ఎస్ బ్యాంక్  కొత్త నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్
                  
	
	న్యూఢిల్లీ:  ప్రముఖ  ప్రయివేటు  రంగ బ్యాంక్ ఎస్ బ్యాంక్   కొత్త నియామకాన్ని చేపట్టింది.  ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి, కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఛైర్మన్ అశోక్చావ్లా ను పార్ట్ టైమ్ నాన్ ఎగ్జిక్యూటివ్ గానియమించింది.  ఇప్పటికే   బోర్డు లో నాన్ ఎగ్జిక్యూటివ్  డైరెక్టర్ గా  ఉన్న చావ్లా నియామాకంపై ముందుగా రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)  ఆమోదము పొందింది.  అనంతరం  అక్టోబర్ 30న ఆయన బాధ్యతలు  స్వీకరించారు. తాత్కాలిక ఛైర్పర్సన్గా వ్యవహరిస్తున్న రాధాసింగ్ పదవీకాలం శనివారంతో ముగియడంతో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు   బీఎస్ ఈ ఫైలింగ్ లో తెలిపింది. మూడేళ్లపాటు  చావ్లా ఈ పదవిలో కొనసాగునున్నారని పేర్కొంది.
	 కాగా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఉన్న చావ్లా ఈ ఏడాది మార్చిలోనే యస్ బ్యాంకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులైన సంగతి తెలిసిందే.