breaking news
Natural History Museum
-
లోగో గీస్తే.. బహుమతి మీదే
సాక్షి, విశాఖపట్నం: మీరు మంచి డిజైనరా.. లోగో డిజైన్లు అద్భుతంగా గీయగలరా.. అయితే మంచి లోగో గీయండి.. నగదు బహుమతి సొంతం చేసుకోండి.. అంటూ అద్భుతమైన అవకాశం ఇస్తోంది విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ. విశ్వాన్ని, విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఒకే ప్రాంతంలోకి తీసుకొచ్చేలా ఏపీ నేచురల్ హిస్టరీ పార్క్, మ్యూజియం అండ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కానుంది. దీనికి గతేడాది డిసెంబర్ 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. నగర శివారులోని కాపులుప్పాడలో ఈ పార్కును నిర్మించనున్నారు. పదిహేనెకరాల విస్తీర్ణంలో నేచురల్ హిస్టరీ పార్క్ రూపుదిద్దుకోనుంది. వీఎంఆర్డీఏ, నేచురల్ హిస్టరీ మ్యూజియం సొసైటీ సంయుక్తంగా ఈ పార్కును నిర్మించనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రూపొందించారు. రూ.88 కోట్లతో పార్కుని తీర్చిదిద్దాలని ప్రాథమిక అంచనా. ఈ పార్కు సందర్శకులకు వైజ్ఞానిక ఆనందంతో పాటు శాస్త్రీయ అవగాహన అందించాలనే లక్ష్యంతో రూపకల్పన చేశారు. లోగో రూపకల్పన పోటీలు కైలాసగిరిపై ఏర్పాటు చేయనున్న ప్లానిటోరియం భవన డిజైన్‌పై వీఎంఆర్డీఏ పోటీలు నిర్వహించగా దేశంలోని వివిధ నగరాల నుంచి మంచి స్పందన లభించింది. పదమూడు ఎంట్రీలు రాగా.. అందులో ఒకదాన్ని ఎంపిక చేసి.. అదే మోడల్‌కు నిపుణులతో మెరుగులు దిద్ది.. ప్లానిటోరియం బిల్డింగ్ మోడల్ని తీర్చిదిద్దారు. ఇప్పుడు అదే తరహాలో నేచురల్ హిస్టరీ పార్కు లోగో రూపకల్పన కోసం వీఎంఆర్డీఏ పోటీ నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్న పార్కుకు సృజనాత్మకంగా, అర్థవంతంగా లోగో తీర్చిదిద్దే ఔత్సాహికుల్ని ఆహ్వానిస్తోంది. డిజిటల్ రూపంలో లేదా డ్రాయింగ్ రూపంలో అందించాలని వీఎంఆర్డీఏ కమిషనర్ పి.కోటేశ్వరరావు కోరారు. మీ డిజైన్లను www.vmrda.gov.in కుపంపించవచ్చు. ఈ పోటీల్లో మొదటి విజేతకు రూ.50,000, రెండో విజేతకు రూ.25,000 బహుమతి అందించనున్నారు. మరిన్ని వివరాలకు 9866076922 నంబర్లో సంప్రదించాలని కమిషనర్ కోటేశ్వరరావు సూచించారు. -
పాము.. పురస్కారం..
నేచురల్ హిస్టరీ మ్యూజియం, బీబీసీవారు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్-2014లో మనోళ్లు తీసిన చిత్రాలూ అవార్డులను అందుకున్నాయి. ఈ ఫొటో చూడండి. సడన్‌గా చూస్తే.. ఏదో మొక్క అని అనుకుంటాం. సరిగ్గా చూస్తే.. పచ్చటి పరిసరాల్లో కలిసిపోయిన పచ్చ రంగు పాము మనకు కనిపిస్తుంది. ఈ ఫొటోను తీసిన ఎస్.ఎస్.రవిప్రకాశ్ కూడా తొలిసారి చూసినప్పుడు దీన్ని అలాగే అనుకున్నారట. కర్ణాటకలోని బెంగ ళూరుకు చెందిన రవిప్రకాశ్ తీసిన ఈ చిత్రం ఉభయచరాలు, సరీసృపాలు విభాగంలో విజేతగా నిలిచింది. తన తోటలోనే ఈ చిత్రాన్ని తీశానని.. ఈ పాములు తాము వేటాడే బల్లులు, కప్పలు వంటి వాటి కోసం ఇలా చాలాసేపు కదలకుండా బొమ్మలా ఉండిపోతాయని రవిప్రకాశ్ తెలిపారు. ఆ విషయాన్ని తెలియజెప్పేలా తానీ చిత్రాన్ని తీశానని చెప్పారు. -
గుడ్ మార్నింగ్..
ఉషోదయ వేళ.. పక్కనే సముద్రుడి ఘోష.. అయినా ఇవేమీ పట్టనట్లు కొన్ని బద్దకంగా బండ మీద దొర్లుతుంటే.. మరికొన్నిటికి ఇంకా తెలవారనే లేదు. సివంగులు తమ పిల్లలతో ఉన్న ఈ ఫొటోను అమెరికాకు చెందిన ఫొటో జర్నలిస్ట్ మైఖేల్ నిక్ నికోల్స్ తీశారు. ‘ద లాస్ట్ గ్రేట్ పిక్చర్’ పేరిట తీసిన ఈ చిత్రం నేచురల్ హిస్టరీ మ్యూజియం, బీబీసీ వారు కలసి నిర్వహించిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్-2014 గ్రాండ్ టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారంతోపాటు బ్లాక్ అండ్ వైట్ విభాగంలోనూ విజేతగా ఎన్నికైంది. మైఖేల్ ఈ చిత్రాన్ని టాంజానియాలోని సెరెన్గెటీ జాతీయ పార్కులో తీశారు. కొన్ని నెలలుగా తాను వాటి చుట్టూ తిరుగుతూ ఫొటోలు తీశానని.. అలాంటి సమయంలోనే ఈ అద్భుత చిత్రం చేజిక్కిందని నిక్ తెలిపారు.