఆసుపత్రులు నగదు రహిత చికిత్స అందించేందుకు నిరాకరించాయి. మరోవైపు రోగుల నగదు రహిత బిల్లు చెల్లింపునకు సంబంధించిన సమస్యలపై చర్చించాలని కేర్ హెల్త్ కు ఏహెచ్ పీఐ నోటీసులు జారీ చేసింది. లేదంటే సెప్టెంబర్ 1 నుంచి నగదు రహిత వైద్యం పూర్తిగా నిలిచిపోతుంది.వివాదానికి ప్రధాన కారణంబజాజ్ అలియాంజ్ పాత కాంట్రాక్ట్ రేట్లను పెంచడానికి నిరాకరించిందని ఆస్పత్రులు ఆరోపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం, చికిత్స ఖర్చుల రేట్లు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సవరించాలి. కానీ కంపెనీ దీనికి సిద్ధంగా లేదు. దీనికి భిన్నంగా ఎలాంటి కారణం చెప్పకుండా రోగిని అడ్మిట్ చేసుకున్నప్పుడు మందులు, పరీక్షలు, హాస్పిటల్ రూమ్ ఛార్జీలను తగ్గించడం ప్రారంభించింది.అంతేకాకుండా రోగి డిశ్చార్జ్ అయిన తర్వాత తుది బిల్లును ఆమోదించే సమయాన్ని కూడా పెంచడంతో రోగులు డిశ్చార్జ్ అయిన తర్వాత ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తోంది. అయితే ఈ ఆరోపణలపై రెండు కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ సేవలు నిలిచిపోతే ఈ సంస్థల నుండి ఆరోగ్య బీమా తీసుకున్న రోగులు ఆసుపత్రి బిల్లును స్వయంగా తమ జేబుల నుంచి చెల్లించి ఆ తర్వాత బీమా కంపెనీ నుంచి క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.రెండు కంపెనీలు ఎలాంటి కారణం లేకుండా చికిత్స ఖర్చులకు సంబంధించిన బిల్లులను తగ్గిస్తున్నాయని ఏహెచ్‌పీఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ గిరిధర్ గ్యానీ తెలిపారు. రోగిని డిశ్చార్జ్ చేసిన ఆరు నుంచి ఏడు గంటల తర్వాత బిల్లు ఆమోదిస్తున్నారని పేర్కొన్నారు. చర్చల కోసం ఇరు బీమా కంపెనీలకు తమ వైపు నుంచి ఈమెయిల్ పంపామని, అంశంపై బుధవారం కేర్ హెల్త్, గురువారం బజాజ్ అలియాంజ్ ప్రతినిధులతో సమావేశం కానున్నట్లు చెప్పారు. పరిష్కారం లభించకపోతే నగదు రహిత సదుపాయాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. -
అయినా... చేతిచమురు!
ఆరోగ్యశ్రీ అవకాశం ఉన్నా తప్పని ఖర్చు వైద్యపరీక్షల డబ్బు పూర్తిస్థాయిలో అందించని ఆస్పత్రులు నెట్వర్క్ ఆస్పత్రులకు వత్తాసు పలికేలా అధికారుల వైఖరి విజయనగరం ఫోర్ట్: గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన ఈయన పేరు లగుడు సూర్యనారాయణ. ఈయన కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. గత నెల 21వ తేదీన పట్టణంలోని ఓ నెట్వర్క్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు. సదరు ఆస్పత్రి వైద్యులు రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోమని చీటి రాసి ఇచ్చారు. వాటన్నింటినీ చేయించుకుని రిపోర్టులను, బిల్లులను ఆస్పత్రిలోని మిత్రాకు అందజేశారు. స్కాన్లకు, రక్తపరీక్షలకు రోగికి రూ. 4900లు ఖర్చయింది. నివేదికలను పరిశీలించిన వైద్యులు అతని వ్యాధి ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తుందని చెప్పి శస్త్రచికిత్స చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స చేసుకుంటే డిస్ఛార్జ్ అయ్యే లోపు రోగి పెట్టిన ఖర్చు మొత్తాన్ని ఆస్పత్రినుంచి వాపసు చేయాలి. కాని ఆ ఆస్పత్రి వైద్యులు డబ్బులు ఇవ్వకుండా కోత విధించారు. రూ.4900లకు కేవలం రూ.2500లు ఇచ్చి పంపించారు. ఇదేమిటని అడిగితే అంతే వస్తుందని పంపించేశారు. ఇలాంటి సంఘటన లు తరచూ నెట్వర్క్ ఆస్పత్రుల్లో చోటు చేసుకుంటున్నాయి. కాని వెలుగులోకి రావడం లేదు. ఉచితంగా వైద్యం అందాల్సి ఉన్నా రోగులకు చేతిచమురు వదులుతోంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ పథకంగా మార్చారు. దీని ద్వారా రోగులకు ఉచితంగా సేవలు అందాలి. కాని అధికారుల నిర్లక్ష్యం కాస్త రోగుల పాలిట శాపంగా మారుతోంది. శస్త్రచికిత్స లేదా చికిత్స చేయించుకున్న రోగులకు ఉచిత వైద్యంతో పాటు ప్రయాణ చార్జీలు కూడా చెల్లించాలి. కొంతకాలంగా రోగుల సంక్షేమాన్ని పట్టించుకునే వారు కరువవ్వడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా వైద్య ఖర్చులకు రోగులు సొంతంగానే వాడుకోవాల్సి వస్తోంది. పర్యవేక్షణ కరువు జిల్లాలో 11 ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ పథకం అమల్లో ఉంది. ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ అధికారులు, సిబ్బంది సంబంధిత ఆస్పత్రులకు కొమ్ము కాసేవిధంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకంలో వైద్య మిత్రలు, టీమ్లీటర్లు, మేనేజర్, జిల్లా కో ఆర్డినేటర్ పనిచేస్తున్నారు. వీరు ఆయా ఆస్పత్రులకు వచ్చిన రోగులకు రోజూ రిజిస్ట్రేషన్ చేసి త్వరితగతిన శస్త్రచికిత్సలు జరిగేలా చూడాలి. అదే«విధంగా ఇన్పేషెంట్లుగా ఉన్న రోగుల వద్దకు రోజూ వెళ్లి వారికి అందుతున్న వైద్య సేవలు, భోజనం గురించి ఆరా తీయాలి. రోగులు ఏమైనా సమస్యలు చెబితే వాటిని పరష్కరించాలి. రోగులు వైద్యం కోసం పెట్టిన ఖర్చును ఆస్పత్రుల యాజమాన్యం నుంచి తీసుకుని అందజేయాలి. ఇవేవీ ప్రస్తుత సిబ్బంది చేపట్టడంలేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్ కె.అజయ్సాయిరాం వద్ద సాక్షి ప్రస్తావించగా రోగి సూర్యానారాయణకు డబ్బులు పూర్తి స్థాయిలో ఇవ్వని విషయం తన దష్టికి వచ్చిందని, సమస్య పరిష్కరిస్తానని తెలిపారు.