breaking news
Nizamabad Additional SP
-
పొద్దుటూరికి పెద్ద పదవి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రెండేళ్ల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు జిల్లాకు పెద్ద పదవి వరించింది. బోధన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డికి పూర్తిస్థాయి కేబినెట్ హో దాతో కూడిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిని కేటాయించారు. రాష్ట్రంలో అన్ని ప్రధాన ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరును సమీక్షించేలా ఆయనను ఈ పదవిలో నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్త ర్వులు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇందుకు సంబంధించిన ఆదేశాలు పంపించారు. మంత్రి అనే ఒక్క మాటే లేదు కానీ, మంత్రికి ఉన్న అన్ని అధికారాలను సుదర్శన్‌రెడ్డికి కట్టబెట్టారు. సచివాలయంలో మంత్రుల గదులతో సమానంగా చాంబర్‌ను కేటాయించనున్నారు. ఆ విభాగంలో ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇద్దరు సెక్రటరీలను ప్ర భుత్వం నియమించనుంది. ఇక ముఖ్యంగా అన్ని కేబినెట్ సమావేశాలకు సుదర్శన్‌రెడ్డిని ప్రత్యేక ఆ హ్వానితుడిగా హాజరయ్యేలా ఉత్తర్వులు ఇచ్చారు. అన్నిరకాల సంక్షేమ, అభివృద్ధి పనులకు సంబంధించి పర్యవేక్షణ చేయడంతో పాటు సమీక్ష చేసి ఆ యా వివరాలను కేబినెట్‌కు పంపే అధికారం కల్పించారు. సుదర్శన్‌రెడ్డికి ఈ పదవి కేటాయించడంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాజకీయంగా చైతన్యమైన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు గత రెండేళ్లుగా కేబినెట్ బెర్త్ కేటాయించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయ్యింది. ఉ మ్మడి జిల్లా చరిత్రలో గత కొన్ని దశాబ్దాలుగా మంత్రి లేకుండా ఉన్న పరిస్థితి లేదు. కాంగ్రెస్ నాయ కులు, కార్యకర్తలు సైతం తీవ్ర అసహనానికి లోనవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో సుదర్శన్‌రెడ్డికి ద క్కిన ఈ పదవితో ఊరట చెందుతున్నారు. ఇకమీ దట జిల్లాలో అభివృద్ధి పనులు మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం లభించిందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. జిల్లాలో ఇప్పటివర కు అనధికారిక మంత్రిగా ఉన్న సుదర్శన్‌రెడ్డికి తా జా పదవితో ప్రజలకు మరిన్ని సేవలు అందించే అ వకాశం కలిగిందంటున్నారు. ఇదిలా ఉండగా ఉమ్మడి జిల్లా నుంచి మొదలైన రాజకీయ సంచలనాలు రాష్ట్రంలో పెనుమార్పులు కలిగించిన చరిత్ర కళ్లముందే కనిపిస్తుంది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలి పించడం, మొదట్లో బీ ఆర్ఎస్కు జిల్లా ప్ర జాపరిషత్లో విజయాన్ని ఇచ్చి రాష్ట్ర సాధనకు పునాది వేయడం సంచలనం అయ్యింది. అదే విధంగా రానురాను జిల్లాలో బీజే పీ ప్రాబల్యం పెరుగుతుండడం, వరుసగా రెండుసార్లు ఎంపీగా అర్వింద్ విజయం, ఉమ్మడి జిల్లాలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలుపొందడం, కామారెడ్డిలో ఏకంగా కేసీఆర్, రేవంత్రెడ్డిలనే ఓడించి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డిని గెలిపించడం.. తదితర రాజకీయ మలుపులకు ఉమ్మడి జిల్లా వేదికగా నిలిచింది. ఇంతటి పెనుమార్పులకు కారణమయ్యే జిల్లాలో రెండేళ్లుగా మంత్రి లేకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజాగా సుదర్శన్‌రెడ్డికి కీలకమైన ఈ పదవి దక్కడంతో ఊరట నిచ్చిందని చెబుతున్నారు. అజహరుద్దీన్‌కు మంత్రిగా అవకాశం కలి్పంచిన నేపథ్యంలో సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి కేటాయింపుపై జిల్లాలో తీవ్రంగా చర్చలు చోటుచేసుకున్నా యి. రాజకీయ వర్గాలే కాకుండా సాధారణ ప్రజల్లో నూ ఈ అంశం నానింది. అజహరుద్దీన్‌కు మంత్రి పదవి కేటాయించడంతో ఇక జిల్లాకు మంత్రి పదవి రానట్లేనని పలువురిలో తీవ్ర అసహనం వ్యక్తమయ్యింది. ఈ నేపథ్యంలో సుదర్శన్‌రెడ్డికి కీలకమైన పదవి కేటాయించడంతో భారీ ఓదార్పు నిచ్చింది.శుభాకాంక్షలు తెలిపిన మహేశ్‌కుమార్ గౌడ్సాక్షిప్రతినిధి,నిజామాబాద్: ప్రజల్లో, రాజకీయా ల్లో మంచి పట్టున్న సీనియర్ నాయకుడు, బో ధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. మంచి అనుభవం ఉన్న వ్యక్తిని ప్రభుత్వ సంక్షే మ, అభివృద్ధి పథకాలపై సలహాదారుడిగా ని యమించడంతో పథకాల అమలు మరింత వే గంగా జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. అవకాశం కలి్పంచిన సీఎం రేవంత్‌రెడ్డి, డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు, కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
తాండూరు ఏఎస్పీ చందనదీప్తికి పదోన్నతి
♦ నిజామాబాద్ అడిషినల్ ఎస్పీగా నియామకం ♦ యేడాదిన్నర పాటు పనిచేసిన ఏఎస్పీ ♦ ట్రాఫిక్ నియంత్రణ, షీ టీములతో మహిళల భద్రతకు కృషి తాండూరు: తాండూరు ఏఎస్పీ చందనదీప్తికి పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన చందనదీప్తిని నిజామాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ(ఓఎస్డీ)గా నియమితులయ్యారు. తాండూరు ఏఎస్పీగా 2015 ఫిబ్రవరిలో ఆమె బాద్యతలు చేపట్టారు. ఏడాదిన్నర కాలం పాటు ఇక్కడ పనిచేశారు. ఆ సమయంలో తాండూరు పరిధిలో షీ టీం ద్వారా మహిళలకు భద్రత కల్పించారు. తాండూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణను పటిష్టం చేశారు. డివిజన్ పరిధిలో నేరాల సంఖ్య తగ్గించేందుకు కృషి చేశారు. రెండు రోజుల్లో ఆమె నిజామాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నారు.


