breaking news
Nayanthara Secret Marriage
-
నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అదే.. విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్
లేడీ సూపర్ స్టార్ అంటే సినీ ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. అంతలా పేరు సంపాదించుకుంది కోలీవుడ్ భామ నయనతార. దక్షిణాది సినిమాల్లో నటిస్తూ తన కెరీర్లో ఎన్నో ఒడుదొడుకులను అధిగమించి నిలదొక్కుకుంది. టాలీవుడ్లో డబ్బింగ్ సినిమా 'చంద్రముఖి'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పూర్తి హీరోయిన్గా వెంకటేశ్‌తో కలిసి నటించిన చిత్రం 'లక్ష్మీ'. ఆ సినిమా హిట్ కావడంతో టాలీవుడ్లో వరుస అవకాశాలొచ్చాయి. నయనతార అసలు పేరు డయానా మరియమ్ కురియన్ అలియాస్. కేరళలోని తిరువల్లాకు చెందిన నయన్ బాల్యమంతా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో గడిచింది. సినిమా కథలో ట్విస్ట్‌ల లాగే ఆమె జీవితం కూడా ఎన్నో మలుపులు తిరిగింది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది కోలీవుడ్ తార. ఈ తరం హీరోయిన్లలో దక్షిణాదిన అత్యధిక చిత్రాల్లో నటించిన ఘనత కూడా ఆమెదే. ఓవైపు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే కథానాయిక ప్రధాన్యమున్న సినిమాలతో ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించారు. (చదవండి: ఆ హీరోతో తొలిసారి కలిసి నటించనున్న నయనతార) ప్రేమ-పెళ్లి: ‘నానుమ్ రౌడీ ధాన్’ (2015) అనే సినిమాతో దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారి ఒక్కటైంది ఈ జంట. ఇటీవలే నయన్ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఇవాళ నయనతార పుట్టిన రోజు సందర్భంగా ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. భార్యకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఈ పుట్టినరోజు మాకు ఎంతో ప్రత్యేకమైంది. చిరస్మరణీయమైంది. ఎందుకంటే మేం భార్య, భర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభించాం. అలాగే ఇద్దరు పిల్లలకు తల్లితండ్రులయ్యాం. ఆమె ఆత్మవిశ్వాసం, అంకితభావం, జీవితం పట్ల నిజాయితీ, చిత్తశుద్ధి నుంచి నేను ప్రేరణ పొందా. ఆమెను ఒక తల్లిగా చూడడం నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. ప్రస్తుతం తనను మేకప్ వేసుకోకుండా ఇంత అందంగా ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. ప్రస్తుతం పిల్లలు ముద్దు పెట్టుకుంటారనే నువ్వు మేకప్ వేసుకోవడం లేదు. నీ ముఖంలో అందం, చిరునవ్వు ఇలాగే శాశ్వతంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. రాబోయే పుట్టినరోజులు మరింత సంతోషంగా ఉండాలనేదే నా ఆశ. దేవుని అశీర్వాదాలతో మన జీవితం మరింత అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా. ఇప్పటికీ, ఎప్పటికీ నా ప్రియమైన పొండాయాటి(ముద్దుపేరు), పిల్లలను(ఉయిర్, ఉలగం) ప్రేమిస్తూనే ఉంటా.' అంటూ జీవితంలో గుర్తుండిపోయేలా ప్రత్యేక విషెష్ తెలిపారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
పెళ్లి చేసుకున్నారా?
-
Nayanthara: ఆయనే మా ఆయన!
‘‘రహస్యంగా పెళ్లి చేసుకోను’’ అంటున్నారు నయనతార. విఘ్నేష్‌శివన్, నయనతారల పెళ్లి గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వస్తుంటుంది. కానీ ఇప్పటివరకు విఘ్నేష్‌శివన్, నయనతారలు తమ పెళ్లి గురించి బహిరంగంగా మాట్లాడింది లేదు. తొలిసారి పెదవి విప్పారు నయనతార. ఇటీవల ఓ తమిళ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి నయనతార మాట్లాడుతూ – ‘‘మా (విఘ్నేష్, నయన్) ఇద్దరి కుటుంబసభ్యుల సమక్షంలో మా నిశ్చితార్థం జరిగింది. పెద్దగా సంబరాలు చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే నిశ్చితార్థం జరుపుకున్నాం. మా వివాహ తేదీ ఇంకా ఖరారు కాలేదు. ముహూర్తం ఫిక్స్ అయిన వెంటనే నా ఫ్యాన్స్‌కి చెబుతాను. రహస్యంగా పెళ్లి చేసుకోను. వృత్తిపరంగా మా గోల్స్‌ను సాధించే పనిలో మేం బిజీగా ఉండటం వల్లే ఇప్పటివరకు పెళ్లి గురించి సరైన నిర్ణయం తీసుకోలేదు. విఘ్నేష్ నా బాయ్‌ఫ్రెండ్ స్టేజ్ దాటి పోయాడు. ఆయన నాకు కాబోయే భర్త. మీడియా కూడా ఇకపై వారి కథనాల్లో ఇలాగే రాస్తారని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
ఆ ఖుషీలో ఆంతర్యం అదేనా!
నయనతార గురించి మరోసారి కోలీవుడ్‌లో సంచలనం మొదలైంది. ఈ మలయాళ కుట్టికి ఆత్మస్థైర్యం అధికమేనని చెప్పక తప్పదు. రెండు సార్లు ప్రేమలో ఓడిపోయిన ఆమె నటిగా మాత్రం ఇప్పటి వరకు తన స్థానాన్ని పేరును కోల్పోలేదు. నేటి కీ సూర్య, కార్తీల నుంచి విజయసేతుపతి వరకు ప్రముఖ యువ నటులు అన్న బేధం లేకుండా అందరితోను నటిస్తున్నారు. కార్తీ సరసన త్వరలో కాష్మోరా చిత్రంలో నటించనున్నారు. ఇప్పటికే సూర్యతో మాస్ చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి అవ్వగానే ఎవరితోను మాట్లాడకుండా హోటల్‌కు చెక్కేసే నయనతార ఇప్పుడు చిత్ర సభ్యులతో సరదాగా మాట్లాడుతున్నారట. తన చిత్రాలు సక్సెస్ అయితే అందులో నటించిన ఇతర నటీనటులతో ఎంతో ఖుషీగా గడుపుతున్నారట. ఈ మార్పుకు కారణం ఏమిటి, నయనతార ఆంతర్యం ఏమిటి అన్న ఆరాతీస్తే ఆమె సన్నిహిత వర్గాలు తెలిపిన విషయం అమ్మడు నటి కుష్భు మాదిరిగానే త్వరలో తమిళ నటి కోడలు కానున్నారన్నది. అయితే ఆమెను పెళ్లాడే వ్యక్తి ఎవరన్న ప్రశ్నకు మాత్రం సమాధానం రాలేదు.