breaking news
must for students
-
విద్యార్థులకూ ఆధార్
♦ అనుసంధానంతో కచ్చితమైన విద్యార్థుల సంఖ్య ♦ నత్తనడకన సీడింగ్.. సగటు 85 శాతం మాత్రమే నమోదు నియోజకవర్గం : హిందూపురం పాఠశాలల సంఖ్య : 263 మొత్తం విద్యార్థులు : 40,327 మంది ఇప్పటివరకు సగటు సీడింగ్ : 85 శాతం మాత్రమే మండలం విద్యార్థుల సంఖ్య పూర్తయిన శాతం హిందూపురం : 27,677 90.7 లేపాక్షి : 9,150 97 చిలమత్తూరు : 7,500 70 సంక్షేమ పథకాలకే పరిమితమైన ‘ఆధార్’ అనుసంధానం విద్యా వ్యవస్థలోనూ అమలు చేయనున్నారు. విద్యాభివృద్ధికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ఆ స్థాయిలో ప్రయోజనాలు విద్యార్థులకు అందటం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థి ఆధార్ సంఖ్యను సేకరించి ఆన్లైన్లో పొందుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది. హిందూపురం నియోజకవర్గంలోని 263 ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 40,327 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 60 వేలకు పైగా చదువుతున్నారు. గతేడాది నుంచే ప్రతి విద్యార్థి ఆధార్ సంఖ్యను కచ్చితంగా నమోదు చేయాలని ఆదేశాలున్నా.. నేటి వరకు సగటు 85 శాతం మాత్రమే నమోదు చేసుకోగలిగారు. అయితే ఈ ఏడాది 100 శాతం ఆధార్ నమోదు పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు ఆదేశాలిచ్చారు. అక్రమాలకు అడ్డుకట్ట? ప్రభుత్వ పాఠశాలల్లోని పాఠ్యపుస్తకాలు మార్కెట్కు తరలిపోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కొంతమంది మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు అధికారులతో చేతులు కలిపి అవినీతికి పాల్పడుతున్నారనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఆధార్ అనుసంధానంతో బడిబయట పిల్లల వివరాలు, పాఠశాల పనితీరు, ఉపాధ్యాయుల సామర్థ్యం బహిర్గతమవుతాయి. దీంతో విద్యావ్యవస్థలో అక్రమాలు, అలసత్వానికి అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా మరో పదిరోజుల్లో అనుసంధానం పూర్తి చేస్తామని ఎంఈఓ గంగప్ప తెలిపారు. అక్రమాలు బయటపడుతాయి : యాసిర్ఖాన్, విద్యార్థిని తండ్రి, హిందూపురం ఆధార్ అనుసంధానంతో మధ్యాహ్న భోజన పథకాల్లో జరుగుతున్న అక్రమాలు బయటపడుతాయి. గతంలో వందమంది విద్యార్థులు స్కూల్కు వస్తే 300 వరకు వస్తున్నట్లు సంఖ్యలు రాసుకుని ఏజెన్సీ నిర్వాహకులు అవినీతికి పాల్పడేవారు. ఆధార్ అనుసంధానం చేయడంతో అలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. -
వామపక్ష రాష్ట్రంలో యోగా తప్పనిసరి
అది ఓ వామపక్ష పాలిత రాష్ట్రం. అయినా అక్కడి విద్యార్థులకు యోగా తప్పనిసరి చేశారు. గుజరాత్ తర్వాత అలా చేసిన ఏకైక రాష్ట్రం.. త్రిపుర! అవును.. జనవరి 1 నుంచి ఆ రాష్ట్రంలో 1-8వ తరగతి వరకు చదివే విద్యార్థులందరూ తప్పనిసరిగా యోగా నేర్చుకోవాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. తొలిదశలో రాష్ట్రంలోని వంద స్కూళ్లలో దీన్ని అమలుచేస్తామని, క్రమంగా అన్నింటికీ విస్తరిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తపన్ చక్రవర్తి చెప్పారు. పట్టణ, గ్రామీణ, త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ (టీటీఈఈడీసీ) ప్రాంతాల నుంచి ఈ స్కూళ్లను ఎన్నుకుంటారు. ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం కోసం యోగాను నేర్పిస్తామని తపన్ చక్రవర్తి తెలిపారు. దీనివల్ల భావితరాలు క్రమశిక్షణతో ఉంటాయని ఆయన అన్నారు. ముందుగా కొంతమంది టీచర్లకు యోగాలో శిక్షణ ఇప్పిస్తామని, వాళ్లు పిల్లలకు నేర్పిస్తారని చెప్పారు. ఈ నిర్ణయాన్ని కొంతమంది స్వాగతిస్తుండగా, మరికొందరు మాత్రం అనవసరమని కొట్టిపారేస్తున్నారు. మాణిక్ సర్కార్ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీని మంచి చేసుకోడానికే యోగా ప్రవేశపెడుతోందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. రాష్ట్ర బీజేపీ వర్గాలు మాత్రం.. ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి.