breaking news
mydukur mla
-
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా
►మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి సాక్షి, దువ్వూరు : ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతున్నట్లుగా కొన్ని దుష్టశక్తులు తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయని, తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా దువ్వూరులో నిన్న (సోమవారం) పార్టీ నాయకుడు సిద్ధయ్యనాయుడు స్వగృహంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ సీపీ తరఫున తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఆ పార్టీ తరఫున గెలిచి టీడీపీలో చేరడమనేది తన స్వభావానికి పూర్తి విరుద్ధమని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఇరగంరెడ్డి శంకర్‌రెడ్డి, బొంతపల్లె వెంకటసుబ్బారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరయ్య పాల్గొన్నారు. -
రేపు ఆకేపాటి ప్రమాణ స్వీకారం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆకేపాటి అమరనాథరెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామరెడ్డి తెలిపారు. కడపలోని వైఎస్ అతిథి గృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అమరనాథరెడ్డిని నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న ఆకేపాటి పార్టీని అన్ని రకాలుగా పటిష్టం చేయగలరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను సమర్థవంతంగా ఎదుర్కోగల శక్తి ఆకేపాటికే ఉందని చెప్పారు. కాగా ఆకేపాటి ప్రమాణ స్వీకారానికి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా, మండల కో-ఆప్షన్ సభ్యులు సహా అన్ని క్యాడర్ల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని చెప్పారు. పార్టీ అభ్యున్నతికి అందరి సలహా, సూచనలు స్వీకరిస్తామని ఆకేపాటి అమరనాథరెడ్డి తెలిపారు. -
అధికారంలోకి రావడానికి వంద అబద్ధాలు
కడప కార్పొరేషన్: వంద అబద్దాలు ఆడి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని వైఎస్ఆర్సీపీ క్రమశిక్షణా కమిటీ సభ్యులు, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి ఎద్దేవా చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మేయర్ కె. సురేష్‌బాబు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అకేపాటి అమర్నాథ్రెడ్డితో కలిసి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో అధికారపార్టీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని, వైఎస్ జగన్‌ను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుని చర్చను పక్కదారి పట్టించిందన్నారు. తద్వారా నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశంలేకుండా వ్యవహరించిందన్నారు. కొత్త రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి అంశాల ప్రస్తావనే లేకుండా పదిహేను రోజులపాటు విమర్శలతోనే కాలం వెల్లబుచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురుదాడితో ఎంతకాలం నెట్టుకొస్తారో చూడాలన్నారు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరునెలలకు చేస్తారా.. సంవత్సరానికి చేస్తారా.. బడ్జెట్లో కేటాయించిన రూ. 5వేల కోట్లు ఇందుకు సరిపోతాయా... అని ఆయన ప్రశ్నించారు. రుణాలు కట్టాలని లేనిపక్షంలో బంగారు వేలం వేస్తామని ఇప్పటికే రైతులకు బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయన్నారు. వేలం వేస్తే ఆ అవమానాన్ని భరించలేక ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే బాధ్యత ఎవరిదని నిలదీశారు. సాగునీటి ప్రాజెక్టులకు ఈ ప్రభుత్వం ఏం చేయబోతోందో చెప్పకుండా ఎంతసేపు వైఎస్ హయాంలో నిధులు దుర్వినియోగమయ్యాయని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. అసెంబ్లీలో రాజధాని రాజధాని విషయమై అధికార పక్షం అనుసరించిన విధానం చాలా నిరంకుశంగా ఉందని మండిపడ్డారు. మద్రాస్ నుంచి విడిపోయినప్పుడు ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో రాజధానిపై అసెంబ్లీలో ఐదురోజులపాటు చ ర్చ జరిగిందని, ఓటింగ్ కూడా నిర్వహించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం చర్చకు అనుమతించ కుండా, ప్రకటన చేసి చర్చించాలనడం అప్రజాస్వామికమన్నారు. ఐదేళ్ల క్రితం రాష్ట్రాన్ని పాలించి, ఈలోకంలో లేకుండా పోయిన వ్యక్తిని పదేపదే విమర్శిస్తున్న అధికార పార్టీ నాయకులు ఆ తర్వాత పాలించిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలను పల్లెత్తు మాట కూడా అన రని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తెలిపారు. ప్రతిపక్షం ఇచ్చే సలహాలు, సూచనలు స్వీకరించకుండా గొంతునొక్కడం దుర్మార్గమన్నారు. సమావేశంలో జెడ్పీ వైస్ ఛైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, పార్టీనాయకులు యానాదయ్య, కరీముల్లా పాల్గొన్నారు.