breaking news
Nithari killings
-
నిఠారీ హత్యలు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: దేశ్యవ్యాప్తంగా చర్చనీయాశమైన నిఠారీ హత్యల కేసులో అలహాబాద్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిఠారీ హత్య కేసులో దోషులుగా తేలిన అన్ని కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించింది.ముఖ్యంగా సురీందర్ కోలికి మరణశిక్షను కూడా అలహాబాద్ హైకోర్టు కోర్టు రద్దు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురీందర్ కోలీపై ఉన్న 12 కేసుల్లో నిర్దోషిగా తేల్చింది. అలాగే మరో నిందితుడు వ్యాపారవేత్త మోనీందర్ సింగ్ పంధేర్‌పై ఉన్న రెండు కేసుల్లోనూ నిర్దోషి అని కోర్టు సోమవారం నిర్ధారించింది. అత్యాచారం, హత్య ఆరోపణలపై దోషులుగా తేల్చిన ఘజియాబాద్‌లోని సీబీఐ కోర్టు విధించిన మరణశిక్షను సవాలు చేస్తూ కోలీ, పంధేర్‌లు దాఖలు చేసిన అప్పీళ్లను జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్హెచ్ఏ రిజ్వీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది. అయితే ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందంటూ డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు చెప్పింది. అలహాబాద్ హైకోర్టు మోనీందర్ సింగ్ పందేర్‌పై మొత్తం 6 కేసులు ఉండగా, అన్నింటిలోనూ నిర్దోషిగా కోర్టు తేల్చిందని మోనీందర్ సింగ్ పంధేర్ తరపు న్యాయవాది మనీషా భండారీ వెల్లడించారు. 2006లో నోయిడాలోని నిథారీ ప్రాంతంలో మధ్య మోనీందర్ సింగ్ పంధేర్ ఇంటిలో వరుస హత్యలు కలకలం రేపాయి. 2006, డిసెంబరు 29న నోయిడాలోని నిథారీలోని పంధేర్ ఇంటి వెనుక ఉన్న కాలువలో ఎనిమిది మంది చిన్నారుల అస్థిపంజర అవశేషాలు కనిపించడంతో ఈ సంచల హత్యలు వెలుగులోకి వచ్చాయి. సురీందర్, పంధేర్ ఇంట్లో పనిమనిషిగా ఉండేవాడు. ఈ సందర్భంగా పిల్లలను మిఠాయిలు, చాక్లెట్లతో మభ్య పెట్టి ఇంట్లోకి రప్పించేవాడు. ఆ తరువాత పంధేర్వారిపై అత్యాచారం చేసి హత్య చేశాడనేది ప్రధాన ఆరోపణ. బాధితుల్లో ఎక్కువ భాగం ఆ ప్రాంతం నుండి తప్పిపోయిన పేద పిల్లలు, యువతులవిగా గుర్తించారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు పిల్లల మృతదేహాలను నరికి, ఆ భాగాలను కాలువల్లో పడవేసేవారనీ సీబీఐ అభియోగాలు మోపింది. అంతేకాకుండా నరమాంస భక్షక ఆరోపణలు కూడా చేసింది. 2007లో పంధేర్, కోలీలపై సీబీఐ 19 కేసులు నమోదు చేసింది. అయితే 19 కేసుల్లో మూడింటిని తొలగించిన సీబీఐ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. కాగా సురేంద్ర కోలీపై బాలికలపై అనేక అత్యాచారాలు , హత్యలకు పాల్పడి దాదాపు 10 కంటే ఎక్కువ కేసులలో మరణశిక్ష విధించాయి కోర్టులు. జూలై 2017లో, 20 ఏళ్ల మహిళ పింకీ సర్కార్ హత్య కేసులో స్పెషల్ CBI కోర్టు పంధేర్, కోలీలను దోషులుగా నిర్ధారించి, మరణశిక్ష విధించింది. దీన్ని అలహాబాద్ హైకోర్టుకూడా సమర్ధించింది. అయితే, కోలీ క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయంలో జాప్యంకారణంగా దీన్ని జీవిత ఖైదుగా మార్చింది. ఈ నిఠారీ హత్యల్లో మరో బాధితురాలు 14 ఏళ్ల రింపా హల్దార్ హత్య, అత్యాచారానికి సంబంధించి 2009లో సాక్ష్యాలు లేకపోవడంతో పంధేర్‌ను నిర్దోషిగా ప్రకటించింది. #WATCH | Manisha Bhandari, lawyer of Nithari case convict Moninder Singh Pandher, in Prayagraj, Uttar Pradesh "Allahabad High Court has acquitted Moninder Singh Pandher in the two appeals against him. There were a total of 6 cases against him. Koli has been acquitted in all… pic.twitter.com/BYQHeu3xvz — ANI UP/Uttarakhand (@ANINewsUP) October 16, 2023 -
సీరియల్ రేపిస్ట్‌కు మరణశిక్ష
ఘజియాబాద్(ఉత్తరప్రదేశ్): దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిథారి సీరియల్ రేపిస్ట్‌తోపాటు అతని సహాయకుడికి సీబీఐ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. పింకీ సర్కార్ హత్య కేసులో వీరికి శిక్ష ఖరారు చేసింది. సోమవారం ఈ కేసును విచారించిన స్పెషల్ జడ్జి పవన్ కుమార్ త్రిపాఠి నేరస్తులకు మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఆరు కేసుల్లో ఇప్పటికే వీరికి శిక్ష పడింది. మరో 9 కేసులు కోర్టు విచారణల్లో ఉన్నాయి. 2006లో ఓ మహిళ అదృశ్యం కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టగా విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. అక్టోబర్ 5వ తేదీన నోయిడాలోని నిథారి గ్రామంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను వ్యాపార వేత్త మొహిందర్ సింగ్ త్రిపాఠి పనిమనిషి సురేందర్ కోలి లోపలికి పిలిచాడు. అనంతరం యజమానితో కలిసి ఆమెపై అత్యాచారం చేయటంతోపాటు తలనరికి ఇంటి వెనుక పడేశారు. ఇదే విధంగా పలువురు చిన్నారులు, మహిళలపై దారుణాలు జరిపారు. మహిళ అదృశ్యం కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొహిందర్ సింగ్ ఇంట్లో సోదాలు జరపగా 16మందికి సంబంధించిన ఎముకలు, కపాలాలు కనిపించాయి. ఇందులో ఎక్కువగా చిన్నారులకు సంబంధించినవే ఉండటం గమనార్హం. ఈ దారుణం అప్పట్లో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించగా అదే సంవత్సరం డిసెంబర్ 29వ తేదీన కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపింది. ఈ మేరకు వీరిద్దరిపై పలు కేసులు నమోదయ్యాయి. -
అతనికి ఉరి తప్పదా?
న్యూఢిల్లీ: సంచలన నిఠారి హత్యకేసులో దోషి సురేందర్ కోలికి మరణశిక్షను తగ్గిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీనికి సంబంధించి ముద్దాయి సురేందర్ కొలికి ఉన్నత న్యాయస్థానం సోమవారం నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యల కేసులో సురేందర్ కోలికి, మరొకరికి ఉరి తప్పదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ కేసులో ప్రధాన ముద్దాయి సురేందర్ కోలీ, అతనికి సహకరించిన మణీందర్ సింగ్ పంథర్లకు 2006లో ఘజియాబాద్ సిబీఐ ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే తనకు క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా పెట్టుకున్న మెర్సీ పిటిషన్ రాష్ట్రపతి తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ముద్దాయి సురేందర్ కోలి మరణశిక్షను వ్యతిరేకిస్తూ అలహాబాద్ హైకోర్టులో పియూడీర్ అనే స్వచ్ఛంద సంస్థ పిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు కు ఇది విరుద్ధమని వాదించింది. దీనికి స్పందించిన కోర్టు మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ తీర్పుచెప్పింది. కాగా ఢిల్లీ సమీపంలోని నోయిడా శివార్లలోని నిఠారీ గ్రామంలో ఈ హత్యలు జరిగాయి. ఈ కేసుల్లో భాగంగా ఒక బాలిక కేసులో మాత్రమే ఘజియాబాద్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేందర్ సింగ్ కోలీ నేరాన్ని అంగీకరిస్తూ వాంగ్మూలం ఇచ్చిన విషయం తెల్సిందే.