breaking news
nagrota
-
కశ్మీర్లో రాజకీయ దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో ఉప ఎన్నికలకు ముందే రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మిత్రపక్షాలైన నేషనల్ కాన్ఫరెన్స్– కాంగ్రెస్ కూటమిపై నీలినీడలు కమ్ముకున్నాయి. బడ్గాం, నగ్రోటా అసెంబ్లీ నియోజకవర్గాలలో జరుగనున్న ఉప ఎన్నికలు ఒమర్ ప్రభుత్వానికి సమస్యలను పెంచాయి. నగ్రోటా ఉప ఎన్నికలో పోటీ చేయడంపై రెండు రాజకీయ పార్టీలు దాదాపుగా ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ స్థానం నుంచి పోటీకి అటు నేషనల్ కాన్ఫరెన్స్, ఇటు కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేవు. నగ్రోటాలో రెండు పార్టీల మధ్య ఎటువంటి ఒప్పందం కుదరకపోతే కాంగ్రెస్ పార్టీ కూటమి నుంచి బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ సీట్లపై ఇప్పుడు బీజేపీ దృష్టి సారించింది. నిజానికి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఒమర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. దీని తరువాత, కాంగ్రెస్ కూడా నేషనల్ కాన్ఫరెన్స్‌తో ఘర్షణ మూడ్‌లో ఉంది. కాంగ్రెస్ నాయకులు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా అంశంపై గళం విప్పుతూ, ముఖ్యమంత్రిని కూడా బెదిరిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో నేషనల్ కాన్ఫరెన్స్‌కు 41 సీట్లు ఉన్నాయి. ఇది కాకుండా, ప్రభుత్వానికి ఆరుగురు కాంగ్రెస్, ఏడుగురు స్వతంత్రులు, ఒక సీపీఐ(ఎం) ఎమ్మెల్యే మద్దతు ఉంది. మిత్రపక్షాల మద్దతుదారుల సంఖ్యతో కలిపి నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వానికి 55 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ నగ్రోటా ఉప ఎన్నిక బరి నుంచి వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదు. అందువల్ల ఈ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో నేషనల్ కాన్ఫరెన్స్ తన అభ్యరి్థని నిలబెడితే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొనే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంటే, ఒమర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల సంఖ్య 49కి తగ్గుతుంది. మరోవైపు నగ్రోటా స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ వల్ల బీజేపీకి ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ కూడా గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించింది. కాగా బడ్గాం స్థానంలోనూ కమలదళం తన అభ్యరి్థని నిలబెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు ఇక్కడ ప్రధాన పోటీ నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీల మధ్యే ఉండేది. అయితే అమర్నాథ్ యాత్ర తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం నగ్రోటా, బడ్‌గాంల్లో ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ రెండు సీట్లు ఖాళీగా ఉండి ఆరు నెలలు అయ్యింది. అయితే ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే ఆరు నెలల తర్వాత ఏదైనా సీటును ఖాళీగా ఉంచవచ్చు. ఆరు నెలల వ్యవధి తర్వాత కూడా ఒక సీటును ఖాళీగా ఉంచడానికి ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. -
ఆర్మీ క్యాంపులోకి ఉగ్రవాదులు ఎలా వచ్చారంటే..?
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని నగ్రోటాలోగల ఆర్మీ యూనిట్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు దాడికోసం చాలా పకడ్బందీ ప్రణాళితో వచ్చినట్లు తెలిసింది. ఆ రోజు వారు సైలెన్సర్ గన్ ఉపయోగించి సెంట్రీని తొలుత కాల్చి చంపి లోపలికి ప్రవేశించినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. ఇలాంటి చర్యకు దిగడం ఇదే తొలిసారి అని చెప్పారు. జమ్మూ జిల్లాలోని నగ్రోటాలో ఆర్మీ యూనిట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆరోజు తెల్లవారుజామున 5:30 గంటలకు ఉగ్రవాదులు ఒక్కసారిగా ఆర్మీ క్యాంప్‌పై గ్రెనేడ్లు, కాల్పులతో దాడికి దిగారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు ప్రారంభించడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఓ జవాన్ మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనకు గల కారణాలను అన్వేషించిన ఆర్మీ అధికారులు పలు ఆధారాలు గుర్తించారు. తొలుత ఆర్మీ యూనిట్ ప్రాంగణంలోకి సమీపించిన ఉగ్రవాదులు వెనుక వైపు నుంచి ఎలిఫాంట్ గ్రాస్ ద్వారా ప్రవేశ మార్గం వద్దకు వచ్చారని, అక్కడ ఉన్న సెంట్రీని సైలెన్సర్ బిగించిన తుపాకీతో కాల్చి చంపి ఒక్కసారిగా లోపలికి ప్రవేశించారని తెలిపారు. ఆ విషయం ఒకరు గుర్తించగానే ప్రాంగణంలో భయానక వాతావరణం నెలకొందని, అక్కడే ఆయుధగారాలు, ఆర్మీ కుటుంబాలు ఉన్నాయని వారినే లక్ష్యంగా చేసుకొని దాడికి దిగగా సమర్థంగా తిప్పికొట్టినట్లు చెప్పారు. -
ఇంకెంత మంది సైనికులు మరణించాలి?
న్యూఢిల్లీ: ‘దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయడంతో టెర్రరిస్టులకు, మిలిటెంట్లకు నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక మన దేశ సరిహద్దులన్నీ పూర్తిగా సురక్షితం’ అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ నవంబర్ 27వ తేదీ నాడు వ్యాఖ్యానించారు. ‘ఒక్కసారి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరు కూడా భారత్‌లోకి అడుగు పెట్టేందుకు సాహసించరు’ అని 2014, ఏప్రిల్ నెలలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఓ ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ భూభాగంలోకి మన సైనికులు చొచ్చుకుపోయి ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు సూపర్‌గా చేశారని ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో కిందిస్థాయి నుంచి పైస్థాయి నాయకత్వం వరకు చంకలు గుద్దుకున్నారు. ఈ వ్యాఖ్యలన్నీ నేడు నిజమే అయితే మంగళవారం నాడు జమ్మూకు సరిగ్గా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగ్రోటాలోని భద్రతా బలగాల స్థావరంపై సరిహద్దులు దాటి వచ్చిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఎలా దాడి చేశారు? సర్జికల్ దాడులతోపాటు పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కేవలం ప్రచార అస్త్రాలుగానే మిగిలిపోతున్నాయా? నగ్రోటాలో భద్రతా బలగాల స్థావరంపై సైనిక దళాలు జరిపిన దాడుల్లో ఇద్దరు అధికారులు, ఐదుగురు సైనికులు మరణించిన విషయం తెల్సిందే. ఈ ఒక్క నెలలోనే 11 మంది మరణించగా, గడిచిన మూడు నెలల్లో టెర్రరిస్టుల దాడులకు 40 మంది సైనికులు మరణించారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌తో మొదలైన ఈ దాడులు పఠాన్‌కోట్, ఊడికి విస్తరించి, ఇప్పుడు నగ్రోటాకు పాకాయి. ఈ అన్ని దాడులు సూచిస్తున్న ఓ కామన్ పాయింట్నన్నా కేంద్ర ప్రభుత్వం పట్టుకుందా? అదే సైనికులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని టెర్రరిస్టులు దాడులను నిర్వహించడం. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ.... నగ్రోటాలోని 16వ పటాలానికి కమాండింగ్ జనరల్ ఆఫీసర్‌గా గత అక్టోబర్ నెలలోనే బాధ్యతలు స్వీకరించిన లెఫ్ట్‌నెంట్ జనరల్ ఏకే శర్మకు వారం రోజుల క్రితమే పటాలంపై పెద్ద దాడి జరగబోతోందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందిందట. వాస్తవానికి రెండో సిక్కు రిజిమెంట్ బెటాలియన్‌కు చెందిన శర్మకు తిరుగుబాటు కార్యకలాపాలను ఎదుర్కోవడంలో అపారమైన అనుభవం ఉందట. అందుకనే ఈకొత్త విధులు అప్పగించారట. అయినా ఆయన తనకందిన సమాచారం ప్రకారం తన కిందిస్థాయి అధికారులందరికి అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారట. అయినా అన్ని చోట్ల లోపాలు.... నగ్రోట స్థావరంలోకి వచ్చిన తమిళ పటాలంకు అసలు ఆయుధాలే ఇవ్వలేదట. భోజన శాలకు సమీపంలో టెంటుల్లో పడుకున్న సైనికుల వద్ద ఎదురు కాల్పులు జరపడానికి ఆయుధాలే లేవట. ఎదురుకాల్పుల్లో చనిపోయింది ముగ్గురు ఉగ్రవాదులని, మరో ముగ్గురు ఉగ్రవాదులు తప్పించుకుపోయారని కొందరు అధికారులు చెబుతుండగా, మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు చనిపోయారని మరికొందరు అధికారులు చెబుతున్నారు. ఎందుకీ సమన్వయ లోపం, లోపాలకు ఎవరు బాధ్యలు? పక్కా ప్రణాళిక ఎప్పుడు? పఠాన్‌కోట్ నుంచి ఊడి వరకు టెర్రరిస్టులు దాడులు జరిపినా, 40 మంది వీరులు మరణించినా పాలకులు ఎందుకు మేల్కోవడం లేదు? ఇలాంటి దాడులు పునరావతం కాకుండా పక్కా ప్రణాళికను ఎందుకు రచించడం లేదు ? సైన్యానికి, ప్రభుత్వానికే కాకుండా, ప్రభుత్వం పెద్దల మధ్యనే సమన్వయలోపం ఉందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. పఠాన్‌కోట్ దాడిలో ఆరుగురు టెర్రరిస్టులు మరణించారని సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించగా, ప్రభుత్వం నలుగురే దాడి చేశారని, ఆ నలుగురు మరణించారని నవంబర్ 29న పార్లమెంట్లో ప్రకటించింది. పాలకులు కేవలం ప్రచారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా, చిత్తశుద్ధితో పక్కావ్యూహంతో ముందుకు వెళ్లనంతా కాలం మన సైనిక వీరులు అన్యాయంగా మరణిస్తూనే ఉంటారు. పాలకులు నివాళులర్పించడం మినహా చేయగలిగిందీ ఏమీ ఉండదు. -ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూ జిల్లాలోని నగ్రోటాలో ఆర్మీ యూనిట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఉగ్రవాదులు ఒక్కసారిగా ఆర్మీ క్యాంప్‌పై గ్రెనేడ్లు, కాల్పులతో దాడికి దిగారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు ప్రారంభించడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని సీనియర్ భద్రతా అధికారి వెల్లడించారు. ఈ ఘటనలో ఓ జవాన్ మృతి చెందగా మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు నక్కిఉన్నారని, కాల్పులు కొనసాగుతున్నాయని ఆర్మీ అధికారి తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా నగ్రోటాలోని పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. జమ్మూ-శ్రీనగర్ హైవేను మూసివేసి తనిఖీలు ముమ్మరం చేశారు. మరోఘటనలో సాంబా జిల్లాలోని రామ్‌ఘర్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉగ్రవాదులు చేసిన చొరబాటు యత్నాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు తిప్పికొట్టారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ ఘటనలో ఓ జవాన్ సైతం గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. -
మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు