breaking news
Nala Damayanthi
-
దమయంతి కోసం..
‘నల దమయంతి’... అనగానే పురాణగాథ గుర్తొస్తుంది. కానీ ఆ పేరుతో ఓ యువతరం కథ తెరకెక్కుతోంది. కొవెరా దర్శకత్వంలో రవి పనస ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నారా రోహిత్ ఈ సినిమాకు సమర్పకునిగా వ్యవహరిస్తుండటం విశేషం. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ కథానాయిక హీరోయిన్గా నటించనుంది. నిఖితా నారాయణ మరో హీరోయిన్. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘ఎవరూ ఊహించని, అంతు చిక్కని కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుంది. ఈ నెల 2న మొదలైన తొలి షెడ్యూల్ ఈ నెల 12 వరకూ జరుగుతుంది. ఈ నెల 20 నుంచి జూన్ 20 వరకూ రెండో షెడ్యూల్ ఉంటుంది. కేరళతో 15 రోజుల పాటు జరిగే చివరి షెడ్యూల్తో చిత్రీకరణ పూర్తవుతుంది. ఇందులో నటించనున్న ప్రముఖ హీరోయిన్ తో పాటు ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: మహి ఇల్లీంద్ర, కెమెరా: పి.జి.విందా, సంగీతం: సత్య మహావీర్. -
నల దమయంతి
ఇప్పటివరకూ మీడియా ప్రచార రంగంలో ఉన్న ఆర్కె మీడియా సంస్థ చిత్ర నిర్మాణానికి సిద్ధమవుతోంది. సంస్థ అధినేత పనస రవికుమార్ నిర్మాతగా తొలి అడుగు వేయనున్నారు. ‘రవి పనస ఫిల్మ్ కార్పొరేషన్’ అనే సంస్థను స్థాపించి, చిన్న చిత్రాలను, భారీ ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించడానికి ఆయన సమాయత్తమవుతున్నారు. ఈ సంస్థలో తొలి ప్రయత్నంగా రాబోతున్న చిత్రం ‘నల దమయంతి’. ప్రేమ.. ఇష్క్.. కాదల్, సెకండ్ హ్యాండ్, ప్రతినిథి చిత్రాలలో నటించిన శ్రీవిష్ణు అలియాస్ రాయల్ రాజు ఈ చిత్రంలో కథానాయకుడు. విజయేంద్రప్రసాద్ సహాయకుడు కోవెరా ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ముగ్గురు కథానాయికలు ఇందులో నటించనున్నారు. ఈ చిత్రానికి నారా రోహిత్ సమర్పకునిగా వ్యవహరించడం విశేషం. రవి పనస ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై రాబోయే సినిమాల వివరాలు త్వరలో ప్రకటిస్తామని రవి పనస తెలిపారు.