breaking news
new planning
-
పెట్టుబడుల నిర్వహణకు సామ్కో సీఆర్పీ ప్లాట్‌ఫాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రోకరేజి సంస్థ సామ్కో కొత్త తరం క్యాపిటల్ రిసోర్స్ ప్లానింగ్ (సీఆర్పీ) ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. ప్రామాణిక సూచీల స్థాయిలో రాబడులను అందుకునేలా ఇన్వెస్టర్లు సులువుగా తమ పెట్టుబడులను నిర్వహించుకునేందుకు, ట్రేడింగ్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ వ్యవస్థాపకుడు జిమీత్ మోదీ తెలిపారు. ఇటు తమ పెట్టుబడులపై రాబడులను, అటు ప్రామాణిక సూచీలపై రాబడులను రియల్ టైమ్‌లో ట్రాక్ చేసుకునేలా స్వంతంగా ఒక వ్యక్తిగత సూచీని ఏర్పాటు చేసుకునేందుకు కూడా ఇందులో సౌలభ్యం ఉంటుందని ఆయన పేర్కొ న్నారు. మరోవైపు, 67 శాతం మంది ఇన్వెస్టర్లు .. ప్రామాణిక సూచీల స్థాయిలో రాబడులు అందుకోలేకపోతున్నారని తాము నిర్వహించిన సర్వేలో వెల్లడైందని మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో దేశీ ఇన్వెస్టర్లు, ట్రేడర్లలో సూచీలను మించి రాబడులను అందుకునే ధోరణులను పెంపొందించేందుకు ’మిషన్ – ఏస్ ది ఇండెక్స్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. -
'మూసీ నది ప్రక్షాళనకు ప్రత్యేక ప్రణాళికలు'
హైదరాబాద్ : మూసీ నది ప్రక్షాళనకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలంగాణ ఐటీ, పంచాయతీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ క్లీనింగ్ కోసం కొత్త యంత్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రూ. 500 కోట్లతో హుస్సేన్ సాగర్‌ను మంచినీటి సరుస్సుగా మారుస్తామని తెలిపారు.