breaking news
National trade unions
-
సమ్మె పట్టు తప్పుతోంది..!
పాల్గొనాలని కార్మిక సంఘాల ఇంటింటి ప్రచారం రుద్రంపూర్ (భద్రాద్రి కొత్తగూడెం): సింగరేణిలో సమ్మె ప్రభావం క్రమంగా తగ్గుతోంది. రోజురోజుకీ విధులకు హాజరయ్యే కార్మికుల శాతం పెరుగు తోంది. ఆదివారం ప్లేడేగా యాజమాన్యం ప్రకటించడంతో 53.09 శాతం మంది కార్మికులు విధులకు హాజరయ్యారు. ఆదివారం కొత్తగూడెం ఏరియాలో అధికారులు ఉత్తమ కార్మికులతో కలసి విధుల్లో పాల్గొనా లంటూ ప్రచారం నిర్వహించారు. ఇల్లెందు ఏరియాలో ఏఐటీయూసీ, సీఐ టీయూ నాయకులు కార్మికుల ఇళ్లకు వెళ్లి సమ్మెలో పాల్గొనాలని కోరారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికి వారసత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఈనెల 15 నుంచి సమ్మెలోకి దిగాయి. సగటు కన్నా పెరిగిన ఉత్పత్తి : సింగరేణి యాజమాన్యం సాక్షి, మంచిర్యాల: సింగరేణిలో సమ్మె ప్రభావం రోజురోజుకు తగ్గుతోందని, సెలవు దినమైన ఆదివారం కూడా సమ్మెపై కార్మికుల్లో స్పందన లేదని సింగరేణి యాజ మాన్యం తెలిపింది. సాధారణ హాజరుతో పోలిస్తే సెలవుదినమైన ఆదివారం 77 శాతం మంది కార్మికులు విధులకు హాజరయ్యారని వివరించారు. -
అరెస్టులు.. ఆందోళనలు
సింగరేణిలో మూడవరోజూ కొనసాగిన సమ్మె - సమ్మె ప్రభావం లేదన్న యాజమాన్యం - ఆదివారం ప్లేడే ప్రకటించిన సింగరేణి - 51 శాతం మంది కార్మికుల గైర్హాజరు రుద్రంపూర్ (భద్రాద్రి కొత్తగూడెం) /మంచిర్యాల: సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాలు చేపడుతున్న సమ్మె ఉద్రిక్తతలకు దారితీసింది. శుక్రవారం కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో కార్మిక సంఘాలు శనివారం సింగరేణి బంద్‌కు పిలుపు నిచ్చాయి. శనివారం సింగరేణి వ్యాప్తంగా కార్మిక ప్రాంతాల్లో బంద్ కొనసాగింది. జాతీయ సంఘాలైన ఐఎన్టీ యూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ ఇచ్చిన బంద్‌కు మద్దతుగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, బీజేపీ ఆందోళనకు దిగాయి. రాస్తారోకోలు, ధర్నాలు, ఆందోళనలు చేసిన కార్మిక సంఘాల నాయకులను, మద్దతు ప్రకటించిన పార్టీల నాయకుల ను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేష న్లకు తరలించారు. దీంతో ఆందోళ నలు, ఉద్రిక్తతల మధ్యనే మూడోరోజు సమ్మె కొనసాగింది. సింగరేణి వ్యాప్తంగా 51 శాతం మంది సమ్మెలో పాల్గొనగా 49 శాతం మంది విధులకు హాజరయ్యారు. ప్లేడే ప్రకటించిన యాజమాన్యం.. ఆదివారం కార్మికులు విధులు నిర్వ హించుకునేందుకు వీలుగా ప్లేడేను ప్రకటించింది. కార్మికులు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం కోరింది. ప్లేడే నిబంధ నల ప్రకారం ఆదివారం విధులు నిర్వ హించిన కార్మికులకు మస్టరు ఇవ్వడం తోపాటు ఒకరోజు సెలవు ఇవ్వనున్నట్లు తెలిపింది. సింగరేణిలో సమ్మె ప్రభావం నిల్.. సాధారణ హాజరుతో పోలిస్తే శనివారం 72 శాతం మంది కార్మికులు విధులకు హాజరైనట్లు యాజమాన్యం తెలిపింది. ఇక ఉత్పత్తిలోనూ 16 శాతం వృద్ధి సాధించి, 21 శాతం ఎక్కువగా బొగ్గు రవాణా చేసినట్లు పేర్కొంది. సమ్మె తొలిరోజైన 15వ తేదీన 1,72,262 టన్నులు, 16వ తేదీన 1,76,195 టన్నులు ఉత్పత్తి జరగ్గా, మూడోరోజైన 17వ తేదీ మొదటి షిఫ్టులో 58,355 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగినట్లు వివరించింది. మూడురోజుల కాలంలో హాజరు శాతం సైతం పెరుగుతూ వస్తోందని, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజువారీ కోటాకన్నా, సమ్మె రోజుల్లో ఎక్కువగానే బొగ్గు రవాణా చేయగలిగిందని పేర్కొంది. అరెస్ట్‌లు సరికాదు: బి.జనక్‌ప్రసాద్ గోదావరిఖని: సింగరేణి కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా కోల్‌బెల్ట్ బంద్‌లో పాల్గొన్న దాదాపు వెయ్యి మంది నాయకులు, కార్యకర్తల ను పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదని జాతీయ కార్మిక సంఘాల జేఏసీ కన్వీన ర్ బి.జనక్‌ప్రసాద్ తెలిపారు. సింగరేణి యాజమాన్యం మైనింగ్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నదని, కార్మికులు మద్యం సేవించి గనుల వద్దకు వస్తే వారిని అనుమతించని యాజమాన్యం, నేడు సమ్మె నేపథ్యంలో గనులు, ఓసీపీల వద్దనే మద్యం, విందు భోజనాలు ఏర్పాటు చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ కలసి ఎన్ని కుట్రలు పన్నినా సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొని వారసత్వ ఉద్యోగాల సాధన కోసం తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. -
ఉనికి కోసమే జాతీయ సంఘాల ఆరాటం
► టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య రామగిరి(సెంటినరీకాలనీ) : జాతీయ కార్మిక సంఘాలు ఉనికి కోసం ఆరాట పడుతున్నాయని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య అన్నారు. శుక్రవారం ఆర్జీ–3 డివిజన్ పంచ్‌ఎంట్రీలో ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లక్రితం జాతీయ సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగ హక్కును టీబీజీకేఎస్ యూని యన్ సాధించడంతో వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నార. అందుకే లేని పోని విమర్శలు చేస్తున్నారన్నారు. జాతీయ సంఘాలకు కార్మికులపై ప్రేమ ఉంటే వేజ్ బోర్డు లో మెరుగైన వేతనాల అమలుకు కృషి చేయాలన్నారు. దీపాళి బోనస్, మూడేళ్లకోసారి పెంచాల్సిన పెన్షన్ ఎందుకు పెంచలేకపోయారో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో వీఆర్ఎస్ కార్మికులకు యాజమాన్యంతో కుమ్మక్కై రూ. 2 లక్షలు ఇప్పించి కార్మికులను మోసం చేశారని ఆరోపించారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా టీబీజీకేఎస్ ఎన్నో హక్కులు సాధించిందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. అనంతరం యూనియన్ లో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు ముద్దసాని రఘువీర్‌రెడ్డి, నాగెల్లి సాంభయ్య, కొట్టె భూమయ్య, ఇస్సంపెల్లి రమేశ్, పర్శ బక్కయ్య, వేగోలపు మల్లయ్య, దేవ శ్రీనివాస్, బత్తుల రమేశ్, రౌతు రమేశ్, గాజుల తిరుపతి, వీవీగౌడ్, పుల్లెల కిరణ్, రాజేందర్, మల్లేశ్, గిటుకు శ్రీనివాస్, ఓదెలు పాల్గొన్నారు.