breaking news
new visa rules
-
కొత్త రకాల వీసాలను ప్రకటించిన యూఏఈ
ప్రపంచ ప్రతిభను ఆకర్షించడానికి, పర్యాటకాన్ని పెంచడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించింది. రెసిడెన్సీ వ్యవస్థలోనూ మార్పులు చేసింది. వీటిలో ఏఐ, ఎంటర్టైన్మెంట్, ఈవెంట్, క్రూయిజ్ టూరిజం కోసం నాలుగు కొత్త వీసా (New Visa) కేటగిరీలు ఉన్నాయి.అంతే కాకుండా, వ్యాపార, ట్రక్ డ్రైవర్ వీసాలకు సంబంధించి కూడా మార్పులు చేశారు. మానవతా సహాయం, వితంతువులు, విడాకులు తీసుకున్న వారు, నివాసితుల బంధువులు, స్నేహితులకు కూడా రెసిడెన్సీ అవకాశం కల్పిస్తున్నారు.నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలు ఇవే..ఏఐ స్పెషలిస్ట్ వీసా: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోని నిపుణుల కోసం ఉద్దేశించినది. ఇందు కోసం టెక్ ఫోకస్డ్ కంపెనీ నుంచి స్పాన్సర్ షిప్ అవసరం అవుతుంది. ఒకటి లేదా ఎక్కువ ఎంట్రీలకు అనుమతి ఉంటుంది.ఎంటర్టైన్మెంట్ వీసా: కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ సెక్టార్ లోని వ్యక్తుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన వీసా ఇది. విశ్రాంతి లేదా ప్రదర్శన నిమిత్తం వచ్చే ప్రముఖులకు దీన్ని కేటాయిస్తారు.ఈవెంట్ వీసా: పండుగలు, ఎగ్జిబిషన్లు, కాన్ఫరెన్సులకు హాజరయ్యేవారికి ఈ ఈవెంట్ వీసాలు జారీ చేస్తారు. అయితే వీటిని ఈవెంట్ నిర్వాహకులచే స్పాన్సర్ చేయాలి.క్రూయిజ్ టూరిజం వీసా: క్రూయిజ్ ట్రావెలర్లకు మల్టిపుల్ ఎంట్రీ వీసా ఇది. లైసెన్స్ పొందిన మారిటైమ్ సంస్థల ద్వారా స్పాన్సర్ చేస్తారు.రెసిడెన్సీ, ఇతర వీసా అప్డేట్లుహ్యుమానిటేరియన్ రెసిడెన్స్ పర్మిట్: సంక్షోభ పరిస్థితుల నుంచి వచ్చే వ్యక్తులకు ఒక సంవత్సరం పునరుద్ధరించతగిన వీసా.స్నేహితులు, బంధువుల కోసం విజిట్ వీసా: నివాసితులు తమ బంధువులకు దీన్ని స్పాన్సర్ చేయవచ్చు.ట్రక్ డ్రైవర్ వీసా: లాజిస్టిక్స్ లో కార్మిక కొరతను పరిష్కరించే వీసా. లైసెన్స్ పొందిన కంపెనీల ద్వారా స్పాన్సర్ షిప్ అవసరం అవుతుంది.వితంతువులు, విడాకులకు రెసిడెన్సీ: నిర్వచించిన పరిస్థితులలో ఒక సంవత్సరం పునరుద్ధరణ అనుమతి.బిజినెస్ ఎక్స్ ప్లోరేషన్ వీసా: బిజినెస్ ప్రారంభించేందుకు వచ్చే ఆర్థిక సాల్వెన్సీ రుజువు ఉన్న వ్యాపారవేత్తలకు జారీ చేస్తారు. -
ఇక చాలు దయచేయండి.. విదేశీ విద్యార్థులపై ట్రంప్ మరో పిడుగు
వాషింగ్టన్: అమెరికాలో చదువుల కోసం ప్రయత్నిస్తున్న, అగ్రరాజ్యంలో ఉంటున్న విదేశీ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఇప్పటికే వీసాల జారీకి ‘సోషల్ మీడియా వెట్టింగ్’ను కఠినంగా అమలుచేస్తోన్న అగ్రరాజ్యం.. తాజాగా విద్యార్థుల వీసా నిబంధనల్లో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఫలితంగా ఇకపై విదేశీ విద్యార్థులు నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండకుండా వీసా నిబంధనల్లో మార్పులు చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.1978 నుండి అందుబాటులో ఉన్న ఎఫ్-1 వీసా ఉన్న విద్యార్థులు “డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్” ఆధారంగా అమెరికాలో ఉండే అవకాశం ఉండేది. అంటే వారు పూర్తి కాలం చదువుతున్నంత కాలం ఉండొచ్చు. అంటే ఒక కోర్స్ పూర్తయిన మరో కోర్సులో చేరి అక్కడే ఉండొచ్చు. కానీ కొత్త ప్రతిపాదనల ప్రకారం.. విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసిన తర్వాత వారి సొంత దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం గరిష్టంగా నాలుగేళ్ల గడువు విధించింది. ఒకవేళ నాలుగేళ్ల తర్వాత కూడా అమెరికాలో ఉండాలనుకుంటే విద్యార్థులు డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ద్వారా పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేయాలి.ఎఫ్-1 విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్న తర్వాత మరో వీసా కోసం ప్రయత్నించాలనుకుంటే.. ఆ గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 30 రోజులకు కుదించారు.ఈ మార్పులు అమల్లోకి వస్తే భారతీయ విద్యార్థులపై అధిక ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 3.3 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికా వర్సిటీల్లో చదువుకుంటున్నారు. -
ఆరు ముస్లిం దేశాలకు అమెరికా కొత్త రూల్స్
వాషింగ్టన్ : ట్రావెల్ బ్యాన్‌కు అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఓకే చెప్పిన అనంతరం ఆరు ముస్లిం దేశాల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వీసా నిబంధనలు తీసుకొచ్చారు. అమెరికాలోని వ్యాపారాలు లేదా కుటుంబాలతో సంబంధమున్న శరణార్థులందర్ని, ముఖ్యంగా ఆ ఆరు ముస్లిం దేశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలు తీసుకొచ్చినట్టు ట్రంప్ కార్యాలయం బుధవారం పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పటికే జారీచేసిన వీసాలు రద్దు చేయబడవని స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. కానీ సిరియా, సుడాన్, సోమాలియా, లిబియా, ఇరాన్, యెమెన్ ప్రాంతాల నుంచి అప్లయ్ చేసుకునే కొత్త వీసాదారులకు మాత్రం ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. వారు కచ్చితంగా ఇప్పటికే అమెరికాలో ఉన్న తల్లిదండ్రులతో, పిల్లలతో, భాగస్వామితో, అల్లుడు, కోడలు లేదా ఇతర తోబుట్టువులతో ఉన్న సంబంధాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. అంతేకాక అన్ని దేశాల శరణార్థులకు ఇవి వర్తిస్తాయని, కొన్ని సడలింపులతో వీటిని తీసుకొచ్చినట్టు వెల్లడించింది. తాతలు, మునిమనవళ్లు, సోదరుడు, సోదరీమణులు, కాబోయే భర్తలు,ఆంటీ, అంకుల్స్, కజిన్స్ వంటి ఇతర కుటుంబ సభ్యుల విషయంలో సన్నిహిత సంబంధాలను పరిగణలోకి తీసుకోమని స్టేట్ డిపార్ట్మెంట్ తన గైడ్ లైన్సులో పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికాలోని అన్ని డిపార్ట్మెంట్లకు వీటిని పంపించడం జరిగింది. వ్యాపారస్తులకు లేదా నిపుణులకు అమెరికాతో సంబంధాలున్నాయని, వాటన్నింటిన్నీ పరిగణలోకి తీసుకొని ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్టు స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. జర్నలిస్టులు, విద్యార్థులు, వర్కర్లు, లెక్చరర్లు సరియైన ఆహ్వానంతో వస్తే, లేదా ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్‌తో అమెరికాను సందర్శించాల్సి వస్తే, ట్రావెల్ బ్యాన్ నుంచి వారిని మినహాయిస్తున్నట్టు వెల్లడించింది. వ్యాపారాలు లేదా నిపుణులకు ఉన్న సంబంధాలను పరిగణలోకి తీసుకొని, వారు ట్రావెల్ బ్యాన్ నుంచి తప్పించుకోవడానికి చట్టబద్ధమైన సంబంధాన్ని అధికారికంగా, డాక్యుమెంట్ రూపంలో నిరూపించుకోవాలని స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. జర్నలిస్టులు, విద్యార్థులు, వర్కర్లు, లెక్చరర్లు సరియైన ఆహ్వానంతో వస్తే, లేదా ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్‌తో అమెరికాను సందర్శించాల్సి వస్తే, ట్రావెల్ బ్యాన్ నుంచి వారిని మినహాయిస్తున్నట్టు వెల్లడించింది. అయితే ఈ మినహాయింపు కావాలని నిబంధనలు తప్పించుకోవాలనుకుని, అమెరికన్ వ్యాపారాలతో లేదా విద్యాసంస్థలతో సంబంధాలు కోరుకునే వారికి వర్తించవని తేల్చిచెప్పింది. డొనాల్డ్ ట్రంప్ గతంలో జారీచేసిన ఆరు ముస్లిం దేశాలపై తాత్కాలిక ట్రావెల్ బ్యాన్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయం కోర్టుల వరకు వెళ్లింది. ట్రంప్ జారీచేసిన ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై కింద కోర్టులు అభ్యంతరం చెప్పగా, సుప్రీంకోర్టు మాత్రం ఓకే చెప్పింది.


