breaking news
Nenu Naa Prema Katha
-
ప్రేమజంట ముచ్చట్లు
మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆ యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అనుకోకుండా అతని జీవితంలోకి ఓ యువతి వస్తుంది. ఆమెతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీస్తుంది. ఈ ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘నేను నా ప్రేమకథ’. దత్తాత్రేయ ఎంటర్టైన్మెంట్స్, శాస్త మీడియాపై వర్మ, పణుకు రమేశ్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. వింగ్ కమాండర్ కేఎన్ రావు సమర్పకులు. చిన్ని చరణ్, మిధున్ ఎం.ఎస్. స్వరపరచిన ఈ చిత్రం పాటలను సి. కల్యాణ్ ఆవిష్కరించారు. వర్మ తనకు మంచి మిత్రుడని, తన తమ్ముణ్ణి హీరోగా చూడాలనే కోరిక అతనికి ఈ చిత్రం ద్వారా నెరవేరిందని, ఈ సినిమా విజయం సాధించాలని సి. కల్యాణ్ ఆకాంక్షించారు. అన్ని పాటలూ బాగా వచ్చాయని చిన్ని చరణ్ తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘మంచి కథ, చక్కని పాటలతో ఈ సినిమా అన్ని వర్గాలవారినీ అలరించే విధంగా ఉంటుంది. ఓ ప్రేమ జంట ముచ్చట్లు, వారి కోపతాపాల సమాహారంతో ఈ కథ నడుస్తుంది’’ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీయాలనుకుంటున్నామని కేఎన్ రావు తెలిపారు. శేఖర్, సుష్మా జంటగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: నగేష్ ఆచార్య. -
మధ్యతరగతి కుర్రాడి ప్రేమకథ
ఆ యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అనుకోకుండా అతని జీవితంలోకి ఓ యువతి వస్తుంది. ఆ తర్వాత అతని జీవితంలో చోటుచేసుకున్న మార్పులేంటి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘నేనూ... నా ప్రేమకథ’. వర్ధన్ దర్శకత్వంలో దత్తాత్రేయ ఎంటర్టైన్మెంట్స్, శాస్త మీడియాపై వర్మ, పనుకు రమేష్‌బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్, సుష్మా హీరో, హీరోయిన్లు. వింగ్ కమాండర్ కేఎన్ రావు సమర్పకుడు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమకథ ఉంటుంది. కొందరు పెళ్లికి ముందు ప్రేమించుకుంటారు. పెళ్లి తర్వాత ప్రేమ రుచిని ఆస్వాదిస్తారు కొంతమంది. మాది పెళ్లికి ముందు జరిగే ప్రేమకథ. ప్రేమికుల ముచ్చట్లు, కోపతాపాలతో సినిమా సాగుతుంది. తమ మధ్య ఏర్పడిన మనస్పర్థలను హీరో, హీరోయిన్ ఎలా పరిష్కరించుకున్నారనేది ప్రధానాంశం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: చిన్ని చరణ్, మిధున్ ఎం.ఎస్., కెమెరా: నగేష్ ఆచార్య.