breaking news
national tourney
-
గోల్ఫ్‌లోనూ సత్తా చాటాడు
సాక్షి, ముంబయి : ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ గోల్ఫ్ క్రీడాకారుడిగానూ రాణిస్తున్నాడు. మెర్సిడెస్ ట్రోఫీ గోల్ఫ్ మీట్ నేషనల్స్‌కు మాధవన్ క్వాలిఫై అయ్యాడు. ఏప్రిల్ 4-6 తేదీల్లో పూణే ఆక్స్ఫర్డ్ గోల్ప్ రిసార్ట్‌లో జరిగే జాతీయ ఫైనల్స్‌లో మాధవన్ పోటీ పడనున్నాడు. గోల్ఫ్ నేషనల్ ఫైనల్స్‌లో పాల్గొనేందుకు తాను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని మాధవన్ సంతోషం వ్యక్తం చేశారు. ఫైనల్స్‌కు జరిగిన ఎంపికలో మాధవన్ 69.6 స్కోర్ సాధించి సత్తా చాటారు. నేటి ఫలితాల్లో 78 స్కోర్‌తో రోహన్ నిగం బెస్ట్ గ్రాస్ విన్నర్‌గా నిలిచాడు. -
తెలంగాణ జట్ల శుభారంభం
► జాతీయ సబ్-జూనియర్ సెపక్తక్రా టోర్నీ సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్-జూనియర్ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాల, బాలికల జట్లు శుభారంభం చేశాయి. విక్టరీ ప్లేగ్రౌండ్స్‌లోని ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన బాలుర ఈవెంట్లో రాష్ట్ర జట్టు (21-8, 21-6), (21-10, 21-11), (21-8, 21-8)తో కేరళపై గెలుపొందింది. బాలికల విభాగంలో తెలంగాణ జట్టు మొదట (18-21, 15-21), (21-16, 18-21, 21-10), (21-12, 21-7)తో ఢిల్లీపై నెగ్గింది. అనంతరం రెండో మ్యాచ్‌లో (11-21, 14-21), (21-17, 21-13), (21-8, 21-10)తో గోవాపై విజయం సాధించింది. మిగతా మ్యాచ్‌ల్లో ఒడిశా (21-17, 17-21, 16-21), (21-6, 21-8), (21-11, 21-4)తో గోవాపై, ఢిల్లీ (3-21, 2-21), (18-21, 21-15, 21-13), (21-15, 21-6)తో గోవాపై గెలుపొందాయి. బాలుర విభాగంలో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ (21-5, 21-13), (21-7, 21-13), (21-13, 21-13)తో తమిళనాడుపై గెలిచింది. ఈవెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ఆరంభించారు. ఇందులో గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్, భారత సెపక్తక్రా సమాఖ్య కార్యదర్శి యోగేందర్ సింగ్ దహియా, గన్‌ఫౌండ్రి కార్పొరేటర్ మమత గుప్తా, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు కె.రంగారావు, ప్రేమ్‌రాజ్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ బాబయ్య, డి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.